జ న వా ణి

17 Nov, 2023 01:40 IST|Sakshi

జగనన్న దయతో

సొంత ఇల్లు వచ్చింది

నేను వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. ఇప్పటి వరకూ సొంత ఇల్లు లేదు. ఈ పరిస్థితుల్లో ఇల్లు కావాలని సచివాలయంలో దరఖాస్తు చేసుకున్నాను. వారు వచ్చి పరిశీలించి అర్హుడిని కావడంతో ఇల్లు మంజూరు చేశారు. ఉచితంగా ఇసుక, సిమెంటు, ఇనుము ఇచ్చారు. త్వరలో ఇంటి నిర్మాణం పూర్తవుతుంది. నాకల నెరవేరింది. జగనన్నకు ధన్యవాదాలు.

– కొలగట్ల సోమశేఖర్‌రెడ్డి, తర్లుపాడు

సొంతింటి కల నెరవేరింది

ఇళ్లు లేక అవస్థలు పడుతున్న నాలాంటి నిరుపేదలకు సొంతింటి కల సాకారమైంది. ప్రభుత్వం ఇంటి పట్టా మంజూరు చేసింది. ఇల్లు నిర్మాణంలో ఉంది. ఇప్పటి వరకు స్లాబ్‌ పూర్తి చేశాను. ఇంటి నిర్మాణం అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి కంతుల వారిగా బిల్లులు మంజూరు చేస్తున్నారు. సొంతి ఇంటి కల నేరవేరడంతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మా కుటుంబ సభ్యులు రుణపడి ఉంటాం.

– సొంటి సుభాషిణి, తోకపల్లి,

పెద్దారవీడు మండలం

పై చదువులకు ఉపయోగపడుతుంది

జగనన్న సురక్ష క్యాంపులో కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నాను. వలంటీరు ఇంటికి వచ్చి అవసరమైన పత్రాలు తీసుకుని దరఖాస్తు పరిశీలించి వెంటనే ధ్రువపత్రం మంజూరు చేశారు. నేను పదో తరగతి చదివా. గతంలో ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాల కోసం కార్యాలయాల చుట్టూ నెలల తరబడి తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు సులభంగా సర్టిఫికెట్లు పొందాం. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు.

– మేడికొండ సతీష్‌, ప్రకాశం జిల్లా

టంగుటూరు మండలం, కాకుటూరివారిపాలెం

పేదల దేవుడు జగన్‌!

నాకు తల్లిదండ్రులు, భర్త, పిల్లలు, బంధువులు ఎవరూ లేరు. బతకడానికి సెంటు భూమి కూడా లేదు. రోజు వారి కూలి పనుల పోవడానికి ఆరోగ్యం సహకరించడంలేదు. ప్రభుత్వం ఇచ్చే పింఛన్‌తోనే బతుకుతున్నాను. ఒంట్లో బాగులేకపోయినా ఆస్పత్రికి పోవడానికి స్థోమత లేక ఇంట్లోనే ఉంటున్నాను. ఇలాంటి తరుణంలో ఆరోగ్య సిబ్బంది, వలంటీరు ఇంటికి వచ్చి సచివాలయం దగ్గర హెల్త్‌ క్యాంప్‌ పెడుతున్నారని చెప్పారు. వెంటనే నాకు ఉన్న సమస్యలు చెప్పాను. సిబ్బంది వివరాలు నమోదు చేసుకోని టోకెన్‌ ఇచ్చారు. సచివాలయంలో నిర్వహించిన క్యాంప్‌లో డాక్టర్లు ఆరోగ్య పరీక్షలు చేసి అవసరమైన మందులు ఇచ్చారు. ఇంటి వద్దకే పెద్ద డాక్టర్లు వచ్చి మాలాంటి పేద వారిని చూడటం గొప్పవిషయం. అందుకే జగన్‌ పేదల దేవుడు అయ్యాడు. మాలాంటి పేదల తరఫున జగన్‌కి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. – కొమ్మసాని కొండమ్మ,

పొదిలి మండలం మల్లవరం పంచాయతీలోని కొస్టాలపల్లి

మరిన్ని వార్తలు