టీమిండియాకు మ‌రో బిగ్ షాక్‌..

20 Jan, 2022 12:39 IST|Sakshi

యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్‌ను స్వదేశంలో 4-0 తేడాతో చిత్తు చేసిన ఆస్ట్రేలియా టెస్టుల్లో నంబర్‌వన్‌గా అవతరించింది. గురువారం విడుదల చేసిన ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా 119 పాయింట్లతో తొలిస్థానంలో ఉండగా.. 117 పాయింట్లతో న్యూజిలాండ్ రెండ‌వ స్థానంలో ఉంది.  కాగా, దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో కోల్పోయిన భారత్ 116 పాయింట్ల‌తో మూడో స్థానానికి పడిపోయింది. నాలుగో స్ధానంలో ఇంగ్లండ్ నిలిచింది. ఇక భార‌త్‌పై టెస్ట్ సిరీస్ గెలిచిన ప్రోటీస్ ఐదో స్థానానికి ఎగబాకగా, పాకిస్థాన్ ఆరో స్థానానికి దిగజారింది.

ఇక ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2021-23 సీజన్‌లో భాగంగా ఆసీస్ పాకిస్తాన్‌లో మూడు మ్యాచ్‌ల సిరీస్ కోసం ప‌ర్య‌టించ‌నుంది. కాగా 1998 తర్వాత ఆసీస్ జట్టు పాకిస్థాన్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. మరోవైపు స్వదేశంలో శ్రీలంకతో భారత్ రెండు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఇక‌ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ విషయానికి వస్తే.. టీమిండియా ఇప్పటివరకు 10 మ్యాచ్‌ల్లో 49.07 విజయ శాతంతో నాలుగు విజయాలు, మూడు ఓటములు, రెండు డ్రాలతో ఐదవ ర్యాంక్‌లో కోన‌సాగుతోంది. మరోవైపు, ఆస్ట్రేలియా ఐదు మ్యాచ్‌లలో 86.66 విజయ శాతంతో నాలుగు విజయాలు, ఒక డ్రాతో రెండో స్థానంలో ఉంది.

చ‌ద‌వండి: IND vs SA: ఎనిమిదేళ్ల త‌ర్వాత‌ బౌలింగ్‌లో చెత్త రికార్డు.. బ్యాటింగ్‌లో అదుర్స్‌

మరిన్ని వార్తలు