FIFA WC 2022: బోణీ కొట్టిన బెల్జియం.. కెనడాకు పరాభవం

25 Nov, 2022 12:07 IST|Sakshi
గోల్‌ సాధించిన బాట్‌షుయ్‌కు సహచరుల అభినందన 

దోహా: గ్రూప్‌ ‘ఎఫ్‌’లో బుధవారం అర్ధరాత్రి జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్‌ బెల్జియం 1–0తో కెనడాను ఓడించింది. తొలి అర్ధ భాగం ముగిసే దశలో స్ట్రయికర్‌ మిచి బాట్‌షుయ్‌ (44వ ని.) గోల్‌ చేయడంతో  బెల్జియం ఖాతా తెరిచింది. అనంతరం ఈ ఆధిక్యాన్ని కాపాడుకుని టోర్నీలో శుభారంభం చేసింది.  ప్రపంచకప్‌లో గెలుపు రుచి చవిచూడాలనుకున్న కెనడా ఆశల్ని గత మెగా ఈవెంట్‌ కాంస్య పతక విజేత బెల్జియం తుంచేసింది.

వరల్డ్‌కప్‌ చరిత్రలో ఒక్కసారి 1986లో మాత్రమే ఆడిన కెనడా అప్పుడు ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఓడింది. మళ్లీ 36 ఏళ్ల తర్వాత గల్ఫ్‌ గడ్డపై జరిగే మెగా ఈవెంట్‌కు అర్హత సాధించింది కానీ... ఓటమితోనే ప్రపంచకప్‌కు శ్రీకారం చుట్టింది. నిజం చెప్పాలంటే ఈ మ్యాచ్‌లో కెనడా... బెల్జియంకు దీటుగా రాణించింది.

ప్రపంచ రెండో ర్యాంకర్‌ 46 శాతం బంతిని ఆ«దీనంలో ఉంచుకుంటే... కెనడా కూడా 43% తమ ఆ«దీనంలో పెట్టుకొని గోల్స్‌ కోసం మేటి ప్రత్యర్థి కంటే ఎక్కువసార్లే ప్రయతి్నంచింది. ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై 21 సార్లు దాడులు చేసింది. కానీ ప్రతీసారి నిరాశ తప్పలేదు. మరో వైపు మెరుగైన బెల్జియం 9 సార్లు ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌వైపు దూసుకొచ్చి ఒకసారి సఫలమైంది.   

మరిన్ని వార్తలు