#CSKVsGTQualifier-1: ఒక ప్లేఆఫ్‌.. 84 డాట్‌ బాల్స్‌.. 42వేల మొక్కలు

24 May, 2023 18:40 IST|Sakshi
Photo: IPL Twitter

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌ల సందర్భంగా బీసీసీఐ, ఐపీఎల్‌ ప్రధాన స్పాన్సర్‌ టాటా కలిసి ఒక వినూత్న కార్యక్రమానికి తెరతీశాయి. Green Campaign పేరిట ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌ల్లో ప్రతీ డాట్‌ బాల్‌కు 500 మొక్కలు నాటాలని  నిర్ణయించాయి.

అందుకే మంగళవారం సీఎస్‌కే, గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య జరిగిన క్వాలిఫయర్‌-1 పోరులో బౌలర్‌ పరుగు ఇవ్వకుండా ‘డాట్‌ బాల్‌’ వేసిన సమయంలో టీవీ స్కోరు బోర్డులో సున్నాకు బదులుగా ఒక పచ్చని మొక్క చూపిస్తూ వచ్చారు. కాగా మ్యాచ్‌లో మొత్తం 84 డాట్‌బాల్స్‌ నమోదవ్వగా.. అందులో సీఎస్‌కే ఇన్నింగ్స్‌లో 34.. మిగతా 50 డాట్‌బాల్స్‌ గుజరాత్‌ టైటాన్స్‌ ఇన్నింగ్స్‌లో వచ్చాయి.

ప్రతీడాట్‌ బాల్‌కు 500 మొక్కలు చొప్పున 84 డాట్‌బాల్స్‌కు 42వేల మొక్కలు నాటనున్నట్లు బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జై షా స్వయంగా తన ట్విటర్‌లో పేర్కొన్నారు. ఇక ఈ మొక్కల కాన్సెప్ట్‌ మిగతా మూడు ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌లకూ(ఫైనల్‌తో కలిపి) వర్తించనుంది. దీంతో ప్లేఆఫ్‌ మ్యాచ్‌లు ముగిసేలోపే లక్షల్లో మొక్కల సంఖ్య ఉండనుంది. బీసీసీఐ, టాటా కలిపి చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమానికి  ప్రశంసలతో పాటు అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తోంది.

చదవండి: డాట్‌ బాల్‌ స్థానంలో చెట్టు గుర్తు?.. బీసీసీఐ మాస్టర్‌ ప్లాన్‌

పాపం చివరకు వికెట్‌ కీపర్‌ బకరా అయ్యాడు!

>
మరిన్ని వార్తలు