వన్డేల్లోనూ..టెస్టుల్లోనూ ‘తొలి’ ఘనత!

17 Jun, 2021 10:11 IST|Sakshi

టీమిండియా, ఇంగ్లండ్‌ ఉమెన్‌ టీమ్స్‌ మధ్య జరుగుతున్న ఏకైక టెస్టు ద్వారా ఒక అరుదైన ఫీట్‌ నమోదు అయ్యింది. భారత బౌలర్‌ దీప్తి శర్మ అంపైర్‌ నిర్ణయ సమీక్షా పద్ధతి (డీఆర్‌ఎస్‌) ద్వారా ఇంగ్లండ్‌ బ్యాట్స్‌ ఉమెన్‌ నటాలియా స్కివర్‌ను అవుట్‌ చేసింది. తద్వారా డీఆర్‌ఎస్‌ ద్వారా టెస్ట్‌ ఫార్మట్‌లో తొలి వికెట్‌ దక్కించుకున్న మొదటి ఇండియన్‌ బౌలర్‌గా 23 ఏళ్ల దీప్తి ఘనత సాధించింది. 

ఇక అరుదైన ఘటన ఏంటంటే.. గతంలో వన్డేల్లోనూ డీఆర్‌ఎస్‌ ద్వారా వికెట్‌ దక్కించుకున్న తొలి ఇండియన్‌ బౌలర్‌ కూడా దీప్తి శర్మనే కావడం విశేషం. ఇంకో ఖతర్నాక్‌ విషయం ఏంటంటే.. ఆ వికెట్‌ కూడా నాట్‌ స్కివర్‌దే కావడం. జూన్‌ 24, 2017న జరిగినే వన్డే మ్యాచ్‌లో దీప్తి, స్కివర్‌ను అవుట్‌ చేసి ఈ ఫీట్‌ దక్కించుకోగా, తాజాగా (జూన్‌ 16న) టెస్ట్‌ల్లోనూ ఆ ఘనత దక్కించుకుని అరుదైన ఫీట్‌ను తన సొంతం చేసుకుంది దీప్తి శర్మ. 

ఈ విషయాన్ని ఈఎస్‌పీఎన్‌ జర్నలిస్ట్‌ అన్నెషా ఘోష్‌ తన ట్విట్టర్‌ ద్వారా ధృవీకరించింది. ఇక ఈ క్రేజీ కో ఇన్సిడెంట్‌పై నెటిజన్స్‌ రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. డీ ఫర్‌ దీప్తి.. డీ ఫర్‌ డీఆర్‌ఎస్‌ అంటూ పోస్టులు పెడుతున్నారు. మరో ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌లో భాగంగా.. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌ బుధవారం ఆట ముగిసే సమయానికి 92 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: స్మృతి మంధాన ఆస్తుల విలువ ఎంతంటే..

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు