కుటుంబ కలహాలు.. భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిందనే కోపం‍తో..

30 Nov, 2021 19:49 IST|Sakshi

న్యూఢిల్లీ: సాధారణంగా వైవాహిక జీవితంలో కొన్ని ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహలు ఉండటం సహజమే. అయితే, ఈ మధ్యకాలంలో భార్యభర్తలు క్షణికావేశంలో ఒకర్నిమరోకరు హతమార్చుకుంటున్నసంఘటలను తరచుగా వార్తల్లో చూస్తునే ఉంటాం. తాజాగా, ఇలాంటి సంఘటన ఒకటి ఢిల్లీలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాలు.. అమిత్‌ కుమార్‌, మిక్కి ఇద్దరు భార్య భర్తలు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. అమిత్‌ ప్లాస్టిక్‌ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు.  వీరు సమయ్‌పూర​ బడ్లీలోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఉండేవారు. ఇతని సోదరుడు కూడా ఇదే అపార్ట్‌మెంట్‌లో ఉండేవాడు. కాగా, అమిత్‌ కుమార్‌కు.. మిక్కికి మధ్య కలహలు చోటుచేసుకున్నాయి. దీంతో భార్య ఎవరికి చెప్పకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది.

ఆ తర్వాత మూడు రోజులకు తిరిగి వచ్చింది. అప్పటి నుంచి వీరి మధ్య గొడవలు ఇంకా ఎక్కువయ్యాయి. దీంతో భర్త.. గత సోమవారం భార్య, ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి తాను.. కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా, సోదరుడు ఈరోజు (మంగళవారం) వెళ్లి సోదరుడికి ఫోన్‌ చేశాడు. ఎంతసేపటికి కాల్‌ ఆన్సర్‌ చేయకపోవడంతో షాక్‌కు గురయ్యారు. ఆతర్వాత.. అతని ఇంటి తలుపుని తట్టారు.

ఎంతసేపటికి ఎలాంటి చప్పుడు రాకపోవడంతో.. పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటన స్థలానికి చేరుకుని అమిత్‌ ఇంటి తలుపును పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. అక్కడ.. అమిత్‌, మిక్కి, ఇద్దరు పిల్లలు.. విగత జీవులుగా పడి ఉండటాన్ని గమనించారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. వారిని పరిశీలించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు తెలిపారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  

మరిన్ని వార్తలు