వాళ్లు కలిసే పోటీ చేస్తారు: బండి సంజయ్‌

15 Feb, 2023 04:59 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో రోజురోజుకు బలపడుతున్న బీజేపీ ఒంటరిగానే అధికారంలోకి వస్తుందన్న ఆందోళనతోనే.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం, కమ్యూనిస్టులు కలిసి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు ఎన్నికల వరకు ఈ పారీ్టలన్నీ కొట్లాడుకుంటున్నట్టు నటిస్తున్నాయని విమర్శించారు. వాళ్లంతా దండుపాళ్యం ముఠా అని.. ఒకరు దేశాన్ని దోచుకుంటే, మరొకరు కొన్ని రాష్ట్రాలను దోచుకున్నారని, బీఆర్‌ఎస్‌ తెలంగాణను దోచుకుంటోందని ఆరోపించారు. మంగళవారం ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ తరుణ్‌ ఛుగ్‌తో భేటీ అనంతరం బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడారు. 

‘‘తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ క్షేత్రస్థాయికి ఎప్పుడో దూరమైంది. ఇప్పుడు కాంగ్రెస్‌ నాయకులు వాస్తవాలు బయటపెట్టారు. కాంగ్రెస్‌ ఎలాగూ అధికారంలోకి రాదు. కాంగ్రెస్‌–బీఆర్‌ఎస్‌ కలిసి ఉంటాయన్న విషయాన్ని పరోక్షంగా చెప్పేశారు. బీఆర్‌ఎస్‌–కాంగ్రెస్‌ కలిసి పోటీ చేస్తాయన్న విషయాన్ని మేం ఎప్పుడో చెప్పాం. ప్రజలు కాంగ్రెస్‌–బీఆర్‌ఎస్‌ను ప్రజలు వేరుగా చూడట్లేదు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యరి్థకి ప్రజలు ఓటేస్తే.. వాళ్లు గెలిచి చివరికి వెళ్లేది బీఆర్‌ఎస్‌ పారీ్టలోకే. గతంలో ఇదే జరిగింది. తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులకు బీఆర్‌ఎస్‌తో కొట్లాడే దమ్ము లేదని.. కొట్లాడి గెలిపించినా వాళ్లు ఎలాగూ బీఆర్‌ఎస్‌ పారీ్టలోకే వెళ్తారని కాంగ్రెస్‌ అధిష్టానం కూడా భావిస్తోంది.

అందుకే తెలంగాణలో పార్టీని కాపాడుకునేందుకు బీఆర్‌ఎస్‌తో కలిసి ఉండాలని కాంగ్రెస్‌ పెద్దలు అనుకుంటున్నారు. ఈ అంశంపై గతంలో ఢిల్లీలో చర్చలు జరిగాయి. ఎన్నికల ముందే కలిస్తే.. తెలంగాణలో బీజేపీ మరింత బలపడుతుందని కొందరు కాంగ్రెస్‌ నాయకులు అధిష్టానానికి చెప్పారు. అందుకే ఎన్నికల వరకు బీఆర్‌ఎస్‌తో కొట్లాడినట్టు నటిద్దామన్న ఆలోచనలో కాంగ్రెస్‌ ఉంది’’అని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచి్చ, తమ గడీలు బద్దలవుతాయని సీఎం కేసీఆర్‌ భయపడుతున్నారని.. అందుకే బీజేపీని టార్గెట్‌ చేస్తున్నారని బండి సంజయ్‌ ఆరోపించారు. 

ప్రజలను నమ్మించి మోసం చేయడమేంటి? 
‘‘తెలంగాణలో అధికారంలోకి వచ్చే పరిస్థితులు లేవని కాంగ్రెస్‌ నాయకులే చెప్తున్నప్పుడు.. ఆ పార్టీ పాదయాత్రలు ఎందుకు? అప్పుడప్పుడు చేసే ఆందోళనలు ఎందుకు? ప్రజలను నమ్మించి మోసం చేయడం ఎందుకు?’’అని సంజయ్‌ ప్రశ్నించారు. గతంలో బీజేపీ–బీఆర్‌ఎస్‌ ఒకటేనని ప్రచారం చేశా రని.. అసలు బీఆర్‌ఎస్‌–కాంగ్రెస్‌ ఒక్కటేననే వాస్త వం బయటికి వచ్చిందని చెప్పారు. గతంలోనూ తాము 119 స్థానాల్లో పోటీ చేశామని.. ఈసారి ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వయసు మీదపడుతుండటంతో కేసీఆర్‌ ఈ మధ్య అన్నీ మర్చిపోతున్నారని, బీజేపీ పెరుగుదలను చూసి డిప్రెషన్‌లోకి వెళ్లారని సంజయ్‌ వ్యాఖ్యానించారు.  

మరిన్ని వార్తలు