పాపం: ఒక్క మ్యాచ్‌ ఆడకుండానే స్వదేశానికి వోక్స్‌

28 Feb, 2021 13:38 IST|Sakshi

ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) రొటేషన్‌ పాలసీలో భాగంగా భారత పర్యటన నుంచి మరో ఇంగ్లండ్‌ ప్లేయర్‌ స్వదేశానికి వెళ్లిపోయాడు. దక్షిణాఫ్రికా, శ్రీలంక, భారత్‌తో సిరీస్‌లకు 31 ఏళ్ల ఆల్‌రౌండర్‌ క్రిస్‌ వోక్స్‌ ఎంపికయ్యాడు. అయితే ఈ మూడు సిరీస్‌లలో వోక్స్‌కు ఒక్క మ్యాచ్‌లోనూ ఆడే అవకాశం రాలేదు. గతేడాది సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాతో చివరిసారి వన్డే మ్యాచ్‌లో వోక్స్‌ బరిలోకి దిగాడు. రొటేషన్‌ పాలసీలో భాగంగా ఇప్పటికే ఇంగ్లండ్‌ ఆటగాళ్లు జోస్‌ బట్లర్, మొయిన్‌ అలీ స్వదేశానికి వెళ్లిపోయారు.
(చదవండి: ‘పిచ్‌ ఎలా ఉండాలో ఎవరు చెప్పాలి’)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు