IPL Retention: వార్నర్‌తో పాటు అతడిని కూడా.. మీకు మీ ఫ్రాంచైజీకు ఓ దండం రా బాబు..

30 Nov, 2021 19:58 IST|Sakshi

David Warner Confirms SRH Has No Intentions Of Keeping Him Ahead Of Retention Day: ఐపీఎల్ 2022 సీజన్‌ మెగా వేలానికి ముందు ఫ్రాంచైజీలు రీటైన్‌ చేసుకునే ఆటగాళ్ల జాబితాను సమర్పించడానికి సమయం ఆసన్నమైంది. ఏ ఆటగాడిని ఏ జట్టు ఉంచుకుంటుందో  మంగళవారం (నవంబర్‌ 30) రాత్రి 9:30 గంటలకు తేలిపోనుంది. ఈ క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సంబంధించిన ఓ వార్త  బయటకు వచ్చింది. ముందు నుంచి అనుకున్నట్టుగానే డేవిడ్ వార్నర్‌ను విడిచి పెట్టేందుకు సన్‌రైజర్స్  సిద్దంగా ఉన్నట్లు సమాచారం.

అయితే సన్‌రైజర్స్ నుంచి అధికారిక ప్రకటనకు ముందే  డేవిడ్ వార్నర్ ఈ విషయాన్ని ధృవీకరించాడు. వచ్చే సీజన్‌కుగాను ఫ్రాంచైజీ తనని నిలుపుకోదని వార్నర్‌ సృష్టం చేశాడు. కాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ అభిమాని .. 'మిమ్మల్ని సన్‌రైజర్స్ రీటైన్‌ చేసుకుంటే, మీరు ఆడుతారా'..? అని ప్రశ్నించగా.. దానికి బదులుగా "వాళ్లు నన్ను రీటైన్‌ చేయరు, నేను దాని గురించి ఆలోచించడం లేదు" అంటూ వార్నర్‌ రాసుకొచ్చాడు.  ఇక డేవిడ్‌ భాయ్‌తో పాటు ఎన్నో మ్యాచ్‌ల్లో ఆ జట్టును ఒంటి చేత్తో గెలిపించిన జానీ బెయిర్‌స్టోను కూడా సన్‌రైజర్స్ రిలీజ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

నివేదికల ప్రకారం.. కేన్ విలియమ్సన్, రషీద్ ఖాన్‌లను నిలుపుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇంకా రషీద్ ఖాన్‌తో చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. ప్రస్తుతానికి సన్‌రైజర్స్‌.. విలియమ్సన్ , అబ్దుల్ సమద్ ,ఉమ్రాన్ మాలిక్‌  రిటైన్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తాజాగా ఆటగాళ్లతో కలిసి ఉన్న ఓ ఫోటోను ఇనస్టాగ్రామ్‌లో  పోస్ట్‌ చేసింది. ఈ ఫోటోకు 'తమ ప్రయాణంలో భాగమైనందుకు అందరికీ ధన్యవాదాలు' అంటూ  క్యాప్షన్‌ పెట్టింది.

చదవండిIPL 2022 Auction: ఏయే జట్లు ఎవరిని రిటైన్‌ చేసుకుంటున్నాయి? ఎంత మొత్తం ఖర్చు చేయాలి? పూర్తి వివరాలు!

మరిన్ని వార్తలు