CWC 2023 AUS VS SA 2nd Semis: అభిమానులకు బ్యాడ్‌న్యూస్‌

16 Nov, 2023 13:07 IST|Sakshi

వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా ఇవాళ (నవంబర్‌ 16) జరగాల్సిన రెండో సెమీఫైనల్‌ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందని తెలుస్తుంది. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతానికి ఈడెన్‌ గార్డెన్స్‌లో వర్షం పడనప్పటికీ.. స్టేడియం మొత్తాన్ని కవర్లతో కప్పేశారు.

ఈ మ్యాచ్‌కు రిజర్వ్‌ డే కూడా ఉంది కాబట్టి, మ్యాచ్‌ ఇవాళ రద్దైనా రేపు జరుగుతుంది. వాతవరణం అప్‌డేట్‌ తెలిసి క్రికెట్‌ అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఆస్ట్రేలియా అభిమానులు మరింత కలవరపడుతున్నారు. ఒకవేళ ఏ కారణంగా అయినా మ్యాచ్‌ రద్దైతే మెరుగైన రన్‌రేట్‌ ఉన్న కారణంగా సౌతాఫ్రికా ఫైనల్స్‌కు చేరుకుంటుంది. మ్యాచ్‌కు వరుణుడు అడ్డుతగలకూడదని ఆసీస్‌ అభిమానులు కోరుకుంటున్నారు.

కాగా, న్యూజిలాండ్‌తో నిన్న జరిగిన తొలి సెమీఫైనల్లో భారత్‌ 70 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కోహ్లి (113 బంతుల్లో 117; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), శ్రేయస్‌ (70 బంతుల్లో 105; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) అద్బుత శతకాలతో పాటు మొహమ్మద్‌ షమీ (9.5-0-57-7) సూపర్‌ బౌలింగ్‌తో మెరవడంతో భారత్‌ తిరుగలేని విజయం సాధించి, నాలుగోసారి ఫైనల్స్‌కు చేరింది. 

మరిన్ని వార్తలు