న్యూజిలాండ్‌తో మ్యాచ్‌.. హార్దిక్‌ స్ధానంలో అతడే సరైనోడు: హర్భజన్

21 Oct, 2023 15:48 IST|Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023లో బాగంగా టీమిండియా ఆక్టోబర్‌ 22న ధర్మశాల వేదికగా న్యూజిలాండ్‌తో తలపడేందుకు సిద్దమైంది. ఇప్పటికే ధర్మశాలకు చేరుకున్న ఇరు జట్లు ప్రాక్టీస్‌లో మునిగితేలుతున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ గాయం కారణంగా కారణంగా దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో కివీస్‌తో మ్యాచ్‌కు హార్దిక్‌ స్ధానంలో ఎవరని ఆడించాలన్నది భారత జట్టు మేనెజ్‌మెంట్‌కు తల నొప్పిగా మారింది.

కొంతమంది హార్దిక్‌ స్ధానాన్ని ఇషాన్‌ కిషన్‌తో భర్తీ చేయాలలని కొంతమంది సూచిస్తుంటే.. మరి కొంతమంది సూర్యకుమార్‌ యాదవ్‌ను తీసుకోవాలని అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఇదే విషయంపై  భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తన అభిప్రాయాలను వెల్లడించాడు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగాలని భజ్జీ సూచించాడు.

ధర్మశాలలో బంతి ఎక్కువగా స్వింగ్‌ అయ్యే అవకాశం ఉన్నందుకున్న పేసర్‌ మహ్మద్‌ షమీని జట్టులోకి తీసుకోవాలని హర్భజన్ సలహా ఇచ్చాడు. అదే విధంగా హార్దిక్‌ పాండ్యా స్ధానంలో సూర్యకుమార్‌ యాదవ్‌కు అవకాశం ఇవ్వాలని హర్భజన్ తెలిపాడు.

"న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు ముందు హార్దిక్ పాండ్యా గాయపడటం భారత జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ. అతడకి బ్యాట్‌తో పాటు బంతితో అద్భుతంగా రాణించగల సత్తా ఉంది.  కివీస్‌తో మ్యాచ్‌కు హార్దిక్‌ స్ధానంలో సూర్యకుమార్ యాదవ్‌ను జట్టులోకి తీసుకోవాలి. సూర్య జట్టుకు మంచి ఫినిషింగ్‌ అందించగలడు.

అదే విధంగా శార్థూల్‌ ఠాకూర్‌కు  ఆల్ రౌండర్‌  సామర్థ్యాల కారణంగానే జట్టులో అవకాశమిస్తున్నారు. కానీ అతడు బౌలింగ్‌ పరంగా అంతగా అకట్టుకోలేకపోయాడు. కాబట్టి అతడి స్ధానంలో మహమ్మద్ షమీని తీసుకురావాలి. ఎందుకంటే అతడు తన 10 ఓవర్ల కోటాను అద్బుతంగా పూర్తి చేయగలడు" ఆజ్‌టాక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు.
చదవండి: WC 2023: నెదర్లాండ్స్‌ చేతిలో చిత్తుగా ఓడిన సౌతాఫ్రికాకు మరో షాక్‌!

మరిన్ని వార్తలు