బీజేపీ ప్రచార నిర్వహణకు 300 కాల్‌ సెంటర్లు

13 Sep, 2023 02:34 IST|Sakshi

దేశవ్యాప్తంగా 10 జోన్ల ఏర్పాటు!

తెలంగాణ–ఏపీ జోన్‌ ఇన్‌చార్జ్గా అమిత్‌ థాకర్‌

సాక్షి, న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల ప్రచార నిర్వహణకు బీజేపీ భారీగా ఏర్పాట్లు చేస్తోంది. దేశవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం, ప్రచార అంశాలను రూపొందించడం, ఓటర్లను ఆకట్టుకునే కార్యక్రమాలు నిర్వహించడమే లక్ష్యాలుగా 300 కాల్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తోంది. దేశాన్ని 10 జోన్లుగా విభజించించి, ప్రతి 27 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకటి చొప్పున కాల్‌ సెంటర్‌ను నిర్వహించనుంది.

ఇవి ఓటర్లకు నిత్యం ఫోన్‌ చేసి మేనిఫెస్టోను వివరిస్తాయని బీజేపీ కీలక నేత ఒకరు తెలిపారు. పది జోన్లకు ఒకరు చొప్పున ఇన్‌చార్జ్ల నియామకాలను పూర్తి చేసిన పార్టీ అధిష్టానం తెలంగాణ–ఆంధ్రప్రదేశ్‌ జోన్‌ ఇన్‌చార్జ్గా గుజరాత్‌ ఎమ్మెల్యే అమిత్‌ థాకర్‌ను నియమించింది.

మధ్యప్రదేశ్‌–ఛత్తీస్‌గఢ్‌ జోన్‌కు బిహార్‌ బీజేపీ నేత దేవేశ్‌ కుమార్, ఉత్తరప్రదే శ్‌–ఉత్తరాఖండ్‌ ఇన్‌చార్జ్ గా ఢిల్లీ బీజేపీ ఉపాధ్యక్షు డు రాజీవ్‌ బబ్బర్‌ను నియమించారు. ఈ నేతలు కేంద్ర కార్యాలయంలోని ఐదుగురు ముఖ్యనేతలు, రాష్ట్రాల పరిధిలో కాల్‌సెంటర్ల ఇన్‌చార్జ్లను కలుపుకొని ప్రచారాన్ని పర్యవేక్షించనున్నారు.  

>
మరిన్ని వార్తలు