డీప్‌ఫేక్ వీడియోలు వైరల్‌ కావొచ్చు.. ట్రాప్‌లో పడకుండా చూడండి: కేటీఆర్

24 Nov, 2023 10:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఎన్నికలకు తేదీ దగ్గర పడడంతో.. ప్రచార శైలి కూడా భిన్నమార్గంలోనే సాగుతోంది. ఒకవైపు ఓటర్లతో నేరుగా ఇంటెరాక్షన్‌తో పాటు మరోవైపు సోషల్‌మీడియాలోనూ నేతల ‘ఆరోపణ-ప్రత్యారోపణల’ జోరు కనిపిస్తోంది. ఈ క్రమంలో తాజాగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మం‍త్రి కల్వకుంట్ల తారకరామారావు సోషల్‌ మీడియా ద్వారా పార్టీ శ్రేణుల్ని, సోషల్‌ మీడియా సైన్యాన్ని అప్రమత్తం చేశారు.

ఎన్నికలకు కొద్ది సమయమే ఉంది. స్కామ్‌గ్రెస్ స్కామర్‌ల నుండి రాబోయే కొద్ది రోజులలో అనేక తప్పుడు/డీప్ ఫేక్ వీడియోలు & ఇతర రకాల అసంబద్ధ ప్రచారాలు ప్రచారంలోకి రావొచ్చు. బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి అని సూచించారు.  

ఎవరూ మోసపూరిత వలలో చిక్కుకోవద్దు. అలాగే తప్పుడు ప్రచారాల వలలో ఓటర్లు పడకుండా చూడాలని కేటీఆర్‌ కోరారు. డీప్‌ఫేక్‌ కంటెంట్‌ గురించి దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్న తరుణంలో.. కేంద్రం అలాంటి కంటెంట్‌ వ్యాప్తి కట్టడికి ప్రయత్నిస్తున్న తరుణంలో తెలంగాణ ఎన్నికల్లోనూ ఆ తరహా కంటెంట్‌ వైరల్‌ కావొచ్చంటూ కేటీఆర్‌ చేసిన కామెంట్లు ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది.

మరిన్ని వార్తలు