'రాములో రాములా' పాటకు వార్నర్‌ డ్యాన్స్‌.. ట్రోల్‌ చేసిన భార్య

22 May, 2021 21:24 IST|Sakshi

సిడ్నీ: ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ వార్నర్‌ ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఐపీఎల్‌ 14వ సీజన్‌ రద్దుతో మాల్దీవ్స్‌ నుంచి ఆసీస్‌ చేరుకున్న ఆటగాళ్లు అక్కడి ప్రభుత్వ నిబంధనల ప్రకారం 14 రోజలు ఐసోలేషన్‌లో ఉండాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వార్నర్‌ ప్రస్తుతం సిడ్నీలోని ఒక హోటల్లో తన సహచరులతో కలిసి క్వారంటైన్‌లో ఉన్నాడు. అయితే వార్నర్‌కు క్వారంటైన్‌ పీరియడ్‌ బోర్‌ కొడుతున్నట్లుగా అనిపిస్తుంది.

కరోనా మొదటి వేవ్‌ సమయంలో లాక్‌డౌన్‌ కాలంలో వార్నర్‌ తన ఫ్యామిలీతో కలిసి టిక్‌టాక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌ ఇలా దేన్ని వదలకుండా పలు సినిమాల్లోని పాటలు, డైలాగ్స్‌ డ్యాన్సులతో అలరించాడు. ముఖ్యంగా ఇండియన్‌ సినిమాలంటే విపరీతమైన అభిమానం ఉన్న వార్నర్‌.. షారుక్‌ ఖాన్‌, ప్రబాస్‌, హృతిక్‌ రోషన్‌, మహేశ్‌బాబు, అల్లు అర్జున్‌, విజయ్‌లను ఇమిటేట్‌ చేస్తూ అలరించాడు. మొన్న రౌడీ బేబీ పాటకు డ్యాన్స్‌తో అలరించిన వార్నర్‌ తాజాగా అల్లు అర్జున్‌ అల వైకుంఠపురం సినిమాలోని సూపర్‌ హిట్‌ సాంగ్‌ రాములో రాములా పాటకు స్టెప్పులు వేశాడు. అల్లు అర్జున్‌ స్థానంలో తన ముఖాన్ని మార్ఫింగ్‌ చేసి వీడియోను రిలీజ్‌ చేశాడు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. వార్నర్‌ పెట్టిన ఈ వీడియోకు నెటిజన్లు కామెంట్లు చేశారు. అయితే ఈ వీడియోపై వార్నర్‌ భార్య కాండీ వార్నర్‌ అతన్ని ట్రోల్‌ చేయడం విశేషం. ఏంటి క్వారంటైన్‌ బోర్‌ కొడుతుందా.. వీడియోల మీద వీడియోలు చేస్తున్నావు అంటూ ట్రోల్‌ చేసింది.  క్యాండీ.. నేను లేనని సంతోషపడుతున్నావు. నా 14 రోజలు క్వారంటైన్‌ త్వరలో ముగియనుంది. నా టార్చర్‌ భరించేందుకు సిద్ధంగా ఉండు అంటూ తన భార్యకు రిప్లై ఇచ్చాడు.  

ఇక ఐపీఎల్‌ 14వ సీజన్‌ జరుగుతున్న సమయంలోనే డేవిడ్‌ వార్నర్‌ను కెప్టెన్సీ పదవి నుంచి తొలగిస్తున్నట్లు ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. వార్నర్ స్థానంలో కేన్‌ విలియమ్స్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పజెప్పింది. అయితే వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడంపై క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇక ఐపీఎల్‌ 14వ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ దారుణ ప్రదర్శన కనబరిచింది. లీగ్‌ రద్దయ్యే సమయానికి 7 మ్యాచ్‌లాడి 6 ఓటములు.. ఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది.
చదవండి: వార్నర్‌ మళ్లీ మొదలుపెట్టాడు.. ఈసారి రౌడీ బేబీతో

A post shared by David Warner (@davidwarner31)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు