Karnataka: మాజీ మంత్రి శ్రీరాములు కాంగ్రెస్‌లో చేరుతున్నారా?

20 Nov, 2023 16:34 IST|Sakshi

బెంగళూరు: కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బి.శ్రీరాములు.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను సోమవారం బెంగళూరులోని ఆయన నివాసంలో కలిశారు. దీంతో శ్రీరాములు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. 

కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కుమారుడు విజయేంద్రను పార్టీ ఇటీవల నియమించింది. దీంతో ఈ పదవిని ఆశించిన శ్రీరాములుకు భంగపాటు ఎదురైంది. ఈ నేపథ్యంలో ఆయన పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే శ్రీరాములు తన కుమార్తె వివాహానికి ఆహ్వానించేందుకు డీకే నివాసానికి వెళ్లినట్లు సమాచారం.

శ్రీరాములు బొమ్మై నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో 2021 ఆగస్టు నుండి 2023 మే వరకు రాష్ట్ర రవాణా, గిరిజన సంక్షేమ శాఖలకు మంత్రిగా పనిచేశారు. అంతకుముందు 2020 అక్టోబర్ నుండి  2021 జూలై వరకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. శ్రీరాములు ప్రస్తుతం చిత్రదుర్గ జిల్లాలోని బళ్లారి రూరల్ మొలకల్మూరు నియోజకవర్గం నుంచి రాష్ట్ర శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

మరిన్ని వార్తలు