SA Vs IND: భారత ఆటగాళ్లకు ద్రవిడ్‌ స్పెషల్‌ క్లాస్‌.. ఎందుకో తెలుసా?

25 Dec, 2021 11:34 IST|Sakshi

దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్‌కు టీమిండియా అన్ని అస్త్రాలను సిద్దం చేసుకోంటుంది. డిసెంబర్‌26 న సెంచూరియన్‌ వేదికగా తొలి టెస్ట్‌ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ జట్టు ఆటగాళ్లపై ప్రత్యేక శ్రద్ద కనబరుస్తున్నాడు. అదే విధంగా ఈ మ్యాచ్‌ కోసం ఆటగాళ్లతో ద్రావిడ్‌  వ్యూహాలను రచిస్తోన్నాడు. ప్రాక్టీస్‌ సెషన్‌లో భాగంగా రెండు వైట్‌ బోర్డులను తీసుకువచ్చి ద్రవిడ్‌ ఆటగాళ్లకు స్పెషల్‌ క్లాస్‌ తీసుకున్నాడు.

ఈ క్లాస్‌లో కెప్టెన్‌ కోహ్లితో పాటు జట్టు ఆటగాళ్లంతా పాల్గొన్నారు. ఈ సెషన్‌లో భాగంగా ఆటగాళ్లకు దిశా నిర్ధేశం చేశాడు. ఈ మ్యాచ్‌లో అనుసరించాల్సిన మార్గాలపై ద్రవిడ్‌ ఆటగాళ్లతో చర్చించాడు. కాగా గతంలో కూడా భారత మాజీ హెడ్‌ కోచ్‌ గ్యారీ కిరెస్టన్‌ ఇటువంటి సెషన్స్‌ తీసుకునేవాడు. అయితే భారత జట్టు ఇప్పటివరకు సఫారీ గడ్డపై ఒక్క టెస్ట్‌ సిరీస్‌ కూడా గెలవ లేదు. దీంతో ఈ సిరీస్‌పై కోచ్‌ ద్రవిడ్‌తో పాటు, కెప్టెన్‌ కోహ్లి ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారు. 

భారత జట్టు(అంచనా): మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్‌), అజింక్యా రహానే, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్‌), రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

చదవండిIND vs SA Test Series: టీమిండియా అదరగొడుతోంది.. కానీ ఇక్కడ మాదే పైచేయి: ప్రొటిస్‌ కెప్టెన్‌

మరిన్ని వార్తలు