మాథ్యూస్‌ ఒక్క బంతినైనా ఆడాల్సింది.. అలా చేసి ఉంటే: దినేష్ కార్తీక్‌

10 Nov, 2023 20:51 IST|Sakshi

వన్డే వరల్డ్‌కప్‌-2023లో శ్రీలంక ఆటగాడు ఏంజులో మాథ్యూస్‌ టైమ్డ్‌ ఔట్‌తో చరిత్రకెక్కిన సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో నిర్ణీత సమయం లో తొలి బంతిని ఎదుర్కోని కారణంగా  ఔట్‌గా మాథ్యూస్‌ వెనుదిరిగాడు. అంతర్జాతీయ క్రికెట్‌ చరిత్రలో ఇలా వెనుదిరిగిన తొలి క్రికెటర్‌గా మాథ్యూస్‌ నిలిచాడు. ఇది జరిగి దాదాపు ఐదు రోజులు అవుతున్నప్పటకీ ఇంకా చర్చ జరగుతూనే ఉంది.

కొంత మంది బంగ్లా కెప్టెన్‌ షకీబ్‌ చేసింది సరైందే అంటూ మరికొంత మంది మాథ్యూస్‌ను తప్పుబడుతున్నారు. తాజాగా ఇదే విషయంపై టీమిండియా వెటరన్‌ క్రికెటర్‌ దినేష్‌ కార్తీక్‌ తన అభిప్రాయాలను వెల్లడించాడు. మాథ్యూస్‌ కనీసం ఒక్క బంతినైనా ఎదుర్కొని హెల్మెట్‌ను మార్చకోవాల్సందని కార్తీక్‌ అన్నాడు.

"హెల్మెట్ మార్చమని అభ్యర్థించడానికి ముందు మాథ్యూస్ కనీసం ఒక బంతిని ఫేస్‌ చేసి ఉంటే బాగుండేది. అప్పుడు ఎటువంటి సమస్య ఉండకపోయేది. అయితే ఆ సమయంలో అతడికి ఆ ఆలోచిన వచ్చి ఉండదు. ఆ దిశగా అతడు అస్సలు ఆలోచించలేదు. ఎందుకంటే టైమ్డ్‌ ఔట్‌కు ప్రత్యర్ధి జట్టు అప్పీలు చేస్తారని మాథ్యూస్‌ ఊహించి ఉండడు. అదే ఇక్కడ కీలకమైన అంశమని" క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తీక్‌ పేర్కొన్నాడు.
చదవండి: World Cup 2023: క్వింటన్‌ డికాక్‌ అరుదైన ఘనత.. గిల్‌క్రిస్ట్ రికార్డు సమం!

మరిన్ని వార్తలు