ఆఖరి మ్యాచ్‌లో టీమిండియా ఓటమి.. ఇంగ్లండ్‌దే టీ20 సిరీస్‌ 

4 Dec, 2023 09:56 IST|Sakshi

ముంబై: భారత మహిళల ‘ఎ’ జట్టుతో జరిగిన మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను ఇంగ్లండ్‌ ‘ఎ’ జట్టు 2–1తో సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన చివరిదైన మూడో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ‘ఎ’ రెండు వికెట్ల తేడాతో భారత్‌ ‘ఎ’పై గెలిచింది. ముందుగా భారత జట్టు 19.2 ఓవర్లలో 101 పరుగులకు ఆలౌటైంది.

హైదరాబాద్‌ అమ్మాయి గొంగడి త్రిష ఏడు పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో ఇసీ వాంగ్, క్రిస్టీ, మ్యాడీ, లారెన్‌ రెండు వికెట్ల చొప్పున తీశారు. అనంతరం ఇంగ్లండ్‌ ‘ఎ’ జట్టు 19.1 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసి నెగ్గింది. ఇసీ వాంగ్‌ (28 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌) ఇంగ్లండ్‌ జట్టును  విజయతీరానికి చేర్చింది. ఆంధ్ర అమ్మాయి బి.అనూష ఒక వికెట్‌ తీసింది.  
 

>
మరిన్ని వార్తలు