‘చంద్రబాబు ఎక్స్పైరీ అయిపోయిన టాబ్లెట్‌ లాంటివాడు’

8 Apr, 2021 13:41 IST|Sakshi

సాక్షి, కృష్ణా : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎక్స్పైరీ అయిపోయిన టాబ్లెట్‌ లాంటివాడని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విమర్శించారు. గన్నవరం బాలుర హైస్కూల్‌లో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జడ్పీటీసీ,ఎంపీటీసీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీలో లోకేష్  గుది బండలాంటి వాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు టీడీపీని బీజేపీలో విలీనం చేయడం ఖాయమన్నారు. తెలుగు తమ్ముళ్లు ఆలోచించుకోవాలని హితవు పలికారు. పంచాయతీల్లో 40 శాతం ఓట్లు వచ్చాయని టపాసులు కాల్చిన తండ్రి, కొడుకులు ఏపీలో ఎందుకు పారిపోయారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఎన్నిక ముఖ్యమైనదని, చంద్రబాబు పరిషత్ ఎన్నికల నుంచి తప్పుకోవడం ఆడలేక మద్దెల ఓడు అన్న సామెతలా ఉందని మండిపడ్డారు.

గత టీడీపీ ప్రభుత్వంలో అందించలేని సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పేద ప్రజలకు అందిస్తున్నారని వల్లభనేని వంశీ అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నాడని, కరోనా కష్ట కాలంలో కూడా ప్రజలకు అండగా ఉన్నాడని పేర్కొన్నారు. 2019 ఎన్నికల సమయంలో10వేలు కోట్ల రూపాయలు ఆడపడుచులకు ఇచ్చి మోసం చేయాలని చంద్రబాబు చూశాడని, అదే 10 వేలు కోట్లతో సీఎం జగన్ ఆడపడుచులకు సొంతింటి కల నెరవేర్చాని అన్నారు. తెలంగాణాలో ఓటుకు నోటు విచారణ వస్తుంది కాబట్టి టీడీపీని టీఆర్ఎస్‌లో విలీనం చేశాడని, ఓటుకు నోటు కేసుకు భయపడి 2024 వరకు ఏపీకి రాజధాని హైదరాబాద్‌లో హక్కు ఉన్న పారిపోయి వచ్చాడని దుయ్యబట్టారు. 2019 ఎన్నికల్లో ప్రధాని మంత్రి కావాలని చూసి రాష్టంలోనే చతికిల పడ్డాడని విమర్శించారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వానికి దడిచి టీడీపీ రాజ్యసభ సభ్యులను బీజేపీలో సిగ్గులేకుండా విలీనం చేసాడు.

చదవండి: డబ్బు రాజకీయం సృష్టికర్త చంద్రబాబే: వల్లభనేని వంశీ

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు