దొరల రాజ్యాన్ని తరిమికొడదాం | Sakshi
Sakshi News home page

దొరల రాజ్యాన్ని తరిమికొడదాం

Published Tue, Nov 7 2023 5:24 AM

- - Sakshi

పాపన్నపేట(మెదక్‌): పోలింగ్‌ బూత్‌లో టెండర్‌ ఓటు, చాలెంజ్‌ ఓట్ల గురించి మాట్లాడుకుంటుంటే వింటుంటాం. అసలు వీటి గురించి చాలామందికి తెలియదు. ఇప్పుడు వాటి వివరాలు తెలుసుకుందాం. తమ ఓటు గల్లంతయ్యిదని ఫిర్యాదు చేసే వ్యక్తుల కోసం ఎన్నికల సంఘం ’టెండర్‌ ఓటు’ ఏర్పాటు చేసింది. దీని ద్వారా ఓటరు ఓటు వేయవచ్చు. ఎన్నికల సంఘం నిబంధనలలోని సెక్షన్‌ 42 ప్రకారం ’టెండర్‌ ఓటు’ ఏర్పాటు చేశారు. మీరు ఓటు వేయడానికి పోలింగ్‌ స్టేషన్‌కు వెళ్లినప్పుడు.. అప్పటికే మీ ఓటు ఎవరైనా వేస్తే ప్రిసైడింగ్‌ అధికారికి ఫిర్యాదు చేయవచ్చు. అధికారి పరిశీలించి మీ గుర్తింపును ధ్రువీకరిస్తారు. దీని తర్వాత మీరు టెండర్‌ ఓటును డిమాండ్‌ చేయవచ్చు. ఇటువంటి పరిస్థితిలో ఈవీఎం ద్వారా ఓటు వేయలేరు. బ్యాలెట్‌ సాయంతోనే ఓటు వేసేందుకు అవకాశం ఉంటుంది.

చాలెంజ్‌ ఓటు..

ఓటింగ్‌ జరుగుతున్నప్పుడు పోలింగ్‌ స్టేషన్‌లో చాలెంజ్‌ ఓటుకు అవకాశం ఉంటుంది. దీని ద్వారా అక్రమ ఓటర్లను అడ్డుకోవచ్చు. ఎన్నికల ఏజెంట్లు ఈ చాలెంజ్‌ ఓటును ఉపయోగించుకుంటారు. దీని కోసం రూ.2 రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఎవరైనా ఓటరు ఓటు వేయడానికి పోలింగ్‌ స్టేషన్‌కు వచ్చినప్పుడు, అతను నకిలీ ఓటర్‌ అని ఏజెంట్‌ అనుమానించినప్పుడు చాలెంజ్‌ ఓటు ఉపయోగపడుతుంది. పోలింగ్‌ ఏజెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారి ఎదుట చాలెంజ్‌ ఓటు వేస్తాడు. రూ.2 రుసుం కూడా చెల్లిస్తాడు. అప్పుడు ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ ప్రిసైడింగ్‌ అధికారికి అతను సరైన ఓటరు కాదని తెలియజేస్తాడు. దీంతో ప్రిసైడింగ్‌ అధికారి ఓటరు దగ్గరున్న పత్రాలను తనిఖీ చేసి, అవి సరిగా ఉంటే ఓటరుకు ఓటు హక్కు కల్పిస్తారు. ఎన్నికల ఏజెంట్‌ చెప్పినది నిజమని స్పష్టమైతే ఓటరును ఓటు వేయకుండా అడ్డుకుంటారు.

దొరల రాజ్యాన్ని తరిమికొడదాం

దుబ్బాక: దొరల, రెడ్డిల పాలనతో దుబ్బాక అభివృద్ధికి నోచుకోలేదని,

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మసమాజ్‌ పార్టీ అభ్యర్థి వెంకట ప్రసన్నను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ విశారదన్‌ మహారాజ్‌ కోరారు. సోమవారం ఆయన పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..రాష్ట్రంలో అణగారిన కులాలకు రాజ్యాధికారమే లక్ష్యంగా తమ పార్టీ ఎన్నికల్లో ముందుకు సాగుతుందన్నారు. అవినీతి ప్రభుత్వాలకు చరమగీతం పాడాలన్నారు.

1/1

Advertisement
Advertisement