IPL2022 Auction: ఆ ఐదుగురు యువ భారత ఆటగాళ్లపై కన్నేసిన ఐపీఎల్ ఫ్రాంచైజీలు

5 Feb, 2022 19:12 IST|Sakshi

5 U19 Players Who Could Be In Demand At IPL 2022 Auction: బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో జరగబోయే ఐపీఎల్ 2022 మెగా వేలంలో భారత అండర్‌-19 జట్టు ఆటగాళ్లపై కనక వర్షం కురవడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీరిలో ముఖ్యంగా ఐదుగురు యంగ్‌ ఇండియా కుర్రాళ్ల కోసం ఫ్రాంచైజీలు ఎగబడతాయని అంచనా వేస్తున్నారు. 

యంగ్‌ ఇండియా నుంచి మొత్తం 9 మంది ఆటగాళ్లు( యశ్‌ ధుల్‌, హర్నూర్‌ సింగ్‌, కుశాల్ తాంబే, అనీశ్వర్‌ గౌతమ్‌, రాజ్ అంగద్‌ భవ, రాజ్‌వర్థన్ హంగార్గేకర్, విక్కీ ఓస్వల్‌, వాసు వత్స్, పుష్పేంద్ర సింగ్‌ రాథోడ్‌) వేలం బరిలో అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా, వీరిలో జట్టు కెప్టెన్‌ యశ్‌ ధుల్‌, ఓపెనర్ హర్నూర్ సింగ్‌, ఆల్‌రౌండర్లు రాజ్ అంగద్‌ భవ, రాజ్‌వర్థన్ హంగార్గేకర్, స్పిన్‌ బౌలర్‌ విక్కీ ఓస్వల్‌ రికార్డు ధర పలకడం ఖాయమని గెస్‌ చేస్తున్నారు. 

వేలంలో షార్ట్‌ లిస్ట్‌ అయిన యంగ్‌ ఇండియా ఆటగాళ్లలో రాజవర్థన్ హంగార్గేకర్(30 లక్షలు) మినహా మిగిలిన 8 మంది రూ.20 లక్షల బేస్ ప్రైజ్ విభాగంలో పోటీపడనున్నారు. కాగా, కరీబియన్‌ దీవులు వేదికగా ప్రస్తుతం జరుగుతున్న అండర్‌-19 వన్డే ప్రపంచకప్‌ 2022లో యువ భారత ఆటగాళ్లు అదిరిపోయే రేంజ్‌లో రాణిస్తూ.. జట్టును ఎనిమిదోసారి ప్రపంచకప్‌ టైటిల్‌ రేసులో నిలబెట్టారు. ఈ క్రమంలో ఇవాళ ఇంగ్లండ్‌తో జరుగుతున్న టైటిల్‌ పోరులో అమీతుమీ తేల్చుకోనున్నారు.  

ఇదిలా ఉంటే, ఐపీఎల్‌ 2022 మెగా వేలం బరిలో మొత్తం 1214 మంది క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకోగా, అందులో 590 మంది పేర్లు షార్ట్‌ లిస్ట్‌ అయ్యాయి. ఇందులో 228 మంది క్యాప్డ్‌ ప్లేయర్లు కాగా... 355 మంది అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లు, ఏడుగురు అసోసియేట్‌ దేశాలకు చెందిన వారు ఉన్నారు. అఫ్గనిస్తాన్‌ నుంచి 17, ఆస్ట్రేలియా నుంచి 47, బంగ్లాదేశ్‌ నుంచి 5, ఇంగ్లండ్‌ నుంచి 24, ఐర్లాండ్‌ నుంచి 5, న్యూజిలాండ్‌ నుంచి 24, దక్షిణాఫ్రికా నుంచి 33, శ్రీలంక నుంచి 23, వెస్టిండీస్‌ నుంచి 34, జింబాబ్వే నుంచి ఒకరు, నమీబియా నుంచి ముగ్గురు, నేపాల్‌ నుంచి ఒకరు, స్కాట్లాండ్‌ నుంచి ఇద్దరు, అమెరికా నుంచి ఒకరు వేలంలో పాల్గొననున్నారు. 
చదవండి: IND Vs WI: ఓపెనర్‌గా పంత్‌.. మిడిలార్డర్‌లో కేఎల్‌ రాహుల్‌..!

>
మరిన్ని వార్తలు