ఇంగ్లండ్‌ క్రికెటర్‌ సంచలన నిర్ణయం.. మరో దేశానికి వలస

22 Sep, 2021 21:08 IST|Sakshi

లండన్‌: ఇంగ్లండ్‌ జాతీయ జట్టుకు 2011-2014 మధ్యలో 24 వన్డేలు, 34 టీ20లు ఆడిన జేడ్‌ డెర్న్‌బాచ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. చాలాకాలంగా జాతీయ జట్టు నుంచి పిలుపు రాకపోవడంతో ఇంగ్లండ్‌ను వీడి మరో దేశానికి ప్రాతినధ్యం వహించాలని నిర్ణయించుకున్నాడు. వచ్చే నెలలో జరుగనున్న టీ20 ప్రపంచకప్‌-2022 ఐరోపా క్వాలిఫయర్స్‌లో భాగంగా ఇటలీ జట్టు తరఫున ఆడేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. తన తల్లి ద్వారా ఇదివరకే ఇటలీ పాస్‌ పోర్ట్‌ కలిగిన డెర్న్‌బాచ్‌.. మాజీ సహచర ఆటగాడు ప్రస్తుత ఇటలీ కోచ్‌ కమ్‌ కెప్టెన్‌ గారెత్‌ బెర్గ్‌ పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించాడు. 

డెర్న్‌బాచ్‌తో పాటు కెంట్‌ కౌంటీ జట్టు ఆటగాడు గ్రాండ్‌ స్టువార్ట్‌ కూడా ఈ ప్రపంచకప్‌ క్వాలిపయర్స్‌లో ఇటలీకి ఆడనున్నారు. మరోవైపు ఇంగ్లండ్‌ మాజీ ఆటగాడు ఓవైస్‌ షా ఇటలీ అసిస్టెంట్‌ కోచ్‌గా ఎంపికయ్యాడు. దీంతో కోచ్‌, అసిస్టెంట్‌ కోచ్‌, ఇద్దరు ఆటగాళ్లు సహా మొత్తం నలుగురు ఇంగ్లండ్‌ ఆటగాళ్లు ఇటలీకి ప్రాతనిధ్యం వహించనున్నారు. ఇదిలా ఉంటే, 35 ఏళ్ల వెటరన్‌ బౌలర్‌ జేడ్‌ డెర్న్‌బాచ్‌.. ఇంగ్లండ్‌ తరఫున వన్డేల్లో 31, టీ20ల్లో 39 వికెట్లు పడగొట్టాడు. అతను ప్రస్తుతం సర్రే కౌంటీ జట్టు కాంట్రాక్ట్‌లో ఉన్నాడు. 
చదవండి: పంజాబ్‌ ఆటగాడిపై మ్యాచ్‌ ఫిక్సింగ్‌ అనుమానం.. బీసీసీఐ సీరియస్‌

మరిన్ని వార్తలు