సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకం

9 Nov, 2023 00:26 IST|Sakshi
మాట్లాడుతున్న కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి
● కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

సిరిసిల్ల: సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకమని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్‌ జయంతి పే ర్కొన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం ఎన్నికల విధులు, బాధ్యతలపై 123 మంది సూక్ష్మ పరిశీలకులకు శిక్షణనిచ్చారు. కలెక్టర్‌ మాట్లాడుతూ గుర్తించిన పోలింగ్‌ కేంద్రాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని తెలిపారు. ఎన్నికల సంఘం నియమావళిని అతిక్రమిస్తున్నారా అనే అంశాలను పరిశీలించాలని సూచించారు. మాక్‌పోల్‌ నిర్వహణ, ఓటర్ల గుర్తింపు ఓటర్‌కార్డు లేదా ఎన్నికల సంఘం నిర్ధేశించిన కార్డుల ప్రకారం కొనసాగుతుందా.. లేదా.. పరిశీ లించాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే ఉన్నతాధికారుల దృష్టికి, సాధారణ పరిశీలకుల దృష్టికి తేవా లన్నారు. సూక్ష్మ పరిశీలకుల నివేదికల ఆధారంగానే కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాలు ఆధారపడి ఉంటాయని తెలిపారు. ఎన్నికల శిక్షణ నోడల్‌ అధికారి పీబీ శ్రీనివాసాచారి, మాస్టర్‌ ట్రైనర్‌ పాల్గొన్నారు.

కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేయాలి

ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు ఓట్ల లెక్కింపు కేంద్రాలలో చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్‌ జయంతి సూచించారు. పోలింగ్‌కు కౌంటింగ్‌కు మధ్య సమయం తక్కువగా ఉన్నందున ఇప్పటి నుంచే ఏర్పాట్లను చేయాలన్నారు. తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సిరిసిల్ల, వేములవాడ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ కేంద్రాలను అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌తో కలిసి పరిశీలించారు. కౌంటింగ్‌ కేంద్రం లే–అవుట్‌ సిద్ధం చేయడం, కమ్యూనికేషన్‌ ప్లాన్‌, కౌంటింగ్‌ కేంద్రాల్లోకి అనుమతించడానికి గల నిబంధనలు, కౌంటింగ్‌ ఏజెంట్ల నియామక నిబంధనలను, అబ్జర్వర్‌లకు సంబంధించి చేసుకోవాల్సిన ఏర్పాట్లు, పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌ ఎలా చేయాలి, ఆర్వోల బాధ్యతలు, మీడి యా సెంటర్‌ ఏర్పాట్లు, స్ట్రాంగ్‌రూమ్‌ ఏర్పాట్లు, భద్రత చర్యలు, వీడియోగ్రఫీ, ఫైర్‌సేఫ్టీ చర్యలపై వివరించారు. కౌంటింగ్‌హాల్‌కు ఎంట్రీ, ఎగ్జిట్‌ ఉండాలని, రెండు వైపులా గార్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యుత్‌, ఇంటర్నెట్‌ సౌకర్యం, మీడియా కవరేజీ చేయాల్సిన విధానంపై కలెక్టర్‌ దిశానిర్ధేశం చేశారు. పంచాయతీరాజ్‌ ఈఈ సూర్యప్రకాశ్‌, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ అధికారి శ్రీని వాస్‌, డీడబ్ల్యూవో లక్ష్మీరాజం, డీపీఆర్వో దశరథం, సిరిసిల్ల, వేములవాడ తహశీల్దార్‌లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు