Angelo Mathews Timed Out: ప్రపంచ క్రికెట్‌కు చీకటి రోజు.. షకీబ్‌ కంటే అతడు వెయ్యి రెట్లు నయం​..!

7 Nov, 2023 09:03 IST|Sakshi

వన్డే ప్రపంచకప్‌ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఆటగాడు ఏంజెలో మాథ్యూస్‌ నిర్ణీత సమయం (2 నిమిషాలు) కంటే నిమిషం ఆలస్యంగా బ్యాటింగ్‌ చేసేందుకు వచ్చి టైమ్‌ ఔట్‌గా వెనుదిరిగిన విషయం తెలిసిందే. ఈ విషయంలో బంగ్లా కెప్టెన్‌ షకీబ్‌ క్రీడాస్పూర్తి విరుద్దంగా వ్యవహరించి అందరి చీత్కారాలకు గురవుతున్నాడు.

మాథ్యూస్‌ ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేయనప్పటికీ షకీబ్‌ కనీస క్రీడా ధర్మాన్ని మరిచి ప్రవర్తించడం క్రికెట్‌ అభిమానులను విస్మయానికి గురి చేస్తుంది. నెటిజన్లు సోషల్‌మీడియామ వేదికగా షకీబ్‌ను ఏకి పారేస్తున్నారు.

మ్యాచ్‌ అనంతరం ఈ విషయంపై మాథ్యూస్‌ స్వయంగా స్పందించాడు. షకీబ్‌ ప్రవర్తించిన తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. బంగ్లాదేశ్ కాబట్టి అలా జరిగింది, మరే ఇతర జట్టు ఇలా స్పందిస్తుందని అనుకోను అంటూ కామెంట్స్‌ చేశాడు. మాథ్యూస్‌ను టైమ్‌ ఔట్‌గా ప్రకటించడంపై ప్రముఖ అంపైర్‌ రిచర్డ్‌ కెటిల్‌బొరో కూడా స్పందించాడు.

ప్రపంచ క్రికెట్‌కు ఇది చీకటి రోజు. ఇలాంటి ఘటన ప్రపంచకప్‌లో జరగడం విచారకరం అంటూ ట్వీట్‌ చేశాడు. ఇందుకు ఓ వీడియోను జోడిస్తూ.. క్రీడాస్పూర్తిని చాటుకోవడంలో నేపాల్‌కు చెందిన ఆసిఫ్‌ షేక్‌ షకీబ్‌ కంటే వెయ్యి రెట్లు నయమని కామెంట్‌ జోడించాడు. కాగా, నిన్నటి మ్యాచ్‌లో శ్రీలంకపై బంగ్లాదేశ్‌ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. 

చదవండి: బంగ్లాదేశ్‌ అప్పీలు.. మాథ్యూస్‌ అవుట్‌! అంతర్జాతీయ క్రికెట్‌ చరిత్రలోనే తొలిసారి!

మరిన్ని వార్తలు