Evening News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం

19 Sep, 2022 17:42 IST|Sakshi

1. 11.43% గ్రోత్‌రేట్‌తో దేశంలోనే ఏపీ నంబర్‌ వన్‌: సీఎం జగన్‌
మూడేళ్లలో 99 భారీ పరిశ్రమలు రాష్ట్రంలో ఉత్పత్తిని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. భారీ పరిశ్రమల ద్వారా 46,280కోట్ల పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు. వీటి ద్వారా రాష్ట్రంలో 62వేల 541 మందికి ఉపాధి లభించిందని వెల్లడించారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. మార్గదర్శికేసులో రామోజీకి సుప్రీంకోర్టు నోటీసులు
మార్గదర్శి కేసులో రామోజీరావుకు, ఏపీ​ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. సుప్రీంకోర్టులో ఈ కేసుపై సోమవారం విచారణ జరిగింది. కేసుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం తరపున వికాస్‌ సింగ్‌ వాదనలు వినిపించారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. ఏపీ అసెంబ్లీకి ఫోన్‌ ట్యాపింగ్‌ హౌస్‌ కమిటీ నివేదిక
చంద్రబాబు హయాంలో జరిగిన ఫోన్‌ ట్యాపింగ్‌పై ఏపీ అసెంబ్లీకి హౌస్‌ కమిటీ నివేదిక సమర్పించింది. నివేదికను హౌస్‌ కమిటీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి.. స్పీకర్‌కు అందజేశారు. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. ప్రతిపాదనల్లోనే ‘మినీ ట్యాంక్‌బండ్‌’.. మంత్రి కేటీఆర్‌ ఆదేశాలు బేఖాతర్‌!
నగర శివారులోని ఐటీ కారిడార్, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌కు చేరువలో ఆహ్లాదాన్ని పంచే చెరువు.. దాని పక్కనే మట్టి, బండరాళ్లతో కూడిన కొండ.. ఇలా ప్రకృతి అందాలతో ఆకట్టుకొనఖాజాగూడ పెద్ద చెరువు రూపురేఖలు మార్చే ప్రక్రియ ఇంకా ప్రతిపాదన దశకే పరిమితమైంది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.25కోట్ల ఆఫర్‌! బలపరీక్షకు సీఎం సై
ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ నెల మొదట్లో ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి బలం నిరూపించుకున్నారు సీఎం అరవింద్ కేజ్రీవాల్.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. బ్రిటన్‌ రాణి మరణంతో... వజ్రాలను తిరిగి ఇచ్చేయాలంటూ డిమాండ్‌
బ్రిటన్‌ రాణి క్వీన్‌ ఎలిజబెత్‌ మృతి తర్వాత బ్రిటన్‌ రాజ కుంటుంబం అధీనంలో ఉన్న వజ్రాలను తమ దేశాలకు ఇచ్చేయాలంటూ సోషల్‌ మీడియా వేదికగా ప్రచారం ప్రారంభమైంది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. వందల మంది ఉద్యోగులకు భారీ షాక్‌, ‘ఓలా.. ఎందుకిలా!’
ప్రముఖ రైడ్‌ షేరింగ్‌ దేశీయ దిగ్గజ సంస్థ ఓలాలో కీలక పరిణామలు చోటు చేసుకుంటున్నాయి. సంస్థ పునర్నిర్మాణం పేరుతో  ఇప్పటికే వందలాది ఉద్యోగుల్ని ఇంటికి పంపిన ఓలా.. తాజాగా 500 మందిని విధుల నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. టీ20లలో రోహిత్‌ తర్వాత అరంగ్రేటం.. ఇప్పటికే రిటైరైన 10 మంది భారత ఆటగాళ్లు వీరే! హెడ్‌కోచ్‌ సైతం..
టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ టీ20 ఫార్మాట్‌లో అరంగేట్రం చేసి నేటికి(సెప్టెంబరు 19) సరిగ్గా పదిహేనేళ్లు. ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌-2007లో భాగంగా పొట్టి ఫార్మాట్‌లో భారత్‌ తరఫున ఎంట్రీ ఇచ్చాడు హిట్‌మ్యాన్‌.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. సహనం కోల్పోయిన ఆదిరెడ్డి..  ఎమోషనల్‌ అయిన సుదీప
బిగ్‌బాస్‌ ఇంట్లో మూడోవారం నామినేషన్స్‌ హీట్‌ మొదలైంది. డబుల్‌ ఎలిమినేషన్‌తో జలక్‌ ఇచ్చిన బిగ్‌బాస్‌ ఈసారి నామినేషన్స్‌లోనూ తాము చెప్పాలనుకున్న అభిప్రాయాన్ని నిర్భయంగా, నిర్మొహమాటంగా చెప్పాల​ంటూ ఆదేశించాడు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. చండీగఢ్ యూనివర్సిటీ వీడియో లీక్ ఘటన.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. మహిళా అధికారులతో 'సిట్'
చండీగఢ్ యూనివర్సిటీ వీడియో లీక్ ఘటనపై పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై దర్యాప్తు చేపట్టేందుకు ముగ్గురు మహిళా అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్‌) ఏర్పాటు చేసింది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు