తెలంగాణ ఎన్నికలు 2023.. నేటి సమగ్ర సమాచారం

2 Dec, 2023 21:39 IST|Sakshi

జంగ్‌ తెలంగాణ..  అసెంబ్లీ ఎన్నికలు 2023 లైవ్‌ అప్‌డేట్స్‌

కేటీఆర్‌ ఆసక్తికర ట్వీట్‌

  • రేపటి కౌంటింగ్‌ నేపథ్యంలో కేటీఆర్‌ ‘ఎక్స్‌’ (ట్విటర్‌)లో కేటీఆర్‌ ఆసక్తికర ట్వీట్‌ 
  • హ్యట్రిక్‌ లోడింగ్‌ 3.0... వేడుకలకు సిద్ధంగా ఉండండి..
  • గెలుపుపై ధీమా

రంగారెడ్డి:

  • ఇబ్రహీంపట్నం లోని ఆర్డీఓ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత
  • 29 వ తేదీ నాటి పోస్టల్‌ బ్యాలెట్లను స్ట్రాంగ్ రూమ్ కి‌పంపించని అధికారులు..
  • విషయం తెలిసి ఆర్డీఓ కార్యాలయానికి భారీగా చేరుకుంటున్న కాంగ్రెస్ శ్రేణులు
  • కాంగ్రెస్ నాయకుల ఆందోళనతో కొద్ది సేపటి క్రితమే పోస్టల్ బ్యాలెట్ లను స్ట్రాంగ్ రూమ్ కు తరలించిన అధికారులు
  • పోస్టల్ బ్యాలెట్ తరలించిన తరువాతే ఇప్పుడు సీల్ వేసిన అధికారులు
  • పోలింగ్ జరిగి రెండు రోజులు దాటినా స్ట్రాంగ్ రూమ్ కు తాళం లేకపోవడం కాంగ్రెస్ నాయకుల తీవ్ర అభ్యంతరం
  • ఆర్డీఓ ను నిలదీస్తున్న కాంగ్రెస్ శ్రేణులు, ఉద్రిక్తత

  • కర్ణాటక నుండి ఎమ్మెల్యేలను పిలిచిన కాంగ్రెస్ 
  • ఒక్కో నియోకవర్గానికి ఒక్కో ఎమ్మెల్యేను పంపనున్న కాంగ్రెస్
  • గెలిచిన అభ్యర్థులను హైదరాబాద్ తీసుకొని వచ్చే బాధ్యత

గజ్వేల్‌ ఫలితాలు ఆలస్యం!: కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌

  • రేపు తెలంగాణ ఎన్నికల కౌంటింగ్‌
  • ఉదయం 10గం. తొలి ఫలితం వెల‍్లడయ్యే అవకాశం
  • గజ్వేల్‌ నియోజకవర్గం ఫలితం ఆలస్యంగా వెల్లడి
  • పోటీ అభ్యర్థులు ఎక్కువగా(44 మంది)  ఉండడమే కారణమన్న కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌
  • రాత్రి 8గం. తర్వాతే గజ్వేల్‌ ఫలితం రావొచ్చనే అంచనా
  • 23 రౌండ్లలో కౌంటింగ్‌ 
  • ఇప్పటికే మాక్‌ కౌంటింగ్‌ పూర్తైందన్న కలెక్టర్‌

చాలా ఇబ్బంది పెట్టారు: సీతక్క 

  • ములుగు జిల్లాలో క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే సీతక్క వ్యాఖ్యలు
  • బీఆర్ఎస్ నాయకులు వ్యక్తిగత విమర్శలు, కుట్ర రాజకీయాలతో చాలా ఇబ్బంది పెట్టారు 
  • నన్ను ఆడబిడ్డల ములుగు ప్రజలు ఆదరించారు
  • చిన్న పిల్లలు కూడా నాకే మద్దతు ఇచ్చి అక్కున చేర్చుకున్నారు 
  • నా జీవితానికి ఇంకేం కావాలి
  • నా గెలుపుకోసం కష్టపడ్డ అందరికీ ధన్యవాదాలు
  • నేనెప్పుడూ మీ సేవకు రాలినే 
  • నేను ములుగు ప్రజల వెంటే..
  • కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమంతో అభివృద్ధి చేస్తాను
  • నన్ను రీల్ అన్నారు. నేను కష్టకాలంలో ప్రజల వెంటే ఉన్నా
  • వారికి ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెప్పారు
  • ఆడబిడ్డ ఉసురు తగులుతుంది
  • మార్ఫింగ్ వీడియో, ఫోటోలతో దుష్ప్రచారం చేశారు
  • నా కార్యకర్తలను పైసలతో కొనుగోలు చేసి తప్పుడు ప్రకటనలు ఇప్పించారు
  • ఏ కష్టం వచ్చినా జనం వెంటే ఉంటా
  • పార్లమెంట్ ఎన్నికల్లో రాహూల్ ప్రధాని అయ్యేలా కృషి చేస్తా 
  • ఎన్నికల్లో కష్ట పడ్డ అందరికీ కృతజ్ఞతలు
  • వచ్చేది ఇందిరమ్మ రాజ్యం. వెలుగులే ప్రతి ఇంటా..


కేసీఆర్‌కు బైబై చెప్తున్నారు: షర్మిల

  • ఫలితాల ముందర..  వైఎస్సార్‌టీపీ నేత షర్మిల స్పందన
  • తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు బైబై చెప్పారని కామెంట్‌
  • బైబై కేసీఆర్‌ సూట్‌కేసును ప్రదర్శించిన షర్మిల
  • కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థులుగా సమర్థులైనవాళ్లు ఉన్నారు
  • ఉత్తమ్‌, భట్టిలాంటి వాళ్లు ఉన్నారు
  • బ్లాక్‌మెయిలర్స్‌ మాత్రం ముఖ్యమంత్రి కాకూడదు 
  • సీఎం అభ్యర్థి ఎవరనేది ఆ పార్టీ వాళ్లు నిర్ణయించుకుంటారు

సీఈవోను కలిసిన తర్వాత మీడియాతో కాంగ్రెస్‌ నేత ఉత్తమ్‌.. 

  • బీఆర్‌ఎస్‌ నేతలకు సంబంధించిన కాంట్రాక్టర్లకు నిధులు మంజూరు చేయిస్తున్నారు
  • రూ.6 వేల కోట్లను తమకు నచ్చిన కాంట్రాక్టర్లకు ఇచ్చేందుకు బీఆర్‌ఎస్‌ సర్కార్‌ ప్రయత్నిస్తోంది
  • రైతు బంధు నిధుల్ని కాంట్రాక్టర్ల బిల్లులకు మళ్లిస్తున్నారు
  • భూరికార్డులు మారుస్తున్నట్లు కూడా మాకు సమాచారం ఉంది
  • రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోని భూముల్ని ధరణి పోర్టల్‌లోకి మారుస్తున్నారు
  • బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిబంధనలు పాటించడం లేదు
  • అసైన్డ్‌ భూముల రికార్డుల్ని మార్చకుండా చూడాలని సీఈవోను కోరాం
  • ప్రభుత్వ లావాదేవీలపై విజిలెన్స్‌ నిఘా పెట్టాలని కోరాం
  • ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నప్పుడు.. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు దుర్వినియోగం కాకుండా చూడాలని కోరాం
  • మొత్తం నాలుగు అంశాలపై ఫిర్యాదు చేశాం

రంగారెడ్డి జిల్లాలో ఆ మూడు నియోజకవర్గాల లెక్కింపు కోసం.. 

  • ఇబ్రహీంపట్నం  సీవీఆర్‌  ఇంజినీరింగ్ కాలేజ్ లో రేపు ఉదయం ప్రారంభంకానున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ
  • ఇబ్రహీంపట్నం,మహేశ్వరం,కల్వకుర్తి నియోజకవర్గాలకు చెందిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ
  • ఏర్పాట్లను పూర్తి చేసిన  అధికారులు
  • కౌంటింగ్ కేంద్రాల చుట్టూ మూడు అంచల భద్రత వ్యవస్థను ఏర్పాటు చేశారు.
  • ఇబ్రహీం పట్నం నియోజకవర్గం 14 టేబుల్ 25 రౌండ్లు లెక్కింపు
  • కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు

విజయావకాశాలపై వీహెచ్‌ స్పందన

  • తెలంగాణలో కాంగ్రెస్‌ విజయావకాశాలపై సీనియర్‌ నేత వీహెచ్‌ స్పందన
  • తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాబోతోంది
  • దళితబంధు, డబుల్‌ బెడ్రూంల విషయంలో ప్రజలు విసిగిపోయారు

మై హీరో: కవిత ట్వీట్‌

  • మై హీరో అంటూ తండ్రి కేసీఆర్‌ వీడియోను షేర్‌ చేసిన కవిత 

ఈసీ కార్యాలయానికి కాంగ్రెస్‌ నేతలు

  • తెలంగాణ ఎన్నికల కమిషనర్‌తో కాంగ్రెస్‌ నేతల భేటీ
  • ఈసీ కార్యాలయానికి వెళ్లిన రేవంత్‌రెడ్డి, మధు యాష్కీ, ఉత్తమ్‌, పొంగులేటి
  • బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఫిర్యాదు
  • డిసెంబర్‌ 4న ఏర్పాటు చేయనున్న కేబినెట్‌ భేటీపైనా ఫిర్యాదు
  • ప్రభుత్వ లావాదేవీలపై నిఘా ఉంచాలని ఫిర్యాదు చేయనున్న టీ కాంగ్రెస్‌ నేతలు


 

కాంగ్రెస్‌ కీలక భేటీ

  • హైదరాబాద్ హైదర్ గూడ ఎమ్మెల్యే. క్వార్టర్స్ లో భేటీ అయిన టీ కాంగ్రెస్ నేతలు
  • రాష్ట్ర ఇంఛార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే అధ్యకతన భేటీ అయిన రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ పలువురు ముఖ్య నేతలు..
  • కౌంటింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు,ఫలితాల తర్వాత ఎలాంటి వ్యూహం అమలు చేయాలనేదాని పై చర్చ

  • కౌటింగ్‌ నేపథ్యంలో రేపు తెలంగాణ అంతటా మద్యం దుకాణాలు బంద్‌


ఎల్బీ నగర్‌ ఏర్పాట్లు ఇలా.. 

  • రేపు జరగబోయే ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి 
  • ఎల్బీనగర్ నియోజకవర్గంకి సంబంధించి సరూర్‌ నగర్‌ ఇండోర్ స్టేడియంలో ఏర్పాట్లు 
  • ఈవీఎంలు భద్రపర్చిన స్ట్రాంగ్‌ రూంలను, ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించిన రాచకొండ సీపీ చౌహాన్, ఎల్బీనగర్‌ డీసీపీ సాయి శ్రీ
  • మూడంచెల భద్రత నడుమ ఇండోర్‌ స్టేడియం
  • ఎలాంటి ర్యాలీలు, విజయోస్తవ సంబురాలు చేయయూడదని ఇప్పటికే నేతలకు ఆదేశాలు
  • కౌటింగ్‌ కేంద్రం చుట్టూ అరకిలోమీటరు దూరం వరకు 144 సెక్షన్ అమలు

కౌంటింగ్‌.. కౌంట్‌డౌన్‌

  • తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
  • రాష్ట్రవ్యాప్తంగా.. 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు 49 కేంద్రాల్లో కౌంటింగ్‌
  • ఉదయం 8గంటలకే తెరుచుకోనున్న బాక్స్‌లు
  • తొలి అరగంట బ్యాలెట్‌.. ఆ తర్వాతే ఈవీఎంల్లో పోలైన ఓట్ల లెక్కింపు
  • కౌంటింగ్ పై సీఈఓ వికాస్ రాజ్ టెలీ కాన్ఫరెన్స్
  • పాల్గొన్న జిల్లా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులు
  • కౌంటింగ్ ఏర్పాట్ల పై సమీక్ష నిర్వహించిన ఎన్నికల సంఘం ప్రధాన అధికారులు


అప్రమత్తంగా ఉండండి: డీజీపీ

  • రేపు జరుగనున్న ఓట్ల కౌంటింగ్
  • అప్రమత్తంగా ఉండాలని ఉన్నతస్థాయి అధికారులకు డీజీపీ అంజనీకుమార్‌ ఆదేశం
  • కౌంటింగ్‌ ఏర్పాట్లపై సీపీలు, ఎస్పీలతో ఇవాళ డీజీపీ టెలీ కాన్ఫరెన్స్
  • అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచన
     

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కౌంటింగ్‌ ఏర్పాట్లు ఇలా.. 

  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి
  • పాల్వంచ అనుబోస్ ఇంజనీర్ కళాశాల లో స్ట్రాంగ్ రూం.. కౌంటింగ్ కేంద్రం
  • అనుబోస్ కళాశాల వద్ద కేంద్ర బలగాలతో  భద్రత
  • నియోజకవర్గాల వారీగా కౌంటింగ్‌కు ఏర్పాట్లు..
  • రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న కౌంటింగ్
  • ప్రతి నియోజకవర్గానికి 14  టేబుళ్ళు 
  • పోలింగ్ బూత్ ల వారీగా రౌండ్స్ కేటాయింపు
  • మొత్తం 80 రౌండ్లలో.. జిల్లా లోని 5 నియోజకవర్గాలలో కౌంటింగ్ పూర్తి చేయనున్న అధికారులు
  • కొత్తగూడెం నియోజకవర్గంలోని 253 బూత్‌లలకు సంబంధించి 18 రౌండ్స్ లో కౌంటింగ్‌ 
  • ఇల్లందు నియోజకవర్గం లోని 241 బూత్ లలో  17 రౌండ్స్ లో కౌంటింగ్
  • పినపాక నియోజకవర్గం లోని 244 బూత్ లలో  17 రౌండ్స్ లో కౌంటింగ్ 
  • అశ్వారావుపేట నియోజకవర్గం లోని 184 బూత్ లలో 13 రౌండ్స్ లో కౌంటింగ్
  • భద్రాచలం నియోజకవర్గం లోని 176 బూత్ లలో 12 రౌండ్స్ లో కౌంటింగ్
  • జిల్లా లో భాగానే నమోదైన పోలింగ్ 
  • జిల్లా వ్యాప్తంగా 78.67 శాతం పోలింగ్ నమోదు
  • జిల్లాలో అత్యధికంగా అశ్వారావుపేట నియోజకవర్గంలో  80.13 శాతం పోలింగ్ నమోదు
  • కౌంటింగ్‌ విధుల్లో.. 5,250 మంది సిబ్బంది 

క్లాస్‌ ఓటు బీఆర్‌ఎస్‌కే: పోచారం

  • బీఆర్‌ఎస్‌ విజయావకాశాలపై స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ స్పందన
  • బీఆర్‌ఎస్‌కు 70-75 సీట్లు పక్కా
  • మాస్‌-క్లాస్‌ ఓటర్ల పల్స్‌ వేరు
  • క్లాస్‌ ఓటర్లంతా బీఆర్‌ఎస్‌ వైపు ఉన్నారు
  • సైలెంట్‌ ఓటు KCRకు అనుకూలంగా ఉంది
  • కేసీఆర్‌ హ్యాట్రిక్‌ సీఎం కాబోతున్నారు

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కౌంటింగ్‌ ఏర్పాట్లు ఇలా.. 

  • కరీంనగర్ జిల్లా నాలుగు నియోజకవర్గాలు కరీంనగర్, చొప్పదండి, హుజురాబాద్, మానకొండూర్..
  • కరీంనగర్ లోని‌ ఎస్‌ఆర్‌ఆర్‌ ‌కళాశాలలో‌ ఓట్ల లెక్కింపు
  • ఒక్కో గదిలో 14 టేబుల్స్ ఏర్పాటు
  • కరీంనగర్ ఓట్ల లెక్కింపు 28 రౌండ్లు
  • మానకొండూరు ఓట్ల లెక్కింపు 23 రౌండ్లు
  • చొప్పదండి ఓట్ల లెక్కింపు 24 రౌండ్లు 
  • హుజురాబాద్ ఓట్ల లెక్కింపు 22 రౌండ్లు
  • రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గాలు...
  • బద్దెనపల్లి  గురుకుల పాఠశాలలో కౌంటింగ్ ఏర్పాట్లు..
  • వేములవాడ  ఓట్ల లెక్కింపు ‌19 రౌండ్లు....పొస్టల్ బ్యాలెట్ కొసం 3 టేబుల్స్
  • సిరిసిల్ల ఓట్ల లెక్కింపు కొరకు  21 రౌండ్లు , పోస్టల్ బ్యాలెట్ కోసం 4 టేబుల్స్ ఏర్పాటు.
  • పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి, రామగుండం, మంథని మూడు నియోజకవర్గాలు..
  • మంథని జేఎన్టీయూ కళాశాలలో కౌంటింగ్ ఏర్పాట్లు
  • రామగుండం ఓట్ల లెక్కింపు కొరకు 14 టేబుల్స్, 11 రౌండ్లు
  • పొస్టల్ బ్యాలెట్ కొసం 4 టేబుల్స్.
  • పెద్దపల్లి‌ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు కొరకు 14 టేబుల్స్,15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు 
  • పోస్టల్ బ్యాలెట్ 4 టేబుల్స్ ఏర్పాటు
  • మంథని ఓట్ల లెక్కింపు కొరకు 14 టేబుల్స్, 14 రౌండ్లలో లెక్కింపు
  • పొస్టల్ బ్యాలెట్ కోసం 4 టేబుల్స్ ‌ఏర్పాటు
  • జగిత్యాల జిల్లాలో జగిత్యాల, కొరుట్ల, ధర్మపురి నియోజకవర్గాల కోసం వీఆర్కే ఇంజనీరింగ్ కళాశాలలో  కౌంటింగ్ ఏర్పాట్లు
  • జగిత్యాల నియోజకవర్గం కోసం  14 టేబుల్స్ 13 రౌండ్లలొ ఓట్ల లెక్కింపు 
  • పొస్టల్ బ్యాలెట్ కోసం 4 టేబుల్స్ ఏర్పాటు
  • కోరుట్ల నియోజకవర్గం కోసం14 టేబుల్స్ పై 14 రౌండ్లలో ఓట్ల లెక్కింపు
  • పొస్టల్ బ్యాలెట్ కోసం నాలుగు టెబుల్స్
  • ధర్మపురి నియోజకవర్గం కోసం 14 టేబుల్స్ 13 రౌండ్లలో ఓట్ల లెక్కింపు
  • పొస్టల్ ‌బ్యాలెట్ కొసం నాలుగు టేబుల్స్ ఏర్పాటు

బెట్టింగ్‌లో పొలం కూడా..? 

  • తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల జోరుగా పందేలు
  • అభ్యర్థుల గెలుపోటములు.. మెజార్టీ ఎంత సాధిస్తారనేదానిపై బెట్‌
  • యాప్‌ల సాయంతో నెలరోజులుగా బెట్టింగులు వేస్తున్న ముఠా
  • సిర్పూర్‌లో లక్షల్లో బెట్టింగ్‌
  • డబ్బులతో పాటు పొలంపైనా పందేలు వేస్తున్న కొందరు 
  • తన రెండు ఎకరాల భూమిని పందేంలో ఉంచిన ఓ వ్యక్తి!

బీజేపీ ధీమా ఏంటంటే..

  • తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి విచిత్ర పరిస్థితి
  • పోలింగ్‌ ముందుదాకా ప్రభుత్వం రాబోతోందంటూ ప్రకటనలు
  • ఆ స్టేట్‌మెంట్‌తోనే అగ్రనేతల హడావిడి
  • ఎగ్జిట్‌పోల్స్‌తో ఢీలా పడ్డ పార్టీ కేడర్‌
  • తాజాగా బీజేపీ మరో ధీమా
  • 2018 కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామంటూ లీడర్ల స్టేట్‌మెంట్లు
  • ఓట్లు-సీట్లు పెరుగుతాయని అంచనా
  • 2018లో కేవలం 14 లక్షల ఓట్లు
  • ఈసారి మాత్రం పోలైన ఓట్లలో.. 20 శాతం ఓట్లు వస్తాయని బీజేపీ అంచనా

..అయినా బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఆందోళనే!

  • తెలంగాణ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ
  • భవితవ్యంపై టెన్షన్‌ పడుతున్న అభ్యర్థులు
  • ఖచ్చితంగా గెలుస్తామని.. ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కేసీఆర్‌ ధీమా
  • నిన్న ప్రగతి భవన్‌లో నేతలతో సమావేశం
  • వార్‌ రూమ్‌ నివేదికపైనా సుదీర్ఘమైన చర్చ
  • బయటకు వచ్చిన విక్టరీ సింబల్‌ చూపించిన కొందరు నేతలు
  • హైదరాబాద్‌ దాటిన తర్వాత మళ్లీ గెలుస్తామా? లేదా? అని చర్చలు
  • నేతల అధైర్యంతో.. కేడర్‌లోనూ ఆందోళన
  • సీనియర్లలోనూ కొందరికి ఓటమి భయం?
  • ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలతో కాంగ్రెస్‌లో జోష్‌

10:06AM
రేపు కాంగ్రెస్‌ బిగ్‌ ప్లాన్‌

  • రేపు డిసెంబర్‌ 3న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడి
  • అభ్యర్థులు చేజారకుండా అప్రమత్తమైన కాంగ్రెస్‌ పార్టీ
  • రేపు కాంగ్రెస్‌ అభ్యర్థుల వెంట ఏఐసీసీ పరిశీలకులు
  • గెలిచిన తర్వాత ఎమ్మెల్యేలను నేరుగా హైదరాబాద్‌  తాజ్‌కృష్ణకు తీసుకురానున్న పరిశీలకులు 
  • మంచి మెజారిటీ వస్తే నో క్యాంప్‌
  • ఇవాళే హైదరాబాద్‌కు కర్ణాటక కాంగ్రెస్‌ ట్రబుల్‌ షూటర్‌
  • ఈ మొత్తం వ్యవహారాలను డీకే శివకుమార్‌కే అప్పగించిన అధిష్టానం
     

హమ్మయ్యా.. ఇక రిలాక్స్‌

  • తెలంగాణలో రిలాక్స్‌ అవుతున్న పొలిటీషియన్స్‌
  • ఇంతకాలం ప్రచారంతో బిజీబిజీ
  • రోడ్‌ షోలు, ర్యాలీలు, బహిరంగ సభలు.. ఇంటింటికి తిరిగి ప్రచారం
  • అలసిపోయిన లీడర్లు
  • పోలింగ్‌ ముగియడంతో ఇళ్లకు చేరుకున్న వైనం
  • కుటుంబ సభ్యులతో గడుపుతూ కూల్‌ అవుతున్న నేతలు
  • రేపు ఎలాగూ కౌంటింగ్‌ టెన్షన్‌ 

    గ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి
     

ఖమ్మం జిల్లాలో కౌంటింగ్‌ ఏర్పాట్లు ఇలా.. 

  • ఖమ్మం జిల్లా లో కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి
  • తల్లంపాడు శ్రీ చైతన్య ఇంజనీర్ కళాశాల లో స్ట్రాంగ్ రూం.. అక్కడే కౌంటింగ్ కేంద్రం
  • శ్రీ చైతన్య కళాశాల వద్ద కేంద్ర బలగాలతో  భద్రత 
  • నియోజకవర్గాల వారీగా కౌంటింగ్ కు ఏర్పట్లు రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న కౌంటింగ్
  • ప్రతి నియోజకవర్గానికి 14  టేబుళ్ళు 
  • పోలింగ్ బూత్ ల వారీగా రౌండ్స్ కేటాయింపు
  • 104 రౌండ్లలో ఖమ్మం జిల్లా లోని 5 నియోజకవర్గాలలో కౌంటింగ్ పూర్తి చేయనున్న అధికారులు
  • ఖమ్మం నియోజకవర్గం లోని 355 బూత్ లకు సంబంధించి 25 రౌండ్స్ లో కౌంటింగ్ 
  • పాలేరు నియోజకవర్గం లోని 289 బూత్ లలో  20 రౌండ్స్ లో కౌంటింగ్
  • మధిర నియోజకవర్గం లోని 268 బూత్ లలో  19 రౌండ్స్ లో కౌంటింగ్ 
  • వైరా నియోజకవర్గం లోని 252 బూత్ లలో 18 రౌండ్స్ లో కౌంటింగ్
  • సత్తుపల్లి నియోజకవర్గం లోని 292 బూత్ లలో 20 రౌండ్స్ లో కౌంటింగ్
  • జిల్లా లో భారీగా నమోదైన పోలింగ్ 
  • 5250 మంది సిబ్బంది కౌంటింగ్ విధుల్లో పాల్గొంటున్నారు 
  • జిల్లా వ్యాప్తంగా 83.83 శాతం పోలింగ్ నమోదు
  • జిల్లా లో అత్యధికంగా పాలేరు  నియోజకవర్గంలో  90.91 శాతం పోలింగ్ నమోదు

కేసీఆర్‌పై నమ్మకం ఉంది

  • సోషల్‌ మీడియాలో బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా పలువురి పోస్టులు
  • కేసీఆర్‌పై నమ్మకం ఉందంటూ వ్యాఖ్యలు
  • ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాల నేపథ్యంతో ఢీలా పడిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు
  • ఇప్పటికే ప్రగతి భవన్‌ మీటింగ్‌ ధైర్యం నూరిపోసిన కేసీఆర్‌ అండ్‌ కేటీఆర్‌
  • ప్రజల కారువైపే ఉన్నారంటూ.. ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామంటూ నేతలకు భరోసా
  • ఎగ్జిట్‌ పోల్స్‌ చెత్త అంటూ ఖండన
  • ఎగ్జాక్ట్‌(కచ్చితమైన) పోల్స్‌ తమకు అనుకూలంగా ఉంటాయంటూ ప్రకటనలు
  • అదే సమయంలో కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ సర్కార్‌కు అనుకూలంగా సోషల్‌ మీడియాలో పోస్టులు
  • రాబోయేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని విశ్వాసం
     

09:40 AM
20 రౌండ్లలో మహబూబాబాద్ కౌంటింగ్

  • మహబూబాబాద్ లోని సోషల్ వెల్ఫేర్ మహిళ గురుకులంలో రేపు ఓట్ల లెక్కింపు ప్రక్రియ
  • ఉదయము 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం.మొదట పోస్టల్ బ్యాలెట్,మరియు హోం ఓటింగ్ ఓట్ల లెక్కింపు
  • ఉదయం 8:30 నిమిషాలకు ఈవీయము ఓట్ల లెక్కింపు ప్రారంభం
  • మహబూబాబాద్ నియోజకవర్గంలోని 5 మండలాల్లో కలిపి 283 పోలింగ్ బూతులు కలవు,మొత్తం ఓటర్ల సంఖ్య 2 లక్షల 53 వేల 342
  • పోలింగ్ శాతము 82.34.పోలైన ఓట్లు మొత్తం 2 లక్షల 8 వేల 958 ఓట్లు
  • మొత్తం కౌంటింగ్ కి 14 టేబుల్స్ ఏర్పాటు,ఒక్కో టేబుల్ కి ఒక్కో ఈవీఎం లెక్కింపు, ప్రతి రౌండ్ కి 14 ఈవీఎం లెక్కింపు
  • మొత్తం 20 రౌండ్లలో మహబూబాబాద్ కౌంటింగ్ 
  • ప్రతి రౌండ్ కౌంటింగ్ కి 20 నిమిషాల సమయము పట్టే అవకాశం
  • మొదటి రౌండ్ పలితము కొద్దిగా ఆలస్యము అయ్యే అవకాశం
  • 9:30 నిమిషాలకు మొదటి ఈవీఎం రిజల్ట్‌! 
  • మధ్యాహ్నాం 2 గంటల వరకు చివరి ఫలితం తేలే ఛాన్స్‌
  • అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
  • స్ట్రాంగ్ రూంలు  ఉదయము 6 గంటలకే ఓపెన్ చేసే అవకాశం

09:23 AM
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఏర్పాట్లు పూర్తి

  • రేపు ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి
  • భూపాలపల్లి అంబేద్కర్ స్టేడియంలో కౌంటింగ్ కు ఏర్పాట్లు
  • ఉదయం 8గంటలకు పోస్టల్ బ్యాలెట్ తో ఓట్ల లెక్కింపు ప్రారంభం
  • 14 టేబుల్స్ ఏర్పాటు చేసి 23 రౌండ్లలో ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడి  
  • 14 టేబుళ్లలో ఒక్కో టేబుల్కు నలుగురు సిబ్బంది చొప్పున మొత్తం 56 మంది సిబ్బంది కౌంటింగ్లో పాల్గొంటారు.
  • ముగ్గురు నోడల్ ఆఫీసర్లు, ఆరుగురు కౌంటింగ్ సూపర్వైజ ర్లు, 12మంది కౌంటింగ్ అసిస్టెంట్లు కౌంటింగ్ విధుల్లో పాల్గొంటారు. 
  • ఈవీఎంలను అంబేద్కర్ స్టేడియంలోని స్ట్రాంగ్ రూంలో భద్రపరిచి ప్రత్యేక పోలీసు బందోబస్తును ఏర్పాటు

09:15 AM
కుట్ర జరుగుతోందంటూ కాంగ్రెస్‌ ఫిర్యాదు 

  • తెలంగాణ చీఫ్‌ ఎలక్షన్‌ ఆఫీసర్‌(సీఈవో) వికాస్ రాజ్‌ను  కలవనున్న టీ కాంగ్రెస్ నేతలు
  • పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి , సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలతోపాటు ముఖ్య నాయకులు కూడా
  • ప్రస్తుత ప్రభుత్వం రైతు బంధు నిధులను  కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లింపునకు మళ్లిస్తున్నారని ఫిర్యాదు చేయనున్న కాంగ్రెస్ 
  • హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అసైన్డ్ మెంట్ భూములను ఇతరుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసే కుట్ర జరుగుతోందని ఫిర్యాదు 
  • ప్రభుత్వ లావాదేవీలపై  విజిలెన్స్ నిఘా పెట్టాలని ఇటు హైదరాబాద్ లో అటు ఢిల్లీ లో ఎన్నికల సంఘం, ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేస్తామంటున్న కాంగ్రెస్ 

07:59 AM
తెలంగాణ ఫలితాలు.. కాయ్‌రాజా కాయ్‌!

  • తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై జోరుగా సాగుతున్న బెట్టింగులు?
  • ఏపీలోనూ యాప్‌ల ద్వారా బెట్టింగ్‌లు సాగుతున్నట్లు సమాచారం
  • గెలుపుపై అన్ని పార్టీల ధీమా
  • ఎగ్జిట్‌పోల్స్‌ వచ్చాక.. రెట్టింపు అవుతున్న బెట్టింగ్‌ సొమ్ము
  • ఫలానా పార్టీకి ఇన్ని సీట్లు అంటేనే బెట్‌ వేయాలంటూ జోరుగా పందేలు
  • సామాజికవర్గాలు, అనుకూల,ప్రతికూల అంశాలపై లెక్కలేసుకుని మరీ..
  • కీలక నేతల గెలుపోటములపైనా భారీగా.. 
  • కీలక నేతల మెజార్టీ ఫిగర్‌పైనా బెట్టింగులు
  • బెట్టింగ్‌ ముఠాలపై పోలీసుల నజర్‌

07:31 AM

  • ఆ అంచనాలు నిజం అవుతాయా? తప్పుతాయా?
  • ఆసక్తికరంగా తెలంగాణ ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలు
  • కాంగ్రెస్‌కే ఎక్కువ అవకాశాలున్నాయంటూ మెజార్టీ సర్వే సంస్థల వెల్లడి
  • పోలింగ్‌ ముగిసిన సాయంత్రం 5గం. వరకే అభిప్రాయ సేకరణ
  • కానీ.. ఆ తర్వాత జరిగిన ఓటింగ్‌ తమకు కలిసొస్తుందంటున్న బీఆర్‌ఎస్‌
  • ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలతో.. కాంగ్రెస్‌ సంబురాలు
  • అధైర్య పడొద్దంటూ బీఆర్‌ఎస్‌ కేడర్‌కు కేసీఆర్‌ ధైర్యం
  • ఎగ్జిట్‌పోల్స్‌ను రబ్బిష్‌ అంటూ కొట్టిపారేసిన కేటీఆర్‌
  • ఎగ్జిట్‌ పోల్స్‌ను తామూ తారుమారు చేస్తామంటూ బీజేపీ ప్రకటన
  • ఫలితాలు షాకింగ్‌గా ఉంటాయంటూ బీజేపీ నేత బండి సంజయ్‌ వ్యాఖ్యలు


​​​​​

07:22 AM
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో  రేపటి కౌంటింగ్‌ ఇలా..

  • ఉమ్మడి ఆదిలాబాద్‌లోని పది అసెంబ్లీ  నియోజకవర్గాల  ఓట్ల లెక్కింపునకు అధికారుల ఏర్పాట్లు
  • నాలుగు జిల్లాలో కౌంటింగ్  కేంద్రాలు ఇలా.. 
  • ఆదిలాబాద్  జిల్లా కేంద్రం లో    టీటీడీసీ    కేంద్రంలో   ఆదిలాబాద్ , బోథ్   నియోజకవర్గాల‌  ఓట్లను  లెక్కించనున్న అధికారులు
  • ఆసిఫాబాద్  జిల్లా కేంద్రం లో పీవీటీజీ బాలికల పాఠశాలలో  ఆసిఫాబాద్‌,   సిర్పూర్ నియోజకవర్గాల ఓట్ల  లెక్కింపు
  • మంచిర్యాల జిల్లా ముల్కల  ఇంజనీరింగ్ కళశాలలో   మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు ఓట్ల లెక్కింపు
  • నిర్మల్  పాలిటెక్నిక్ కళాశాలలో  నిర్మల్ , ఖానాపూర్,  ముథోల్  నియోజకవర్గాల   ఓట్ల లెక్కింపు
  • కౌంటింగ్‌ సందర్భంగా.. ఆయా కేంద్రాల వద్ద ఆంక్షల అమలు.. 144 సెక్షన్‌ విధింపు
  • ఉదయం 6గం. నుంచి సాయంత్రం 6గం. ఆంక్షలు అమలు
  • కౌంటింగ్‌ కేంద్రాల వద్ద సంబురాలు నిషేధం


    7:16 AM
    కాంగ్రెస్‌ గెలవబోతోంది: రేవంత్‌రెడ్డి

  • ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలతో కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్లో జోష్‌ 
  • ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ వస్తుందనే ధీమా
  • విజయం తమదేనంటూ నేతల సంబురాలు.. టీపీసీసీ రేవంత్‌రెడ్డి ఇంటికి క్యూ
  • ఓట్ల లెక్కింపు వరకూ ఈవీఎంల భద్రతపై అప్రమత్తంగా ఉండాలని రేవంత్‌ సూచన
  • 9న కొత్త సీఎం ప్రమాణ స్వీకారం.. అదే రోజు గ్యారంటీ హామీలపై మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంటుందంటూ నేతల ప్రకటనలు
  • నేడు సీఈవో వికాస్‌రాజ్‌ను కలవనున్న టీ కాంగ్రెస్‌ నేతల బృందం
  • ఓటమి భయంతో కేసీఆర్‌ రైతు బంధు నిధుల్ని దారి మళ్లిస్తున్నారనే ఆరోపణతో ఫిర్యాదు చేయనున్న కాంగ్రెస్‌ నేతలు

    07:09 AM
    పటిష్ట భద్రత.. పక్కా ఏర్పాట్లతో కౌంటింగ్‌: సీఈవో వికాజ్‌రాజ్‌

  • స్ట్రాంగ్‌రూంలలో ఈవీఎంలు
  • మొత్తం 40 కంపెనీల కేంద్ర బలగాలు ఈవీఎంల బందోబస్తులో
  • రేపు తేలనున్న 2,290 మంది అభ్యర్థుల భవితవ్యం
  • అభ్యర్థుల్లో 221 మంది మహిళలు, ఒకరు ట్రాన్స్‌జెండర్‌
  • పోలింగ్‌ అనంతరం అన్నింటినీ పార్టీ అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలోనే స్ట్రాంగ్‌రూంలకు ఈవీఎంల తరలింపు 
  • స్ట్రాంగ్‌రూంలకు అన్ని రకాలుగా భద్రత చర్యలు
  • సీసీ కెమెరాలు ఏర్పాటు 
  • 49 ప్రాంతాల్లో లెక్కింపు కేంద్రాలు
  • కౌంటింగ్‌ కోసం మొత్తం 1,766 టేబుల్స్‌ ఏర్పాటు 
  • ఒక్కొక్క నియోజకవర్గానికి ఉండే టేబుల్స్‌14
  • కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థ
  • ప్రతి కౌంటింగ్‌ టేబుల్‌ వద్ద నలుగురు ఎన్నికల సిబ్బంది
  • జీహెచ్‌ఎంసీ పరిధిలో 500 పోలింగ్‌ కేంద్రాల కంటే ఎక్కువగా ఉన్న ఆరు నియోజకవర్గాల్లో 28 టేబుల్స్‌, మిగిలిన నియోజకవర్గాల్లో 14 చొప్పున
  • పోస్టల్‌ బ్యాలెట్‌ల లెక్కింపు కోసం ప్రత్యేకంగా 500 ఓట్లకు ఒక టేబుల్‌ చొప్పున ఏర్పాటు
  • పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు కూడా సమాంతరంగా కొనసాగింపు..  
  • పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా 1.80 లక్షల మంది ఎన్నికల సిబ్బంది ఓటు హక్కు వినియోగం
  • ఉదయం 8 గంటల నుంచే కౌంటింగ్‌ ప్రారంభం
  • పోస్టల్‌ ఓట్ల లెక్కింపుతో కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభం
  • అరగంట తర్వాత.. 8.30 నుంచి ఈవీఎంల లెక్కింపు

    07:00 AM
    మళ్లీ హైదరాబాద్‌కు డీకేఎస్‌

  • మళ్లీ తెలంగాణకు రానున్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌
  • కౌంటింగ్‌.. ఫలితాల నేపథ్యంలో రేపు సాయంత్రం హైదరాబాద్‌కు
  • తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల  పరిశీలకుడిగా డీకేఎస్‌ను నియమించిన ఏఐసీసీ
  • రిసార్ట్‌ రాజకీయాల అవసరం ఉండబోదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన డీకేఎస్‌
     

  • 06:57 AM
    ఆగం కావొద్దు.. మనమే వస్తాం: కేసీఆర్‌
     

  • తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎవరికి వారిలోనే ధీమా
  • పార్టీ కేడర్‌ను ధైర్యం నూరిపోసిన బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌
  • ప్రగతి భవన్‌లో అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, నేతలతో నిన్న భేటీ
  • ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను చూసి గాబరా పడొద్దు.. మళ్లీ మనమే అధికారంలోకి రాబోతున్నామంటూ భరోసా
  • ఫలితాలు వెల్లడయ్యే వరకూ ప్రశాంతంగా ఉండండి.. 3న అందరం కలిసి సంబరాలు చేసుకుందాం
  • చివరి గంటలో జరిగిన పోలింగ్‌.. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలకు భిన్నంగా ఉండొచ్చని కేసీఆర్‌ అభిప్రాయం
  • ప్రగతి భవన్‌ నుంచి బయటకు వస్తూ విక్టరీ సింబల్‌ చూపించిన పలువురు నేతలు
  • డిసెంబర్‌ 4వ తేదీన సచివాలయంలో కేబినెట్‌ భేటీకి సీఎం కేసీఆర్‌ నిర్ణయం

    06:54 AM
    నగరంలో రేపు అక్కడ ఆంక్షలు

  • ఆదివారం ఓట్ల లెక్కింపు సందర్భంగా లెక్కింపు కేంద్రాల వద్ద ఆంక్షలు
  • ఉత్తర్వులు జారీ చేసిన హైద‌రాబాద్ పోలీస్‌ కమిషనర్‌ సందీప్‌ శాండిల్య, రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌లు
  • ఉదయం 6 గంటల నుంచి 4వ తేదీ ఉదయం 6 గంటల వరకు అమలులో ఆంక్షలు
  • కౌంటింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ విధింపు 
  • మైక్‌లు, మ్యూజిక్‌ సిస్టమ్‌, ప్రసంగాలు చేయడం, నిషేధిత ఫోటోలు, సింబల్స్‌, ప్లకార్డులు ప్ర‌ద‌ర్శించ‌కూడ‌దు
  • విధి నిర్వహణలో ఉన్న పోలీసు, మిల‌ట‌రీ, ఎలక్షన్‌ అధికారులకు ఈ ఆంక్షల నుంచి మినహాయింపు
  • రోడ్లు, బహిరంగ ప్రదేశాలలో టపాసులు కాల్చడంపై నిషేధం
  • ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆదివారం మద్యం దుకాణాల బంద్‌

    06:40 AM
    రేపే కౌంటింగ్‌.. 

  • తెలంగాణలో రేపే అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌
  • ఉదయం 8గం. నుంచి ప్రారంభం కానున్న కౌంటింగ్‌
  • మధ్యాహ్నాం కల్లా ఫలితాలపై రానున్న క్లారిటీ
  • తేలనున్న 2,290 మంది అభ్యర్థుల భవితవ్యం
  • ప్రధాన పార్టీల్లో ఉత్కంఠ
  • వన్‌ సైడెడ్‌గా ఎగ్జిట్‌ పోల్స్‌
  • అయినా గెలుపుపై ఎవరికి వారే ధీమా

    06:38 AM
    అత్యల్పంగా రాజధానిలోనే.. 

  • పోలింగ్‌ కేంద్రాలకు మోహం చాటేసిన రాజధాని వాసులు
  • జిల్లా వారీగా.. హైదరాబాద్‌లో అత్యల్పంగా నమోదు అయిన పోలింగ్‌
  • కేవలం 47.88 శాతం మాత్రమే
  • రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గం వారీగా..  అత్యల్పంగా యాకుత్ పురాలో కేవలం 39.64 శాతం ఓటింగ్‌ 
  • మలక్‌పేట్‌లో 41.32 శాతం,
  • చార్మినార్‌లో 43.27 శాతం,
  • చాంద్రాయణగుట్టలో 45.26 శాతం
  • బహదూర్ పురాలో 45.50 శాతం,
  • జూబ్లీహిల్స్ లో 47.49 శాతం,
  • అతిపెద్ద నియోజకవర్గం శేరిలింగంపల్లిలో 48.75 శాతం,
  • ఎల్బీనగర్‌లో 49.07శాతం,
  • కంటోన్మెంట్‌లో 49.36 శాతం పోలింగ్ 
  • మేడ్చల్ - మల్కాజ్ గిరిలో 56.17 శాతం,
  • రంగారెడ్డిలో 59.94 శాతం,
  • హన్మకొండలో 68.81 శాతం ఓటింగ్


    06:36 AM
    పోలింగ్‌ ఇలా.. 

  • రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,26,02,793 మంది
  • పోలింగ్‌ పాల్గొన్న 2,32,59,256 మంది 
  • ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్లలో..
  • .. 1,15,84,728 మంది పురుషులు,
  • మహిళలు 1,16,73,722 మంది,
  • ఇతరులు 806 మంది
  • జిల్లాల వారీగా చూస్తే.. యాదాద్రి జిల్లాలో అత్యధికంగా 90.36 శాతం పోలింగ్
  • నియోజకవర్గాల వారీగా చూస్తే.. నల్గొండ మునుగోడులో 91.89 శాతం ఓటింగ్
  • ఖమ్మం పాలేరులో 90.89,
  • యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో 90.77 శాతం పోలింగ్ 


    06:32 AM
    ఫైనల్‌ ఓటింగ్‌ పర్సంటేజ్‌ ఇలా..

  • నవంబర్‌ 30వ తేదీ గురువారం జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌
  • ఉదయం 7గం. నుంచి సాయంత్రం 5.గం దాకా.. 
  • సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4గం. కే ముగింపు
  • అప్పటికే లైన్‌లో ఉన్నవాళ్లకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం
  • రాత్రి 10:30గం. దాకా కూడా క్యూలో ఓటర్లు
  • ఆలస్యంగా శుక్రవారం సాయంత్రం అధికారిక పోలింగ్‌ శాతం విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం
  • తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో నమోదైన తుది పోలింగ్‌ శాతం 71.34 శాతం 
  • 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్‌ 73.37 శాతం నమోదు
  • గతంలో కంటే రెండు శాతం పోలింగ్‌ తగ్గింది
మరిన్ని వార్తలు