కోహ్లి.. ఆ తప్పిదాలు ఎందుకు చేశావ్‌?

26 Sep, 2020 16:53 IST|Sakshi

న్యూఢిల్లీ: ఐపీఎల్‌-13లో సీజన్‌లో కింగ్స్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ పూర్తిగా చేతులెత్తేసింది. టాపార్డర్‌, మిడిల్‌ ఆర్డర్‌ మొత్తం విఫలం కావడంతో ఆర్సీబీ 97 పరుగుల తేడాతో చిత్తయ్యింది. కోహ్లి అండ్‌ గ్యాంగ్‌ 17 ఓవర్లలో 109 పరుగులకే పరిమితమై ఘోర ఓటమిని చవిచూసింది. 69 బంతుల్లో  14 ఫోర్లు, 7 సిక్స్‌లతో 132 పరుగులతో అజేయంగా నిలిచి కింగ్స్‌ పంజాబ్‌ స్కోరు రెండొందలు దాటించి ఘన విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీనిపై టీమిండియా మాజీ పేసర్‌ అజిత్‌ అగార్కర్‌ మాట్లాడుతూ.. కోహ్లి చేసిన ఆ రెండు ప్రధాన తప్పిదాలతోనే కింగ్స్‌ పంజాబ్‌ విజయం సాధించిందన్నాడు. (చదవండి:సీఎస్‌కేపై సెహ్వాగ్‌ సెటైర్లు)

‘ శివం దూబే అప్పటివరకు కొన్ని మంచి ఓవర్లు వేశాడు. పెద్దగా అనుభవం లేని బౌలర్‌కు చివరి ఓవర్‌ ఎలా ఇస్తావ్‌. అప్పటికే క్రీజ్‌లో ఒక సెట్‌ బ్యాట్స్‌మన్‌ ఉండి, అతను సెంచరీ సాధించినప్పుడు ప్రధాన బౌలర్‌కు బౌలింగ్‌ వేయించాలి. టీ20 క్రికెట్‌లో చివరి ఓవర్‌ అనేది చాలా కీలకం. ఈ ఫార్మాట్‌లో ఎప్పుడూ కూడా ఆఖరి ఓవరే విజయంపై ప్రభావం చూపుతూ ఉంటుంది. ఇది కోహ్లి చేసిన తొలి తప్పింది. ఇక బ్యాటింగ్‌ విషయంలో కోహ్లి ఎప్పుడూ మూడో స్థానం కంటే కింద వరుసలో బ్యాటింగ్‌ ఎప్పుడూ రావు. మరి అటువంటిది కింగ్స్‌ పంజాబ్‌ మ్యాచ్‌లో నాల్గో స్థానంలో బ్యాటింగ్‌కు ఎందుకు?, మూడో స్థానంలో బ్యాటింగ్‌కు ఎందుకు రానట్లు. అరోన్‌ ఫించ్‌ ఓపెనింగ్‌ ఉన్న కారణంగా ఓపెనింగ్‌ రావడం లేదు. అంతవరకూ ఓకే. మరి మూడో స్థానాన్ని వదిలి పెట్టి, నాల్గో స్థానంలో బ్యాటింగ్‌ రావడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ మ్యాచ్‌లో నాల్గో స్థానంలో కోహ్లి బ్యాటింగ్‌కు రావడం సరైన నిర్ణయం కాదు’ అని అగార్కర్‌ తెలిపాడు. 

Poll
Loading...
Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు