ఇదేం ఫీల్డింగ్‌రా బాబు.. ఒట్టి పుణ్యానికి నాలుగు పరుగులు

9 Sep, 2021 08:14 IST|Sakshi

జమైకా: కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(సీపీఎల్‌ 2021)లో ఉ‍త్కంఠభరితమైన మ్యాచ్‌లతో పాటు ఫన్నీ ఘటనలు చాలానే చోటుచేసుకుంటున్నాయి. ''క్యాచెస్‌ విన్‌ మ్యాచెస్‌'' అనే పాత నానుడి ఇప్పుడు అక్షరాల నిజమైంది. ఫీల్డర్‌ చేసిన తప్పు ప్రత్యర్థి జట్టుకు ఒట్టి పుణ్యానికి నాలుగు పరుగుల వచ్చేలా చేశాయి. అయితే మిస్‌ఫీల్డ్‌తో బౌండరీ దాటిందనుకుంటే పొరపాటే.. కేవలం ఫీల్డర్ల వైఫల్యంతో ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ నాలుగు పరుగులు రాబట్టారు.

చదవండి: BAN VS NZ: చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్‌.. కివీస్‌పై తొలిసారి..

ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌, జమైకా తలైవాస్‌ మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఇది జరిగింది. ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ బ్యాటింగ్‌ సమయంలో ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్‌ నాలుగో బంతిని ప్రిటోరియస్‌ పొలార్డ్‌కు వేశాడు. పొలార్డ్‌ లాంగాన్‌ దిశగా భారీ షాట్‌ ఆడగా.. అక్కడే ఉన్న ఫీల్డర్‌ క్యాచ్‌ను మిస్‌ చేశాడు. కనీసం రనౌట్‌ అయ్యే అవకాశం ఉందోమోనని అందుకొని ప్రిటోరియస్‌ వైపు బంతిని త్రో విసిరాడు. అయితే ప్రిటోరియస్‌ బంతిని అందుకోలేకపోయాడు. అప్పటికే రెండు పరుగులు పూర్తి చేసిన పొలార్డ్‌- స్టీఫర్ట్‌ జంట మరోసారి పరిగెత్తారు. ఈసారి ప్రిటోరియస్‌ వేసిన బంతి మరోసారి వికెట్లకు దూరంగా వెళ్లడంతో పొలార్డ్‌ జంట మరోసారి పరుగుపెట్టారు. మొత్తానికి ఫీల్డర్ల పుణ్యానా నాలుగు పరుగులు వచ్చేశాయి. ఓవరాల్‌గా ఆ ఓవర్‌ మొత్తంలో 28 పరుగులు పిండుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌గా మారింది.

ఇక ఈ మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్‌ చేసిన ట్రిన్‌బాగో 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన జమైకా తలైవాస్‌ 18.2 ఓవర్లలో 92 పరుగులకే ఆలౌటైంది.

చదవండి: అరంగేట్ర మ్యాచ్‌లోనే నాలుగు వికెట్లు.. ఎవరు ఆ బౌలర్‌?

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు