'ఇందిరమ్మ రాజ్యం సరిగ్గా ఉంటే ఎన్టీఆర్‌ పార్టీ ఎందుకు పెట్టేవారు?'

20 Nov, 2023 13:48 IST|Sakshi

కరీంనగర్: ఇందిరమ్మ పాలన బాగుంటే.. ఎన్టీఆర్ పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చిందని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీలో ప్రజలను జైళ్లలో పెట్టడమా..? అని ఆక్షేపించారు. కాంగ్రెస్ పాలనలోనే వలసలు జరిగాయని దుయ్యబట్టారు. 1969 ఉద్యమంలో విద్యార్థులను కాల్చి చంపింది ఎవరో మర్చిపోవద్దని గుర్తుచేశారు. మానుకొండూరు ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు.

కాంగ్రెస్ పాలనలో రైతులు ఆత్మహత్య చేసుకున్నారని సీఎం కేసీఆర్ విమర్శించారు. పార్టీల చరిత్ర ఎంటో తెలుసుకోవాలని ప్రజలకు సూచించారు. ఓటు తలరాతను మారుస్తుందని గుర్తు చేసిన సీఎం.. ఆలోచించి ఓటు వేయకపోతే అదే కాటేస్తుందని చెప్పారు. అధికారంలోకి వచ్చాక పింఛన్లను రూ.5 వేలకు పెంచుతామని ప్రకటించారు. ఆటోల ఫిట్‌నెస్ ఛార్జీలు రద్దు చేస్తామని చెప్పారు.

ఇదీ చదవండి: మేడ్చల్‌.. ఇక్కడ గెలిస్తే మంత్రి అయ్యినట్టే!


 

మరిన్ని వార్తలు