రాజస్తాన్‌ ప్రతీకారం తీర్చుకుంటుందా!

14 Oct, 2020 19:06 IST|Sakshi

దుబాయ్‌ : ఐపీఎల్‌ 13వ సీజన్‌లో తొలి అంచె పోటీలు ముగిసి రెండో అంచె పోటీలు మొదలయ్యాయి. ఇక తొలి అంచెలో తమల్ని ఓడించిన జట్టుపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం మరో జట్టుకు ఉంటుంది. కాగా బుధవారం దుబాయ్‌ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో రాజస్తాన్‌ రాయల్స్‌ అమీతుమీ తేల్చుకోనుంది. కాగా టాస్‌ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌ బ్యాటింగ్‌ ఏంచుకుంది. కాగా తొలి అంచె పోటీలో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 46 పరుగుల తేడాతో రాజస్తాన్‌ ఓటమి పాలైంది. ఆ మ్యాచ్‌లో ఢిల్లీ ఆటగాడు హెట్‌మెయిర్‌ విశేషంగా రాణించడంతో రాజస్తాన్‌ లక్ష్య చేదనలో తడబడింది.

ఇక ఢిల్లీ జట్టు విషయానికి వస్తే ఈ సీజన్‌లో ఆ జట్టు ఆల్‌రౌండ​ప్రదర్శనతో అదరగొడుతుంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ ఇలా అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న ఢిల్లీకి రిజర్వ్‌ బెంచ్‌ కూడా బలంగా ఉండడం సానుకూలాంశంగా చెప్పుకోవచ్చు. అయితే ఆ జట్టును గాయాల బెడద పట్టిపీడిస్తోంది. ఇప్పటికే సీనియర్‌ స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా సేవలను కోల్పోయిన ఢిల్లీకి ఇషాంత్‌ శర్మ రూపంలో మరో ఎదురుదెబ్బ తగిలింది. గాయంతో ఇషాంత్ పూర్తి టోర్నికి దూరమయ్యాడు. మరోవైపు రిషబ్‌ పంత్‌ కూడా తొడకండరాల గాయంతో ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగడం లేదు. అయితే బ్యాటింగ్‌లో పృథ్వీ షా, శిఖర్‌ ధవన్‌, శ్రేయాస్‌ అయ్యర్‌, అజింక్యా రహానే,అలెక్స్‌ క్యారీ, ఆల్‌రౌండర్‌ స్టోయినీస్‌లతో పటిష్టంగా కనిపిస్తోంది. ఇక బౌలింగ్‌లో రబడ అద్బుత ప్రదర్శన నమోదు చేస్తూ లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా ఉన్నాడు. 

అటు రాజస్తాన్‌ రాయల్స్‌ విషయానికి వస్తే.. స్టోక్స్‌ చేరికతో ఆ జట్టు కాస్త బలంగా తయారైనట్లు కనిపిస్తోంది. సన్‌రైజర్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో విజయం సాధించి మళ్లీ టచ్‌లోకి వచ్చింది. గత మ్యాచ్‌ హీరోలు తెవాటియా, రియాన్‌ పరాగ్‌లు ఫామ్‌లో ఉండడం.. కెప్టెన్‌ స్మిత్‌, సంజూ శామ్సన్‌లు రాణిస్తే జట్టు గెలిచే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి. దీనికి తోడు స్టోక్స్‌ రాక ఆ జట్టుకు అదనపు బలం. ఊతప్ప వైఫల్యం నిరాశపరుస్తున్న వేళ ఈ మ్యాచ్‌లో అతన్ని దూరం పెట్టే అవకాశం ఉందా లేక మరో అవకాశం ఇస్తారా అన్నది చూడాలి. బౌలింగ్‌లో ఆర్చర్‌ వికెట్లు తీయకపోయినా కట్టుదిట్టమైన బంతులు వేస్తున్నాడు.మరి ఢిల్లీపై విజయం సాధించి రాజస్తాన్‌ ప్రతీకారం తీర్చుకుంటుందో లేక వారికి దాసోహం అంటుందో చూడాలి. కాగా పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్‌ రెండో స్థానంలో ఉండగా.. రాజస్తాన్‌ 7వ స్థానంలో ఉంది.

ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు :
శ్రేయస్‌ అయ్యర్‌(కెప్టెన్‌), పృథ్వీషా, శిఖర్‌ ధావన్‌, అజింక్యా రహానే‌, మార్కస్‌ స్టోయినిస్‌, అలెక్స్‌ క్యారీ‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, తషార్‌ దేశ్‌పాండే, కగిసో రబడా, అన్‌రిచ్‌ నోర్త్‌జే

రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టు :
స్టీవ్‌ స్మిత్‌(కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, బెన్‌ స్టోక్స్‌, జోస్‌ బట్లర్‌, సంజూ శాంసన్‌, మహిపాల్‌ లామ్రోర్‌, రాహుల్‌  తెవాటియా, ఆండ్రూ టై, జోఫ్రా ఆర్చర్‌, శ్రేయస్‌ గోపాల్‌, కార్తీక్‌ త్యాగి,  జైదేవ్‌ ఉనాద్కట్‌

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు