కాంగ్రెస్‌లో చేరిన అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం..

24 Nov, 2023 13:08 IST|Sakshi

సాక్షి, జోగులాంబ గద్వాల జిల్లా: తెలంగాణ అసెం‍బ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుతుండటంతో.. గెలుపే లక్ష్యంగా అన్నీ పార్టీలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి.  

ఎన్నికల పోరుకు మరో ఆరు రోజులే సమయమున్న నేపథ్యంలో అధికార బీఆర్‌ఎస్‌ పార్టీకి షాక్‌ తగిలింది. అలంపూర్‌ నియోజకవర్గ సిట్టింగ్‌ ఎమ్మెల్యే అబ్రహం బీఆర్‌ఎస్‌ను వీడి. కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. శుక్రవారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు.

కాగా అలంపూర్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న అబ్రహంను మరోసారి బీఆర్‌ఎస్‌ తరపున అభ్యర్థిగా ప్రకటించిన కేసీఆర్‌.. అనూహ్యంగా అభ్యర్థిని మార్చారు.  అబ్రహం స్థానంలో చల్లా వెంకట్రామిరెడ్డి వర్గానికి చెందిన విజేయుడికి టికెట్ ఖాయం చేసింది పార్టీ అధిష్టానం. సిట్టింగ్‌ ఎమ్మెల్యే అయిన తనను కాదని వేరే వ్యక్తికి టికెట్‌ ఇవ్వడంతో అబ్రహం బీర్‌ఎస్‌ పార్టీపై అసంతృప్తితో రగిలిపోతున్నారు.  ఈ క్రమంలోనే ఆయన పార్టీ వీడాలని నిర్ణయించుకున్నారు. 

మరిన్ని వార్తలు