SL vs AUS: శ్రీలంకతో తొలి వన్డే.. తుది జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా

13 Jun, 2022 19:01 IST|Sakshi

శ్రీలంకతో జరగనున్న తొలి వన్డేకు ఆస్ట్రేలియా తమ తుది జట్టును ప్రకటించింది.  ఆ జట్టు స్టార్‌ ఆటగాళ్లు మిచెల్‌ స్టార్క్‌, కేన్‌ రిచర్డ్‌సన్, మిచెల్‌ మార్ష్‌ గాయం కారణంగా తొలి వన్డేకు దూరమయ్యారు. ఇక టీ20 సిరీస్‌కు దూరమైన స్టార్‌ పేసర్‌ పాట్‌ కమ్మిన్స్‌ తిరిగి జట్టులోకి వచ్చాడు.

ఇక పల్లెకెలె వేదికగా జూన్‌14న ఇరు జట్లు మధ్య తొలి వన్డే జరగనుంది. కాగా శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-0తో ఆస్ట్రేలియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా పల్లెకెలె వేదికగా జరిగిన అఖరి టీ20లో ఆసీస్‌ ఆనూహ్యంగా ఓటమి చెందింది. అఖరి మూడు ఓవర్లలో 59 పరుగులను ఛేజ్‌ చేసి శ్రీలంక సంచలన విజయం నమోదు చేసింది.

శ్రీలంకతో తొలి వన్డేకి ఆస్ట్రేలియా తుది జట్టు(SL Vs AUS: Australia Playing XI For 1st Odi): ఆరోన్ ఫించ్ (సి), డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మార్నస్ లాబుస్‌చాగ్నే, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్, అలెక్స్ కారీ, అష్టన్ అగర్, పాట్ కమిన్స్, జో రిచర్డ్‌సన్, జోష్ హేజిల్‌వుడ్.
చదవండి: IND vs SA: జట్టులో అతడు తప్ప వికెట్లు తీసే బౌలర్లు లేరు: సునీల్ గావస్కర్

మరిన్ని వార్తలు