జమ్మికుంట క్రీడాకారుడికి బంగారు పతకం 

27 Nov, 2021 14:19 IST|Sakshi

ఆసియా యూత్‌ స్పోర్ట్స్‌ చాంపియన్‌షిప్‌ 2021

జాతీయ స్థాయిలో కరీంనగర్‌కు ఖ్యాతి

Asia Youth Sports CHampionship 2021: Jammikunta Prashanth Wins Gold: జమ్మికుంట పట్టణంలోని కేశవపూర్‌ గ్రామానికి చెందిన పాతకాల ప్రశాంత్‌ అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటాడు. హైదరాబాద్‌ నాంపల్లి పోలీసుస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రశాంత్‌ నేపాల్‌లోని పోక్రాలో నవంబర్‌ 22 నుంచి 25 వరకు నిర్వహించిన ఆసియా యూత్‌ స్పోర్ట్స్‌ చాంపియన్‌షిప్‌ 2021లో పాల్గొన్నాడు.

3000 మీటర్ల రన్నింగ్‌లో సీనియర్‌ కేటగిరిలో బంగారు పతకం సాధించాడు. జాతీయ స్థాయిలో కరీంనగర్‌ జిల్లా, జమ్మికుంట పట్టణానికి ఖ్యాతి తీ సుకువచ్చాడని ప్రశాంత్‌ను జమ్మికుంట పోలీసులు, ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల అధికారులు, కేశవపూర్‌ గ్రామస్తులు అభినందించారు. 

చదవండి: Krunal Pandya: కృనాల్‌ పాండ్యా కీలక నిర్ణయం... తప్పుకొంటున్నా.. అయితే..

మరిన్ని వార్తలు