దళితుల శాశ్వత శత్రువు బీజేపీ

28 May, 2022 01:33 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న వంగపల్లి శ్రీనివాస్‌  

ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి  

మహబూబ్‌నగర్‌ రూరల్‌: మనువాద, బ్రాహ్మణ సిద్ధాంతాలతో దళిత, అణగారిన వర్గాలను విద్య, ఉపాధి, రాజకీయ, ఆర్థిక రంగాలకు దూరం చేస్తున్న బీజేపీయే తమ శాశ్వత శత్రువని ఎమ్మార్పీఎస్‌ (టీఎస్‌) రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. శుక్రవారం రెడ్‌క్రాస్‌ భవనంలో సంఘం మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ స్థాయి సదస్సు జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళిత, అణగారిన వర్గాల ప్రజలపై దాడులు నిత్యకృత్యమయ్యాయని ఆరోపించారు. విద్వేషాలతో మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ ఆకృత్యాలకు పాల్పడుతోందని విమర్శించారు. అంతకుముందు తెలంగాణ చౌరస్తా నుంచి కార్యకర్తలు ర్యాలీగా అంబేడ్కర్‌ చౌరస్తా వరకు చేరుకున్నారు.  సమావేశంలో ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌  శ్రీనివాస్, కార్యదర్శి మైబన్న, జిల్లా గౌరవాధ్యక్షుడు వెంకటయ్య పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు