తహసీల్దార్, బీఎల్‌వోలపై టీడీపీ నేతల దాష్టీకం

30 Nov, 2023 03:51 IST|Sakshi

టీడీపీ సానుభూతిపరుల డబుల్‌ ఎంట్రీ ఓట్లను తొలగించొద్దంటూ దౌర్జన్యం

వైఎస్సార్‌సీపీ అభిమానుల ఓట్లు తీసివేయాలంటూ కుప్పలు తెప్పలుగా దరఖాస్తు

తహసీల్దార్‌ షేక్‌ జాన్‌సైదులుపై మాజీ ఎమ్మెల్యే ఆంజనేయులు బెదిరింపు

సాక్షి, నరసరావుపేట/శావల్యాపురం: ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు డబుల్‌ ఎంట్రీ ఓట్లను తొలగించేందుకు నోటీసులు ఇచ్చిన శావల్యాపురం తహసీల్దార్‌పై పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మంగళవారం దౌర్జన్యా­నికి పాల్పడ్డారు. టీడీపీ సానుభూతిపరులు డ­బు­ల్‌ ఎంట్రీ ఓట్లను తొలగిస్తే న్యాయపరంగా చిక్కులు ఎదుర్కొంటారంటూ తహసీల్దార్, బీఎల్‌వోల­ను బెదిరించారు.

పదుల సంఖ్యలో కార్యకర్తలను వెంటబెట్టుకుని తహసీల్దార్‌ కార్యాలయంలోకి ప్రవేశించి తహసీల్దార్‌ షేక్‌ జాన్‌ సైదులుపై అసభ్య ప­దాలతో దూషణలకు దిగారు. వైఎస్సార్‌సీపీ అభిమా­నుల ఓట్లు తీసివేయాలని భారీగా ఫారం–7­ల­ను దరఖాస్తు చేసి అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. టీడీపీ దరఖాస్తు చేసిన ఫారం–7 దరఖాస్తులు దు­రుద్దేశంతో చేసినవని అధికారులు నిర్ధారణకు వచ్చి­న తర్వాత తగిన అధారాలతో తిరస్కరించినట్టు సమాచారం ఇచ్చారు. అయితే.. వాటిని తొలగించా­ల్సిందేనని జీవీ ఆంజనేయులు పట్టుబట్టారు. గట్టిగా కేకలు వేస్తూ తహసీల్దార్‌పై జులుం ప్రదర్శించా­రు. 

పోలింగ్‌ కేంద్రం మార్చడంపైనా రాజకీయం
మండలంలోని గుంటుపాలెంలో 141 పోలింగ్‌ కేంద్రం గతంలో ప్రాథమిక పాఠశాలలో ఉండేది. పాఠశా­ల గదులు పాడవడం, శ్లాబు పెచ్చులు ఊడిపోతుండటం, కనీస వసతులు లేకపోవడంతో పోలింగ్‌ కేంద్రాన్ని మార్చాలని జిల్లా ఎన్నికల అధికారి ఆ దేశాలు జారీ చేశారు. దీంతో అదే గ్రామంలో అ­న్ని సౌకర్యాలున్న సచివాలయంలోకి మార్చారు. దీ­ని­పైనా జీవీ ఆంజనేయులు రాద్ధాంతం చేశారు.

మరో­వైపు టీడీపీ నేతలు పలువురికి వినుకొండ నియోజకవర్గంతో పాటు గుంటూరు, మచిలీపట్నం, విజయవాడ, హైదరాబాద్‌ వంటి చోట్ల ఓట్లు ఉంటున్నా­యి. దీనిపై ఎన్నికల సంఘం నుంచి వచ్చిన సమాచారం మేరకు సదరు ఓటర్లకు స్థానిక అధికారులు నోటీసులు అందజేస్తున్నారు. నోటీసులు ఇవ్వడంపై జీవీ ఆంజనేయులు తహసీల్దార్‌పై విరుచుకుపడ్డారు. డబుల్‌ ఎంట్రీలు తొలగిస్తే చూస్తు ఊరుకోనంటూ ఊగిపోయారు. కాగా.. విధి నిర్వహణలో ఉన్న రెవెన్యూ అధికారులపై దుర్భాషలాడటం, బెదిరించడం సరికాదని జిల్లా రెవెన్యూ సర్వీసెస్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు నాగమల్లేశ్వరరావు పేర్కొన్నారు.

ఇలాంటి దాడులను అరికట్టాలని జిల్లా కలెక్టర్‌ను కోరినట్టు తెలిపారు. మాజీ ఎమ్మెల్మే జీవీ ఆంజనేయులు అసభ్య పదజాలంతో దూషించటంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తహసీల్దారు షేక్‌ జాన్‌సైదులు చెప్పారు. మాజీ ఎమ్మెల్యే ఇష్టానుసారంగా మాట్లాడటం మంచి పద్ధతి కాదన్నారు. ఎన్నికల కమిషనర్‌ ఆదేశాల మేరకు ఓట్లు తొలగింపు, మార్పులు చేర్పులన్నీ సమగ్ర ఆధారా­లతో అన్‌లైన్‌ విధానంలో జరుగుతున్నాయన్నారు.

మరిన్ని వార్తలు