వైరల్‌: బుడ్డోడి డాన్స్‌ చూస్తే నవ్వులే..

4 Oct, 2020 11:22 IST|Sakshi

సాధారణంగా కోకిల కూస్తే.. సరదాగా మనం దానిలాగే పోటీపడి మరీ రాగం అందుకుంటాము. అలాగే కొన్ని జంతువులను వాటి ముందే అనుకరించి ఆటపట్టిస్తూ ఆనందపడతాము. అయితే అవి మన మీదికి రావనే ధీమా కలిగినప్పుడే ఇలాంటి చిలిపి పనులకు పూనుకుంటాము. తాజాగా ఓ బుడ్డోడు చిన్న కుక్కపిల్లను ఆటపట్టించిన ఓ వీడియోను నటి లావణ్య త్రిపాఠి తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ‘ఈ ఉదయం మీ ముఖంపై నవ్వులు పూయిస్తూ.. ప్రకాశవంతం చేయడానికి ఇది చూడండి’ అని కామెంట్‌ జతచేశారు. ఈ వీడియోలో ఉన్న బాలుడు గేట్‌ లోపల ఉన్న కుక్కపిల్లతో ఓ ఆట ఆడుకుంటాడు. వాటి ముందు స్టైల్‌గా డాన్స్‌లు వేస్తాడు. వాటి కళ్లలో కళ్లుపెట్టి చూస్తూ.. తొడగొట్టి మరీ మీరు (కుక్క పిల్లలు) నన్ను ఏం చేయలేరని రెచ్చగొడుతూ.. విభిన్నమైన హావభావాలు వ్యక్తం చేస్తూ నృత్యం చేశాడు.

గేటుకు అవతలివైపు ఉన్న ఆ రెండు కుక్కలు బాలుడిపైకి అరుస్తూ, దునుకుతూ పట్టుకోవడానికి ప్రయత్నించాయి. అది గమనించిన బాలుడు మరింత రెచ్చిపోతూ డాన్స్‌ చేశాడు. ఈ బుడ్డోడి డాన్స్‌ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు బాలుడి చిలిపి చేష్టలకు పడిపడి నవ్వుకుంటున్నారు. అదే విధంగా ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ‘నువ్వు దొరికావో మా చేతిలో అయిపోయావే అని కుక్క పిల్లలు అనుకుంటున్నాయి’ అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశారు. ‘నేనైతే గేటు బయటే ఉన్నా అని బాలుడు డాన్స్‌ ఊపేశాడు’ అని మరో నెటిజన్‌ కామెంట్‌ చేశారు. ‘నేను నవ్వు ఆపుకోలేక పోతున్నా బుడ్డోడా, నువ్వు తెలివైనోడివిరా బుజ్జి’ అని మరో నెటిజన్‌ ఫన్నీగా కామెంట్‌ చేశారు.

Read latest Social-media News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా