ప్రివిలేజెస్‌ కమిటీకి షర్మిల వ్యాఖ్యలు 

14 Sep, 2022 02:36 IST|Sakshi
స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి ఫిర్యాదు చేస్తున్న మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు 

షర్మిల వ్యాఖ్యలపై స్పీకర్‌కు ఫిర్యాదు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పాదయాత్ర నిర్వహిస్తున్న వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని టీఆర్‌ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డికి ఫిర్యాదు చేశారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడిన అనంతరం మంత్రులు నిరంజన్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయభాస్కర్, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, కాలే యాదయ్య స్పీకర్‌ చాంబర్‌లో పోచారంను కలిసి ఫిర్యాదును అందజేశారు.

ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధుల హక్కులు, గౌరవానికి భంగం కలిగించడంతో పాటు నిరాధారంగా జుగుప్సాకర ఆరోపణలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వైఎస్‌ షర్మిల వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తూ ప్రివిలేజెస్‌ కమిటీకి సిఫారసు చేస్తామని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి హామీ ఇచ్చారు. కాగా షర్మిల వ్యాఖ్యలపై డీజీపీ మహేందర్‌రెడ్డికి కూడా ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. 

మరిన్ని వార్తలు