మల్లన్నా.. ఏదీ రక్షణ?

13 Sep, 2023 08:17 IST|Sakshi
ధ్వంసం అయిన సిస్టం యూనిట్‌

కొయురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో సీసీ కెమరాలకు సంబంధించిన సిస్టం(ఎన్‌వీఆర్‌) ధ్వంసమైంది. దీంతో దేవాలయంలోని 32 కెమెరాలు పని చేయడం లేదు. గుడి పరిసరాలలో పనిచేసే సీసీ కెమెరాల సిస్టం యూనిట్‌ను ఏఈవో గదిలో అమర్చారు. ప్రస్తుతం దీనిని పగులకొట్టడంతో సీసీ కెమెరాలు పని చేయక నిత్యం స్వామివారి దర్శనానికి వచ్చే వేలాది మంది భక్తులకు రక్షణ కరువైంది.

ఎవరో కావాలనే ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేసినట్లుందని టెక్నీషియన్‌ చెబుతున్నాడు. దీంతో ఆలయంలో సిబ్బందిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వారం క్రితం ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల గొడవ గురించి సీసీ ఫుటేజీ తీసుకుందామని మంగళవారం టెక్నీషియన్‌ను పిలిపించగా ఎన్‌వీఆర్‌ ధ్వంసమైన విషయం తెలిసింది. ఆలయ చైర్మన్‌ గీస భిక్షపతి వెంటనే విలేకరుల సమావేశం నిర్వహించి ఉద్యోగులే సీసీ కెమెరాల సిస్టం యూనిట్‌ను ధ్వంసం చేశారని ఆరోపించారు. కొద్దిరోజులుగా ఈయనకు, ఏఈఓ అంజయ్య మధ్య విభేదాలు తలెత్తడంతో ఆలయంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియకుండా ఉంది.

మరిన్ని వార్తలు