Dec 15th: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

15 Dec, 2023 19:00 IST|Sakshi

పొత్తులు, టికెట్‌లు, సీట్లు.. బాబు మంతనాలు

కోర్టుల్లో సాంకేతిక వాదనల కోసం లాయర్లతో మంతనాలు

కొడుకు లోకేష్‌ పాదయాత్ర ముగింపు సభ కోసం చర్చలు

TDP Chandrababu Cases, Political Updates..

7:00 PM, Dec 15, 2023
ఏమైనా చేయండి.. యువగళం ముగింపు సక్సెస్‌ చేయండి

 • టీడీపీ ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశం
 • యువగళం విజయోత్సవ సభ ఏర్పాట్లను సమీక్షించిన చంద్రబాబు
 • విజయోత్సవ సభకు లోటు లేకుండా ఏర్పాట్లు చేయాలన్న చంద్రబాబు
 • సభ సక్సెస్‌ కాకపోతే లోకేష్‌ ఊరుకోడని చెబుతోన్న చంద్రబాబు
 • ఎంత ఖర్చయినా సరే.. నాది బాధ్యత, జనాలను తీసుకురావాలని పిలుపు
 • ఇప్పటికే రంగంలోకి దిగిన లోకేష్‌ కోటరీ
 • ప్రతీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌కు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి టార్గెట్‌లు
 • జనం తగ్గితే ఎమ్మెల్యే టికెట్‌లు కష్టమని హెచ్చరిస్తోన్న లోకేష్‌ కోటరీ
 • లోకేష్‌ సభ సక్సెసయితేనే పార్టీకి మనుగడ ఉంటుందని హెచ్చరికలు

6:55 PM, Dec 15, 2023
మరి.. మీరెందుకు కుప్పం వచ్చారు బాబు.? : పేర్ని నాని

 • రాజకీయాల్లో ట్రాన్స్ ఫర్లు ఉంటాయా అని చంద్రబాబు అంటున్నారు
 • చంద్రబాబు కూడా చంద్రగిరి నుంచి కుప్పంకి ట్రాన్స్ ఫర్ అయ్యారు
 • మేం వద్దనుకున్న వారిని చంద్రబాబు చేర్చుకున్నారు
 • వైనాట్ 175కి జగన్ అన్ని ఏర్పాట్లు, వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు
 • జగన్ రాజకీయ ఎత్తుగడలతో చంద్రబాబుకు షాకులు తగులుతున్నాయి
 • గోతికాడ నక్కలా వైసీపీ ఎమ్మెల్యేల కోసం చంద్రబాబు ఎదురు చూస్తున్నారు
 • పవన్ కు రాష్ట్ర అభివృద్ధి, ప్రజల బాగోగులు పట్టవు 
 • జగన్ ను ఓడించాలి, చంద్రబాబును సీఎం చేయడమే పవన్ ధ్యేయం
 • పవన్ తన టెంట్ హౌస్ పార్టీని చంద్రబాబుకు లీజుకు ఇచ్చారు : పేర్ని నాని

5:05 PM, Dec 15, 2023
జనసేనకు రాంరాం.. ఒంటరిగానే తెలంగాణలో పోటీ : బీజేపీ

 • పొత్తులపై బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
 • మా టార్గెట్ లోకసభ ఎన్నికలు
 • పార్లమెంట్ ఎన్నికలకు సిద్దం కావాలని బీజేపీ నేతలు, క్యాడర్ కు కిషన్ రెడ్డి పిలుపు
 • డిసెంబర్ చివరి వారంలో తెలంగాణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
 • పార‌్లమెంట్ ఎన్నికల్లో పొత్తులు ఉండవు : స్పష్టం చేసిన కిషన్ రెడ్డి
 • బీఆర్ఎస్, బీజేపీ పొత్తు.. ప్రచారం మాత్రమే
 • లోకసభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తోంది
 • తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పై సమాన పోరాటాలుంటాయి
 • లోకసభలో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం
 • తెలంగాణలో రాజకీయంగా బీజేపీకి మంచి అవకాశముంది
 • పార్లమెంట్ ఎన్నికలకు క్యాడర్ సిద్దం కావాలి
 • సర్వే సంస్థలకు సైతం అందని విధంగా లోకసభ ఫలితాలుంటాయి
 • కొత్తగా ఎన్నికైన 8మంది బీజేపీ ఎమ్మెల్యేలు అన్ని ఉమ్మడి జిల్లాల్లో పర్యటిస్తారు
 • మూడోసారి కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం ఏర్పడబోతోంది

5:02 PM, Dec 15, 2023
చంద్రబాబుకు పవన్‌ కళ్యాణ్‌ కోవర్ట్‌
: RGV

 • జనసేన స్థాపనకు కారణమే చంద్రబాబు : రాంగోపాల్‌ వర్మ
 • మరోమాటలో జనసేనలో పవన్, చంద్రబాబుకు కోవర్టు
 • వారిద్దరి మధ్య పొత్తు అనే దానికి అర్థమే లేదు
 • ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు పరిస్థితి ఏం బాగోలేదు
 • తెలంగాణాలో కేసీఆర్ కు ఉన్నంత బలమైన అపొజిషన్ ఏపీలో లేదు
 • రేవంత్ రెడ్డి ఓ స్ట్రాంగ్ అపొజిషన్ గా వచ్చి సీఎం అయ్యారు : ఆర్జీవీ

4:23 PM, Dec 15, 2023
ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసు వాయిదా

 • ACB కోర్టులో IRR అలైన్మెంట్ కేసు విచారణ వాయిదా
 • ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్ పైనా విచారణ వాయిదా
 • తదుపరి విచారణలు జనవరి 30కి వాయిదా

ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో ఏం జరిగిందంటే?

 • CID అభియోగాల్లో ముఖ్యమైన అంశాలు
 • టీడీపీ హయాంలో రాజధాని ముసుగులో జరిగిన అమరావతి భూకుంభకోణమే ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసు
 • కర్త, కర్మ, క్రియ అంతా నాటి సీఎం చంద్రబాబే
 • లింగమనేని కుటుంబంతో క్విడ్‌ ప్రో కోలో భాగంగానే ఏ–1 చంద్రబాబుకు కరకట్ట నివాసం, ఏ–2 పొంగూరు నారాయణకు సీడ్‌ క్యాపిటల్‌లో భూములు
 • స్వార్థ ప్రయోజనాల కోసం ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ మూడుసార్లు మార్పు
 • అలైన్‌మెంట్‌ మార్పుల ద్వారా లింగమనేని రమేశ్‌ కుటుంబంతో చంద్రబాబు, నారాయణ క్విడ్‌ప్రోకో
 • 2015 జూలై 22, 2017 ఏప్రిల్‌ 4, 2018 అక్టోబరు 31న ఇన్నర్‌రింగ్‌ అలైన్‌మెంట్‌లో మార్పులు
 • ఇన్నర్‌ రింగ్‌రోడ్డును ఆనుకుని లింగమనేనికి 168.45 ఎకరాలు
 • అలైన్‌మెంట్‌ను మార్చడం ద్వారా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం
 • ఇన్నర్‌రింగ్‌ రోడ్డు నిర్మించారా లేదా అన్నదానితో నిమిత్తం లేకుండా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం కల్పించే రీతిలో అలైన్‌మెంట్‌
 • కరకట్ట కట్టడం.. క్విడ్‌ప్రోకో కిందే చంద్రబాబుకు అప్పగించిన లింగమనేని
 • కరకట్ట నివాసాన్ని నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది భూముల్లో నిర్మాణం
 • లింగమనేని రమేశ్‌ ఆ ఇంటికి టైటిల్‌దారుగా ఉన్నప్పటికీ చంద్రబాబు ఏడేళ్లుగా నివాసం
 • సీఎం హోదాలోనూ, ప్రతిపక్ష నేత హోదాలోనూ అదే నివాసంలో చంద్రబాబు

ఫైబర్‌ నెట్‌ కేసులో ఏం జరిగిందంటే?

 • ‘ఫైబర్‌గ్రిడ్‌’ కుంభకోణం దర్యాప్తులో CID కీలక అంశాలు
 • టెరాసాఫ్ట్‌ పేరుతో రూ.284 కోట్లు కొట్టేసిన లోకేశ్‌ సన్నిహితులు
 • కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏపీలో చేపట్టిన ఫైబర్‌నెట్‌ ప్రాజెక్టు
 • రూ.333 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు మొదటి దశ పనులను నిబంధనలకు విరుద్ధంగా లోకేశ్‌ సన్నిహితుడైన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్‌కు అప్పగింత
 • కనుమూరి కోటేశ్వరరావు సహకారాన్ని తీసుకున్న వేమూరి వేమూరికి చెందిన కాఫీ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్, ఫ్యూచర్‌ స్పేస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీల్లో కనుమూరి కోటేశ్వరరావును భాగస్వామిగా చేరిక
 • వేమూరి హరికృష్ణ, తుమ్మల గోపీచంద్, రామ్‌కుమార్‌ రామ్మూర్తిలతో కలిసి విజయవాడ కేంద్రంగా నెటాప్స్‌ ఫైబర్‌ సొల్యూషన్స్‌ LLP అనే మ్యాన్‌పవర్‌ సప్లై కంపెనీ పేరిట ఓ షెల్‌ కంపెనీ సృష్టి
 • ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న టెరాసాఫ్ట్‌ కంపెనీ, ఇతర కంపెనీలకు రూ.284 కోట్లు విడుదల చేసిన చంద్రబాబు ప్రభుత్వం
 • నెటాప్స్‌ పేరుతో డొల్ల కంపెనీ సృష్టించి నిధులు మళ్లించిన వేమూరి హరికృష్ణ
 • నెటాప్స్‌ కంపెనీకి చెల్లించిన రూ.8.35 కోట్లను వేమూరి హరికృష్ణకు చెందిన ఫ్యూచర్‌ స్పేస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు మళ్లించారు.
 • నెటాప్స్‌ కంపెనీ నుంచి రూ.1.49 కోట్లను వేమూరి హరికృష్ణ కుమార్తె వేమూరి అభిజ్ఞ ఖాతాకు మళ్లించారు. విదేశాల్లో ఉన్న ఆమె ఇక్కడ తమ కంపెనీలో పనిచేస్తున్నట్లు చూపించి జీతం కింద నెలకు రూ.1.35 లక్షలు చెల్లింపు
 • వేమూరి హరికృష్ణ భార్య వేమూరి నీలిమ ఫ్లాట్‌ కొనుగోలు చేసేందుకు అడ్వాన్స్‌గా రూ.39.74 లక్షలు నెటాప్స్‌ కంపెనీ బదిలీ
 • నెటాప్స్‌ కంపెనీ 2017 జూన్‌ నుంచి 2020 జూన్‌ మధ్య ఎలాంటి సేవలు, పరికరాల సరఫరా లేకుండానే వేమూరి హరికృష్ణకు రూ.95.90 లక్షలు బదిలీ
 • నెటాప్స్‌ కంపెనీ 2017 జనవరి నుంచి 2019 మార్చి మధ్యలో సేవలు, పరికరాల సరఫరా లేకుండా స్ఫూర్తి ఇన్నోవేషన్స్‌కు రూ.76 లక్షలు బదిలీ
 • టెరాసాఫ్ట్‌ లావాదేవీలను ఆడిటింగ్‌ చేసిన స్వతంత్ర సంస్థ ఐబీఐ గ్రూప్‌
 • ఇప్పటికే ఈ కేసులో నలుగురు సూత్రధారుల అరెస్టు

3:31 PM, Dec 15, 2023
ఎన్నికల వేళ చంద్రబాబు డ్రామాలు : సజ్జల

 • ఆస్తుల కోసమే చంద్రబాబు హైదరాబాద్‌లో ఉంటున్నాడు
 • మా పార్టీ ఇంటర్నల్ వ్యవహారాలు చంద్రబాబుకు ఎందుకు..?
 • చంద్రగిరి నుంచి కుప్పానికి చంద్రబాబు ఎందుకు వెళ్లాడు..?
 • మంగళగిరికి లోకేష్‌కు సంబంధం ఏంటీ..?
 • ఏపీకి చంద్రబాబు గెస్ట్‌లా మాత్రమే వస్తాడు

1:31 PM, Dec 15, 2023
ఎన్నికల వేళ చంద్రబాబు డ్రామాలు

 • సచివాలయంలో మాట్లాడిన ప్రభుత్వ సలహాదారులు,సజ్జల రామకృష్ణారెడ్డి
 • చంద్రబాబు ఎన్నికలకు ఎలా వెళ్తారో చెబుతారని అనుకున్నాం..!
 • మా ప్రభుత్వంలో కోటీ 47 లక్షల కుటుంబాలకు నేరుగా సంక్షేమం అందుతుంది
 • ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని ప్రజలు తమ హక్కుగా పొందుతున్నారు
 • టీడీపీ ప్రభుత్వంలో ఏం చేశారో ఒక్కటైనా చెప్పగలరా?
 • ఉద్ధానం కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు
 • 2014-19 మధ్య సీఎంగా ఉన్న చంద్రబాబు ఉద్ధానానికి ఏం చేశాడు
 • ఉద్ధానం కోసం పవన్ కళ్యాణ్ ఏం చేశాడు?
 • చంద్రబాబు ఎవరికి కథలు చెబుతాడు?
 • తుఫాన్ల సమయంలో ఫలానా తక్షణ సాయం చేశానని చంద్రబాబు లెక్కలు చెప్పగలరా?
 • తుఫాన్ విషయంలో 22 లక్షల్లో 10 వేల కోట్లు నష్టం వాటిల్లిందని కేంద్రానికి చంద్రబాబు లేఖ రాశాడు
 • ఈ లేఖ రాయడానికి చంద్రబాబుకి తలకాయ ఉందా?
 • ముఖ్యమంత్రి గా పనిచేసిన వ్యక్తి బాధ్యత లేకుండా మాట్లాడితే ఎలా?
 • తుఫాన్ పరిహారం విషయంలో తప్పు పట్టడానికి అవకాశం లేకుండా చేశాం
 • అసలు చంద్రబాబుకి ఈ రాష్ట్రంతో సంబంధం ఏంటి?
 • హైదరాబాద్ లో కూర్చుని రాష్ట్రానికి గెస్ట్ లా వస్తాడు.!
 • చంద్రబాబు కి ప్రజామోదం లేదు
 • .2019లోనే చంద్రబాబును జనం రిజెక్ట్ చేశారు
 • ఈ రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకున్నాడు కాబట్టో చంద్రబాబును జనం చెత్త బుట్టలో వేశారు
 • హైదరాబాద్ లో ఉంటే ఆస్తులు కాపాడుకోవచ్చని ప్రయత్నం చేస్తున్నారు
 • చంద్రబాబు, లోకేష్,ఆయన దత్తపుత్రుడు కూడా రాష్ట్రానికి రావడం లేదు
 • చంద్రబాబును చూస్తుంటే సినిమాలో క్షుద్రపూజలు గుర్తొస్తున్నాయి
 • గతంలో దుర్గ గుడిలో పూజలు చేసినట్లు ఇప్పుడు కూడా పూజలేమైనా చేస్తున్నాడు అనుకుంటా
 • అభ్యర్థులు మార్పు విషయంలో అవాకులు చవాకులు పేలుతున్నారు
 • బీసీ సీట్లలో నువ్వు,నీకొడుకు ఎందుకు పోటీ చేస్తున్నారు
 • చంద్రగిరి వదిలేసి కుప్పంలో ఎందుకు పోటీచేస్తున్నారు
 • 2024లో చంద్రబాబుకు కుప్పంతో సహా ఒక్క టిక్కెట్ కూడా రాదు
 • అత్యంత పారదర్శకంగా జరుగుతున్న జగన్ మోహన్ రెడ్డి పాలన పై బురద జల్లుతున్నారు
 • చంద్రబాబు తప్పిదాలను మాకు ఆపాదించి రోజూ పనికిమాలిన రాతలు రాస్తున్నారు
 • కౌంటర్లు పెట్టి తెలంగాణలో వారిని తీసుకొచ్చి ఓట్లను రిజిస్టర్ చేయిస్తున్నారు
 • సిటిజన్ ఫోరమ్ పేరుతో ఒక భోగస్ ఫోరమ్ ను పెట్టారు
 • వాలంటీర్లకు ఎన్నికలకు సంబంధం లేదు
 • చీఫ్ సెక్రటరీగా చేసిన ఎల్వీ సుబ్రహ్మణ్యానికి తెలియదా?
 • నిమ్మగడ్డ రమేష్ కు తెలియదా?
 • సిటిజన్ ఫోరమ్ చంద్రబాబు చేత చంద్రబాబు కోసం ఏర్పాటు చేసింది
 • ఎన్నికల్లో వైసీపీ ఫర్ ఫెక్ట్ టీమ్ ను దించుతుంది
 • మేం చాలా ఆత్మ నిబ్బరంగా ఉన్నాం...బలంగా ఉన్నాం
 • ఏబీఎన్ డిబేట్లలో అనలిస్ట్ లు తగ్గినట్లున్నారు
 • చంద్రబాబు ఏబీఎన్ డిబేట్లలో ప్రయత్నిస్తే బాగుంటుంది
 • సామాజికవర్గ సమీకరణాలతో, 175 చోట్ల పర్ ఫెక్ట్ టీమ్ ను దించుతున్నాం
 • చంద్రబాబుకు చేతనైతే ఆ పని చేయమనండి

11:31 AM, Dec 15, 2023

నీతులు భలే చెబుతావు బాబు..!

 • టికెట్ల కేటాయింపులో కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు
 • ప్రజాభిప్రాయంతోనే అభ్యర్ధుల ఎంపిక
 • కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు విభిన్న కోణాల్లో ప్రజాభిప్రాయ సేకరణ
 • ఆ తర్వాతే అభ్యర్ధుల ఎంపిక : చంద్రబాబు

నిజంగా ప్రజాభిప్రాయం మీద నిలబడతావా చంద్రబాబు.?

 • ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినపుడు ఎవరి అభిప్రాయం తీసుకున్నావు?
 • పార్టీని, ప్రభుత్వాన్ని లాగేసుకున్నప్పుడు ఎవరి అభిప్రాయం తీసుకున్నావు?
 • మీ పార్టీ సిద్ధాంతానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో చేతులు కలిపినప్పుడు ఎవరి అభిప్రాయం తీసుకున్నావు?
 • అధికారాన్ని అడ్డు పెట్టుకుని అడ్డంగా ప్రభుత్వ ఖజానాను దోచుకున్నప్పుడు ఎవరికి చెప్పావు?
 • ఓటుకు కోట్లు ఇవ్వడమే కాకుండా.. మనవాళ్లు బ్రీఫ్‌డ్‌ మీ అంటూ హామీలివ్వడానికి ఎవరి అభిప్రాయం సేకరించావు?
 • దళితుల్లో ఎవరైనా పుడతారా? అంటూ ప్రశ్నలు సంధించడానికి ఎవరి అభిప్రాయాలను సేకరించారు?
 • రాష్ట్రాన్ని విడగొడితే ఏపీకి పది లక్షల కోట్లిస్తే చాలని ప్రకటన చేయడానికి ఎవరి అనుమతి తీసుకున్నారు?
 • ప్రత్యేక హోదా వద్దే వద్దు.. ప్యాకేజీ ముద్దు అని ఖరారు చేయడానికి ఎవరి అభిప్రాయం సేకరించారు?
 • లోకేష్‌ను దొడ్డిదారిలో మంత్రి పీఠంపైకి ఎక్కించినప్పుడు అభిప్రాయ సేకరణ చేయలేదేందుకు?
 • 23 మంది ఎమ్మెల్యేలను YSRCP నుంచి ఫిరాయింపజేయించి, వాళ్లలో ముగ్గురికి మంత్రి పదవులిచ్చినప్పుడు ఎవరి అభిప్రాయాలు సేకరించారు?
 • అంతెందుకు.. జైల్లో కూర్చుని పొత్తు చర్చలు చేసినప్పుడు ఎవరి అభిప్రాయాలు సేకరించారో.?
 • నిజంగా చంద్రబాబు వద్దని కుప్పం ప్రజలు చెబితే.. పోటీ నుంచి తప్పుకుంటారా?
 • అసలు మీ పార్టీలో ప్రజాస్వామ్యానికి విలువుందా? లేక కులస్వామ్యం మాత్రమే నడుస్తుందా?

8:13 AM, Dec 15, 2023
బావను డీకోడ్‌ చేసే పనిలో బాలయ్య

 • బావ చంద్రబాబు ఎప్పటికి అర్థమవుతాడు?
 • మా నాన్నకెందుకు వెన్నుపోటు పొడిచాడు?
 • నాకు రావాల్సిన పదవిని, పార్టీని తానెందుకు లాగేసుకున్నాడు?
 • ఏపీలో నన్నెందుకు ఎమ్మెల్యే పదవికే పరిమితం చేశాడు?
 • కనీసం జైలుకెళ్లినప్పుడయినా.. నాకు అధ్యక్ష పదవి ఇవ్వలేదెందుకు?
 • నాకు పదవి ఏదంటే.. అల్లుడి సంగతి చూడమని ఎందుకంటాడు?
 • అసలు పోటీ చేయని తెలంగాణకు వెళ్లి ప్రెస్‌మీట్‌ ఎందుకు పెట్టించాడు?
 • తీరా తొడలు కొట్టి ప్రకటన చేశాక.. పోటీ లేదని ఎందుకు చెప్పాడు?
 • ఇంతకీ మా బావ మనసులో ఏముంది?
 • ఎప్పటికి నేను డీకోడ్‌ చేయగలను?
 • అదొక అన్‌-స్టాపబుల్‌ అసైన్‌మెంట్‌..!

7:23 AM, Dec 15, 2023
చంద్రబాబు+దత్తపుత్రుడు = డిపాజిట్లు గల్లంతు

 • ఉద్దానంలో మాట్లాడిన సీఎం జగన్
 • పేదల బతుకులు ఎలా మార్చాలి అనే తపన మీ బిడ్డ జగన్‌కు మాత్రమే ఉంది
 • పేదల ప్రాణాలంటే చంద్రబాబుకు లెక్కే లేదు
 • కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు నీరు కూడా అందించలేదు
 • సొంత నియోజకవర్గాన్నే పట్టించుకోని చంద్రబాబుకు ఉత్తరాంధ్ర మీద ఏం ప్రేమ ఉంటుంది?
 • ఎన్నికలు వచ్చే సరికి పొత్తులు, ఎత్తులు, చిత్తుల మీద బాబు ఆధారపడతారు
 • దత్తపుత్రుడి మీద చంద్రబాబు ఆధారపడతారు
 • తెలంగాణాలో తన దత్తపుత్రుడిని పోటీలో పెట్టారు
 • ఆంధ్ర పాలకులకు చుక్కలు చూపిస్తానని తెలంగాణాలో డైలాగులు కొడతాడు....ఈ ప్యాకేజీ స్టార్, మ్యారేజీ స్టార్ దత్తపుత్రుడు
 • తెలంగాణాలో ఆంధ్రా ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడిన దత్తపుత్రుడికి డిపాజిట్లు కూడా రాలేదు
 • ఇండిపెండెంట్ గా నిలబడిన చెల్లెమ్మ బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా దత్తపుత్రుడికి రాలేదు
 • ఉత్తరాంధ్రకు చంద్రబాబు, దత్తపుత్రుడు చేయని ద్రోహం లేదు
 • విశాఖను పరిపాలనా రాజధాని చేస్తామంటే అడ్డుకుంటున్నారు
 • విశాఖకు సీఎం వచ్చి ఉంటానంటే ఏడుస్తున్నారు
 • నాన్ లోకల్స్ పక్క రాష్ట్రంలో ఉండి మన రాష్ట్రంలో ఏం చేయాలో నిర్ణయిస్తామంటారు
 • ఈ నాన్ లోకల్స్ అందరికీ ఆంధ్ర రాష్ట్రం పై ప్రేమ లేదు
 • అక్కచెల్లెమ్మలకు పొదుపు సంఘాలను బాబు మోసం చేశారు
 • పార్టీలు సైతం చూడకుండా ప్రతి అక్కచెల్లెమ్మలకు అండగా నిలబడ్డాం
 • వారు 5 ఏళ్లు అధికారంలో ఉండి పేదవారికి సెంటు స్థలం ఇవ్వలేదు
 • పేదలకు ఇంటి స్థలం ఇస్తామంటే వారికి ఏడుపు
 • 2014-19 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు పది శాతం హామీలు కూడా అమలు చేయలేదు
 • YSRCP ప్రభుత్వంలో మేనిఫెస్టో హామీలు 99 శాతం అమలు చేస్తున్నాం
 • దోచుకోవడం, పంచుకోవడం మాత్రమే చంద్రబాబుకు తెలుసు
 • మీ బిడ్డ జగన్‌ ప్రభుత్వంలో లంచాలు, వివక్ష, అవినీతి లేకుండా నేరుగా డబ్బులు జమ
 • ప్రజలకు మంచి చేస్తుంటే చంద్రబాబుకు ఏడుపే ఏడుపు
 • మరో 3 నెలలు ఆగి ఈ కేన్సర్ గడ్డలను తొలగిద్దాం
 • రాబోయే రోజుల్లో వారి అబద్ధాలు ఇంకా ఎక్కువ అవుతాయి
 • మీ ఇంటికి, కుటుంబానికి మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే అండ
 • ప్రతి ఇంటికి కేజీ బంగారం, బెంచ్ కారు కొనిస్తామని హామీ ఇస్తారు
 • మాటలు చెప్పి మోసం చేసే వారిని నమ్మకండి : సీఎం జగన్

7:10 AM, Dec 15, 2023
ఇన్నర్‌రింగ్‌ రోడ్డు కేసు @ హైకోర్టు

 • రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పై హైకోర్టులో విచారణ
 • ముందస్తు బెయిల్ పిటిషన్ పై సిఐడీ తరపు వాదనలు పూర్తి
 • ముందస్తు బెయిల్ పిటిషన్ పై సిఐడి తరపు వాదనలు పూర్తి
 • సిఐడి తరపు వాదనలు వినిపించిన ఏజీ శ్రీరామ్
 • చంద్రబాబు తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు
 • వాదనల కొనసాగింపునకు విచారణ సోమవారానికి వాయిదా

6:56 AM, Dec 15, 2023
చంద్రబాబు కేసుల స్టేటస్‌ ఏంటీ?

 • కేసు : స్కిల్ కుంభకోణం
 • స్టేటస్‌ : నవంబర్‌ 20న బెయిల్‌ ఇచ్చిన హైకోర్టు
 • వివరణ :  ఆరోగ్య కారణాలతో ఇచ్చిన బెయిల్‌ను సాధారణ బెయిల్‌గా మార్చిన హైకోర్టు
 • కేసు గురించి బహిరంగంగా వ్యాఖ్యలు చేయొద్దని సూచించిన హైకోర్టు
 • కేసు : స్కిల్ స్కాం
 • అంశం : క్వాష్‌ పిటిషన్‌
 • స్టేటస్‌ : సుప్రీంకోర్టులో పెండింగ్‌
 • వివరణ : ఈ నెలలో తీర్పు వచ్చే అవకాశం
 • కేసు : ఇసుక కుంభకోణం
 • అంశం : చంద్రబాబు ముందస్తు బెయిల్‌  పిటిషన్‌
 • స్టేటస్‌ : హైకోర్టులో జరుగుతున్న విచారణ
 • కేసు : ఫైబర్‌ నెట్‌ పేరిట నిధుల దోపిడి
 • అంశం : ముందస్తు బెయిల్‌  పిటిషన్‌
 • స్టేటస్‌ : సుప్రీంకోర్టులో పెండింగ్‌
 • వివరణ : జనవరి 17కు తదుపరి విచారణ వాయిదా
 • కేసు : అంగళ్లులో అల్లర్లు రెచ్చగొట్టిన కేసు
 • అంశం : ముందస్తు బెయిల్‌  పిటిషన్‌
 • స్టేటస్‌ : మంజూరు చేసిన హైకోర్టు
 • వివరణ : ఏ1గా ఉన్న చంద్రబాబు, మరో 170 మంది ఇతర నిందితులు
 • కేసు : ఇన్నర్‌ రింగ్‌ రోడ్డులో అక్రమాల కేసు
 • అంశం : ముందస్తు బెయిల్‌  పిటిషన్‌
 • స్టేటస్‌ : హైకోర్టులో జరుగుతున్న విచారణ
 •  కేసు : మద్యం విధానాల్లో అక్రమాలకు పాల్పడి నిధులు కొట్టేసిన కేసు
 • అంశం : ముందస్తు బెయిల్‌  పిటిషన్‌
 • స్టేటస్‌ : హైకోర్టులో జరిగిన విచారణ
 • వివరణ : తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అరెస్ట్ చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు, తీర్పు రిజర్వ్
>
మరిన్ని వార్తలు