IND vs WI: ఛాన్స్‌లు ఇవ్వరంటారు.. ఇస్తే ఇలా ఆడుతావా? ఏంటి సంజూ ఇది?

7 Aug, 2023 11:30 IST|Sakshi

టీమిండియా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్ తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగ పరుచుకోలేకపోతున్నాడు. వెస్టిండీస్‌తో జరగుతున్న టీ20 సిరీస్‌లో సంజూ తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు.

విండీస్‌తో తొలి టీ20లో 12 పరుగులు చేసి విఫలమైన శాంసన్.. ఇప్పుడు రెండో టీ20లో కూడా అదే ఆటతీరును కనబరిచాడు. ఈ మ్యాచ్‌లో 7 పరుగులు చేసిన సంజూ.. అకిల్‌ హోస్సేన్‌ బౌలింగ్‌లో అనవసర షాట్‌కు ప్రయత్నించి పెవిలియన్‌కు చేరాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చి విఫలమైన శాంసన్‌పై సర్వాత్ర విమర్శల వర్షం కురుస్తోంది.

భారత జట్టులో చోటు కోసం యువ ఆటగాళ్ల నుంచి తీవ్ర పోటీ ఉన్న సమయంలో శాంసన్‌ ఇటువంటి పేలవ ప్రదర్శన చేయడం సరికాదని పలువరు అభిప్రాయపడుతున్నారు. సంజూ ఇదే ఆట తీరును కనబరిస్తే జట్టులో చోటు కష్టమే అంటూ నెటిజన్లు సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

చదవండి: అస్సలు ఊహించలేదు.. అతడే మా కొంపముంచాడు! కొంచెం బాధ్యతగా ఆడాలి: హార్దిక్‌

కాగా మరి కొంతమంది "జట్టులో చోటు ఇవ్వడం లేదని బీసీసీఐను ట్రోలు చేశారు.. ఛాన్స్‌ ఇస్తే ఏమి చేశాడంటూ" కామెంట్లు పెడుతున్నారు. కాగా ఐపీఎల్‌లో 3800పైగా పరుగులు చేసిన సంజూ.. అంతర్జాతీయ టీ20ల్లో మాత్రం పెద్దగా రాణించలేకపోతున్నాడు. ఇప్పటివరకు తన కెరీర్‌లో 19 టీ20 మ్యాచ్‌లు ఆడిన శాంసన్‌ 18.62 సగటుతో కేవలం 320 పరుగులు మాత్రమే చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో ఒకే ఒక హాఫ్‌ సెంచరీ ఉంది. టీ20ల్లొ శాంసన్‌ ఫామ్‌ ఎలా ఉందో.. అతడి గణాంకాలు చూస్తే మనకు తెలుస్తోంది. కాగా రెండో టీ20లో 2వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది.

చదవండి: World Cup 2023: ప్రపంచకప్‌కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. స్టార్‌ ఆటగాడిపై వేటు! యువ ఆటగాళ్లు ఎంట్రీ

  

మరిన్ని వార్తలు