చంద్రబాబుకు అ­మ్ముడుబోయి.. చరిత్రహీనులుగా మిగిలి..

15 Dec, 2023 11:21 IST|Sakshi

సాక్షి, అమరావతి: 

YSRCPతరపున 2019లో ఎమ్మెల్యేగా గెలిచిన ఉండవల్లి శ్రీదేవి, ఆనం రాంనారాయణ రెడ్డి.. ఇవ్వాళ తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేసి సస్పెన్షన్‌కు గురయిన ఉండవల్లి శ్రీదేవి, ఆనం రాంనారాయణ రెడ్డి.. ఇప్పుడు ముసుగు తీసి టిడిపిలో చేరబోతున్నారు.

చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరనున్న వైసిపి ఎమ్మెల్యేలు

2019 ఎన్నికల తర్వాత తెలుగు దేశం పార్టీ ఢీలా పడడం, ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధోపాతాళానికి పడిపోవడంతో చంద్రబాబు పక్కచూపులు చూస్తున్నారు. 52 రోజులు జైల్లో గడిపిన సమయంలో పార్టీ యావత్తు నిద్రావస్థలోకి వెళ్లిపోవడంతో.. అప్పటికప్పుడు పవన్‌తో జైలు నుంచే పొత్తు ప్రకటించారు. అయినా పార్టీ కోసం ముందుకొచ్చే వాళ్లు లేకపోవడం పక్కచూపులు చూస్తున్నారు. YSRCP నుంచి సస్పెన్షన్‌కు గురయిన ఉండవల్లి శ్రీదేవి, ఆనం రాంనారాయణ రెడ్డి.. ఇద్దరిని ఇవ్వాళ పార్టీలో చేర్చుకోబోతున్నాడు చంద్రబాబు. వీరిద్దరికి టికెట్లు ఇస్తారా? లేక వెన్నుపోటేనా అన్నది త్వరలోనే తేలనుంది.

ఉండవల్లి, ఆనం.. దొందు దొందే

అధికారం ఇచ్చిన పార్టీకే అనాయ్యం చేయాలని చూసి.. స్వప్రయోజనాల కోసం దిగజారిపోయి.. చంద్రబాబుకు అ­మ్ముడుబోయిన ఎమ్మెల్యేలు ఉండవల్లి  శ్రీదేవి, ఆనం రామనారాయణ. తిన్నింటి వాసాలు లెక్కపెట్టాలని చూశారు.. నమ్మించి వెన్నుపోటు పొడవాలని చూశారు. ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌లో.. విప్‌ ఉల్లంఘించినందుకు ఉండవల్లి శ్రీదేవి, ఆనం రాంనారాయణరెడ్డితో పాటు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కోటం శ్రీధర్‌రెడ్డిపై వైఎస్సార్‌సీపీ సస్పెన్షన్‌ వేటు వేసిన సంగతి తెలిసిందే.

రహస్యంగా టీడీపీకి ఓటు వేసి దొరికిపోయిన వీరిని, వైఎస్సార్‌సీపీ నాయకత్వం సమర్దంగా కోడింగ్ ను అమలు చేసి వారిని ఇట్టే పట్టేసింది. వారిని అంతకుముందే పిలిచి వచ్చే శాసనసభ ఎన్నికలలో టిక్కెట్లు ఇవ్వడం లేదని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇతర పదవులు ఇస్తామని చెప్పారు. అయినా వారు సంతృప్తి చెందలేదు. తెలుగుదేశం ఆశపెట్టడంతో వాటికి లొంగి పోయారు.

>
మరిన్ని వార్తలు