Bigg Boss 7 Day 87 Highlights: ఒక్కటైపోయిన అమర్-శోభా.. ప్రియాంకని చూస్తే పాపం అనిపించింది!

29 Nov, 2023 23:27 IST|Sakshi

బిగ్‌బాస్ ప్రస్తుత సీజన్‌లో ఫినాలేలో తొలి స్థానం కోసం మంచి పోటీ నడుస్తోంది. మంగళవారం ఓ మూడు గేమ్స్ జరగ్గా.. తాజాగా మరో రెండు గేమ్స్ జరిగాయి. ఇందులో SPY(శివాజీ, ప్రశాంత్, యావర్) బ్యాచ్‌కి షాక్ తగిలింది. మరోవైపు సీరియల్ బ్యాచ్ లో ప్రియాంకని ఒంటరి చేసేశారు. శోభా-అమర్ కలిసి ఈమెపై  మానసికంగా దాడి చేశారు. ఇంతకీ బుధవారం ఎపిసోడ్‌లో అసలేం జరిగిందనేది Day 87 హైలెైట్స్‌లో ఇప్పుడు చూద్దాం.

ఓ దాంట్లో టాప్.. మరో దానిలో ఫెయిల్
సోమవారం మూడు గేమ్స్ జరగ్గా.. రెండింటిలో అర్జున్ విజయం సాధించాడు. తాజాగా బుధవారం పెట్టిన గేమ్స్‌లోనూ అర్జున్ చాలా స్మార్ట్‌గా వ్యవహరించాడు. 'టికెట్ టూ ఫినాలే' కోసం 'ఎత్తరా జెండా' అని పెట్టిన నాలుగో గేమ్‌లో ప్రశాంత్, యావర్ తొలి రెండు స్థానాల్లో నిలవగా.. అర్జున్ మూడో స్థానం సంపాదించాడు. ఇక 'గెస్ చేయ్ గురూ' అని పెట్టిన ఐదో గేమ్‌లో.. వినిపించే సౌండ్స్ బట్టి, అవేంటనేవి వరసగా పలకపై రాయాల్సి ఉంటుంది. ఇందులో అర్జున్ 31 పాయింట్లతో టాప్‌లో నిలిచాడు. ఇదే పోటీలో సరిగా ఆడని కారణం.. ప్రశాంత్, యావర్ మధ్యలో ఔట్ అయిపోయారు. అలా స్పై బ్యాచ్ ఎదురుదెబ్బ తగిలింది

(ఇదీ చదవండి: బ్రేకప్ స్టోరీ బయటపెట్టిన యాంకర్ శ్రీముఖి.. పెళ్లి గురించి హింట్!)

ప్రియాంక పాయింట్స్ దానం
ఇక ఐదు గేమ్స్ పూర్తయిన తర్వాత చివరి స్థానంలో ప్రియాంక ఉన్న కారణంగా.. 'టికెట్ టూ ఫినాలే' రేసు నుంచి ఆమెని బిగ్‌బాస్ తప్పించాడు. అయితే ఆమె దగ్గరున్న వాటిలో సగం పాయింట్స్ వేరొకరికి ఇచ్చేయాల్సి ఉంటుంది చెప్పగా.. 125 పాయింట్లని గౌతమ్‌కి ఇచ్చేసింది. దీంతో ఓవరాల్ పొజిషన్‌లో గౌతమ్... మూడో స్థానానికి చేరుకున్నాడు. అయితే ఆ పాయింట్లు తనకు ఇస్తుందనుకున్న అమర్.. ప్రియాంకపై అలిగాడు.

మాటలు జారిన అమర్
ప్రియాంక ఎలిమినేట్ అయిపోయి, తన పాయింట్లు గౌతమ్‌కి ఇచ్చేయడాన్ని అమర్ తీసుకోలేకపోయాడు. ఆమె తప్పు చేసిందని అన్నాడు. అది తన గేమ్, తను ఎవరికైనా ఇచ్చుకోవచ్చు అని శోభా.. పరిస్థితి వివరించడానికి చూసింది. కానీ అమర్ తీసుకోలేకపోయాడు. కాసేపటి తర్వాత ప్రియాంకతో మాట్లాడుతూ.. నాకు ఇవ్వాలనిపించలేదా? అని అమర్.. డైరెక్ట్‌గా ఆమెనే అడిగాడు. ప్రియాంక, అమర్‌కి పరిస్థితి అర్థమయ్యేలా చెప్పడానికి చూస్తుంటే.. 'వెధవని అయిపోయింది నేనేగా' అని అమర్ మాట జారాడు. ఏం చెప్పాలనుకుంటున్నావ్, క్లియర్‌గా చెప్పి వెళ్లు అని ప్రియాంక.. తిరిగి మాట్లాడుతుండగానే అమర్ అక్కడి నుంచి లేచి వెళ్లిపోయాడు. 

(ఇదీ చదవండి: Kiraak RP Marriage: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న క‌మెడియ‌న్‌ కిర్రాక్ ఆర్పీ..)

అమర్ ఇలా తయారయ్యాడేంటి?
ప్రియాంకపై ఏది పడితే మాట్లాడేసిన అమర్.. 'అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయకూడదు, మన అనేది ఎక్స్‌పెక్ట్ చేయకూడదు' అని తనలో తానే ఏదేదో మాట్లాడేసుకున్నాడు. 'పిచ్చ నా కొడకా, ఇప్పుడైనా నీకు కళ్లు తెరుచుకుంటే బాగుపడతావ్' అని తనని తానే తిట్టుకున్నాడు. మరోచోట.. ప్రియాంక, గౌతమ్‌తో మాట్లాడుతూ.. వాళ్లకు వాళ్లకే గ్రాటిట్యూడ్ ఉంటుంది, మాకు ఉండదా అని శోభా-అమర్‌ని ఉద్దేశిస్తూ తన మనసులో మాట బయటపెట్టింది.

ఇదంతా జరిగిన కాసేపటి తర్వాత అమర్ దగ్గరకొచ్చిన ప్రియాంక.. చేసిన దానికి క్షమాపణలు చెప్పింది. తప్పయిపోయింది, ప్లీజ్ క్షమించు అని బతిమాలాడుకుంది. అయినా సరే అమర్.. శాంతించలేదు. దీంతో మిగతా వాళ్లతో ఈ విషయం గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇక్కడ ఓ విషయం మాత్రం వింతగా అనిపించింది. ఎందుకంటే అమర్.. మరీ స్వార్థపరుడిలా ప్రవర్తించాడా అనే సందేహం వచ్చింది. ఎంత ఫ్రెండ్స్ అయితే మాత్రం ప్రియాంక ఏం చేయాలో కూడా అమరే డిసైడ్ చేస్తాడా? ఆమెకు స్వాతంత్రం లేదా అనిపించింది. అలా బుధవారం ఎపిసోడ్ ముగిసింది.

(ఇదీ చదవండి: 'సలార్' స్టోరీ లీక్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. అదీ మ్యాటర్!)

మరిన్ని వార్తలు