-
అభిమాని పట్ల షకీబ్ దురుస ప్రవర్తన.. వీడియో వైరల్
షకీబ్ అల్ హసన్.. ఈ పేరు గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరల్డ్ క్రికెట్ సమకాలీన క్రికెట్లో అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకడిగా కొనసాగతున్న షకీబ్.. నిత్యం వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తుంటాడు. ఈ బంగ్లా స్టార్ ఆల్‌రౌండర్ మరోసారి తన దురుసు ప్రవర్తన కారణంగా వార్తల్లో నిలిచాడు. జింబాబ్వేతో జరుగుతున్న టీ20 సిరీస్‌కు దూరంగా ఉంటున్న షకీబ్.. ప్రస్తుతం దేశవాళీ టోర్నమెంట్లో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో మ్యాచ్ ఆరంభానికి ముందు షకీబ్ మైదానంలో ఉండగా.. గ్రౌండ్ స్టాప్ ఒకరు అతడి దగ్గరకు వచ్చి సెల్పీ అడిగాడు.దానికే చిరెత్తుకుపోయిన షకీబ్ అతడిని కొట్టే ప్రయత్నం చేశాడు. దీంతో ఒక్కసారిగా ఆ గ్రౌండ్స్‌మన్ బాధపడుతూ పక్కకు వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు షకీబ్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మరి అంత పొగరు పనికిరాదంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతుకుముందు చాలా సందర్భాల్లో అభిమానులపై షకీబ్ చేయిచేసుకున్నాడు కూడా. Shakib… when a groundsman tried tontake a selfie with him 🤨 pic.twitter.com/BWbDX4LAsK— Nibraz Ramzan (@nibraz88cricket) May 7, 2024 -
బంగ్లాదేశ్ జట్టులో షకీబ్ పునరాగమనం
రాజకీయ నాయకుడిగా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించాక బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ జాతీయ జట్టులోకి పునరాగమనం చేశాడు. శ్రీలంక జట్టుతో చట్టోగ్రామ్‌లో శనివారం మొదలయ్యే రెండో టెస్టులో షకీబ్ ఆడనున్నాడు. గత ఏడాది భారత్ ఆతిథ్యమిచ్చిన వన్డే వరల్డ్‌కప్ మధ్యలో షకీబ్ గాయంతో వైదొలిగాడు. ఈ ఏడాది జనవరిలో జరిగిన బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో 37 ఏళ్ల షకీబ్ అవామీ లీగ్ పార్టీ తరఫున మగురా నియోజకవర్గం నుంచి పోటీచేసి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. -
ఐసీసీ అగ్రపీఠంపై కొత్త ఆటగాడు.. ఐదేళ్ల తర్వాత..!
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు మొహమ్మద్ నబీ అగ్రస్థానానికి ఎగబాకాడు. ఈ స్థానంలో దాదాపు ఐదేళ్ల పాటు కొనసాగిన బంగ్లా ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ రెండో స్థానానికి పడిపోయాడు. గాయం కారణంగా షకీబ్ వన్డేలకు దూరంగా ఉండటం.. ఈ మధ్యలో నబీ సత్తా చాటడంతో వీరిద్దరి ర్యాంక్‌లు తారుమారయ్యాయి. ఇటీవల శ్రీలంకతో జరిగిన వన్డేలో సెంచరీతో పాటు వికెట్ తీయడంతో నబీ అగ్రపీఠాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ విభాగంలో భారత ఆటగాడు రవీంద్ర జడేజా 10వ స్థానంలో కొనసాగుతున్నాడు. వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఈ విభాగం టాప్-10లో ఎలాంటి మార్పులు జరగలేదు. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన తొలి వన్డేలో డబుల్ సెంచరీతో చెలరేగిన లంక ఆటగాడు పథుమ్ నిస్సంక 10 స్థానాలు మెరుగుపర్చుకుని 18వ స్థానానికి చేరగా.. మూడో వన్డేలో 97 పరుగులతో అజేయంగా నిలిచిన నిస్సంక సహచరుడు అసలంక 5 స్థానాలు ఎగబాకి 15వ స్థానానికి చేరుకున్నాడు. పాక్ ఆటగాడు బాబర్ ఆజమ్ టాప్‌లో కొనసాగుతుండగా.. భారత ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వరుసగా 2, 3, 4 స్థానాల్లో కొనసాగుతున్నారు. బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. కేశవ్ మహారాజ్ టాప్‌లో కొనసాగుతుండగా.. భారత బౌలర్లు సిరాజ్, బుమ్రా, కుల్దీప్ నాలుగు, ఐదు, తొమ్మిది స్థానాల్లో నిలిచారు. టెస్ట్ ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో రెండు సెంచరీలు చేసిన కేన్ విలియమ్సన్ టాప్ ప్లేస్‌ను మరింత పదిలం చేసుకోగా.. భారత ఆటగాళ్లు విరాట్ ఏడులో, పంత్, రోహిత్ శర్మ 12, 13 స్థానాల్లో నిలిచారు. టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఈ విభాగంలో బుమ్రా టాప్‌లో కొనసాగుతుండగా.. అశ్విన్ 3, రవీంద్ర జడేజా తొమ్మిదో స్థానంలో నిలిచారు. సిరాజ్, షమీ 19, 20 స్థానాల్లో కొనసాగుతున్నారు. టెస్ట్ ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఈ విభాగంలో జడేజా, అశ్విన్, అక్షర్ 1, 2, 5 స్థానాల్లో కొనసాగుతున్నారు. టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. భారత ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ టాప్‌లో కొనసాగుతుండగా.. యశస్వి జైస్వాల్ ఆరో ప్లేస్‌లో నిలిచాడు. టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఆదిల్ రషీద్ టాప్‌లో కొనసాగుతుండగా.. భారత బౌలర్లు అక్షర్ పటేల్, రవి భిష్ణోయ్ ఐదు, ఆరు స్థానాల్లో నిలిచారు. -
చరిత్ర సృష్టించిన కివీస్ పేసర్: ప్రపంచంలోనే ఏకైక బౌలర్‌గా రికార్డు
New Zealand vs Pakistan, 1st T20I: న్యూజిలాండ్ వెటరన్ పేసర్ టిమ్ సౌతీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 150 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. తద్వారా క్రికెట్ ప్రపంచంలో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా రికార్డులకెక్కాడు. పాకిస్తాన్‌తో తొలి టీ20 సందర్భంగా సౌతీ ఈ అరుదైన ఫీట్ నమోదు చేశాడు. కాగా ఐదు టీ20లు ఆడేందుకు పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య అక్లాండ్ వేదికగా తొలి మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన షాహిన్ ఆఫ్రిది బృందం న్యూజిలాండ్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో డారిల్ మిచెల్(27 బంతుల్లో 61- నాటౌట్), కెప్టెన్ విలియమ్సన్ (57) అద్భుత అర్ధ శతకాలతో మెరవగా.. కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 226 పరుగులు సాధించింది. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 18 ఓవర్లకే చేతులెత్తేసింది. 180 పరుగులకు ఆలౌట్ అయి 46 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఏకైక బౌలర్‌గా రికార్డు ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో టిమ్ సౌతీ.. మహ్మద్ రిజ్వాన్(25), ఇఫ్తికర్ అహ్మద్(24) రూపంలో రెండు బిగ్ వికెట్లు తీశాడు. అబ్బాస్ ఆఫ్రిదిని అవుట్ చేసిన క్రమంలో.. అంతర్జాతీయ టీ20లలో తన 150వ వికెట్ నమోదు చేశాడు సౌతీ. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఏకైక బౌలర్‌గా నిలిచాడు. ఇక అబ్బాస్ తర్వాత హ్యారిస్ రవూఫ్‌ను పెవిలియన్‌కు పంపిన సౌతీ తొలి టీ20లో న్యూజిలాండ్ విజయాన్ని ఖరారు చేశాడు. నంబర్ 2 ఎవరంటే ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ టీ20లలో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో 35 ఏళ్ల కివీస్ ఫాస్ట్‌బౌలర్ టిమ్ సౌతీ(151) అగ్రస్థానంలో ఉండగా.. 140 వికెట్లతో బంగ్లాదేశ్ స్పిన్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఈ అరుదైన లిస్టులో న్యూజిలాండ్ నుంచి ఇష్ సోధి(127), మిచెల్ సాంట్నర్(105) కూడా చోటు దక్కించుకోవడం విశేషం. చదవండి: Ind vs Afg: అందుకే 19వ ఓవర్లో బంతి అతడి చేతికి: రోహిత్ శర్మ -
అభిమాని చెంప చెల్లుమనిపించిన బంగ్లాదేశ్ కెప్టెన్
బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్, ఆ జట్టు కెప్టెన్ షకీబ్ అల్ హసన్ మరోసారి తన దురుసు ప్రవర్తన కారణంగా వార్తల్లో నిలిచాడు. ఆన్ ద ఫీల్డ్, ఆఫ్ ద ఫీల్డ్ అన్న తేడా లేకుండా తరుచూ గొడవలకు దిగే షకీబ్.. తాజాగా ఓ అభిమాని చెంప చెల్లుమనిపించాడు. ఇటీవలే రాజకీయాల్లోకి దిగి అవామీ లీగ్ అనే పార్టీ తరఫున మగుర 1 నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన షకీబ్.. పోలింగ్ రోజున సొంత అభిమానిపై చేయి చేసుకున్నాడు. Shakib Al Hasan slapped a fan..!pic.twitter.com/KaUbabgkCX — Mufaddal Vohra (@mufaddal_vohra) January 7, 2024 ఓ పోలింగ్ స్టేషన్ సందర్శనకు వెళ్లిన షకీబ్‌ను సదరు అభిమాని వెనక నుంచి నెట్టడంతో సహనం కోల్పోయి కొట్టినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. కాగా, బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో షకీబ్ ఎంపీగా గెలిచాడు. షకీబ్ తన సమీప ప్రత్యర్ధి ఖాజీ రేజౌల్ హొస్సేన్‌పై 1,50,000కు పైగా ఓట్ల తేడాతో గెలిచాడు. ఈ ఎన్నికల్లో షకీబ్ పార్టీ అవామీ లీగ్ మళ్లీ అధికారంలోకి వచ్చినట్లు బంగ్లాదేశ్ మీడియా అంటుంది. అవామీ లీగ్ 300 సీట్లలో 200 పై చిలుకు సీట్లు గెలిచినట్లు అక్కడి మీడియా చెబుతుంది. పూర్తి ఫలితాలు రావాల్సి ఉంది. అవామీ లీగ్ అనే పార్టీ ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రాతినిథ్యం వహిస్తున్న పార్టీ. అవామీ లీగ్ మరో సారి పూర్తి మెజార్టీ సాధించడంతో షేక్ హసీనానే మళ్లీ ప్రధాన పదవి చేపట్టే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, షకీబ్ ఎన్నికల కోసం క్రికెట్ నుంచి తాత్కాలికంగా విరామం తీసుకున్నాడు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement