లోకేష్‌ది అజ్ఞానమా.. అహంకారమా

5 Mar, 2021 19:36 IST|Sakshi

చంద్రబాబు, లోకేష్‌కు విశాఖలో తిరిగే హక్కు లేదు

సాక్షి, విశాఖటప్నం: నగరంలో రాజధానిని అడ్డుకునే చంద్రబాబు, లోకేష్‌లకు విశాఖలో తిరిగే హక్కులేదన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘విశాఖ ప్రజల అభివృద్ధిని కాంక్షించే పార్టీ వైఎస్సార్‌సీపీ మాత్రమే. విశాఖ అభివృద్ధికి ప్రభుత్వం పక్కా ప్రణాళికతో వెళ్తుంది. భోగాపురం ఎయిర్ పోర్ట్.. మెట్రో లాంటి ప్రాజెక్టులు నిర్మాణం అవుతున్నాయి. కానీ ఇది ఎన్నికల సమయంలో చెప్పే మాట కాదు’’ అన్నారు.

‘‘లోకేష్‌కు మాట్లాడటం రాదు.. ఆయన అజ్ఞానంతో మాట్లాడుతున్నారో.. అహంకారంతో మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. గత ఎన్నికల్లో ప్రజలు తన అహంకారాన్ని అణిచారు. విశాఖలో సమీక్షల పేరిట రెండు హోటల్స్‌ని పోషించడం తప్ప చంద్రబాబు నాయుడు, లోకేష్ ఏం చేశారు. ఆస్తిపన్ను పెంచుతారని దుష్ప్రచారం చేస్తున్నారు. ఆస్తి పన్ను మదింపు చేయడానికి, పెంచడానికి తేడా తెలియని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు.. ఆయన పార్టీ ఉంది’’ అని మండి పడ్డారు.

‘‘కుప్పం ఫలితాలు వచ్చాక చంద్రబాబు నాయుడు లోకేష్‌లకు మైండ్ బ్లాక్ అయినట్టుంది. అందుకే అసభ్యంగా అసహనంతో అబద్ధాలు మాట్లాడుతున్నారు. కొద్ది రోజులు ఇలాగే వుంటే తండ్రి కొడుకులు మినహా ఇతరులు ఎవరూ ఆ పార్టీ లో వుండరు. జీవీఎంసీ ఎన్నికల్లో విశాఖ ప్రజలు టిడిపిని చావుదెబ్బ కొట్టడం ఖాయం’’ అన్నారు.

చదవండి:
నారా లోకేశ్‌ అభ్యంతరకర వ్యాఖ్యలు 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు