‘వారి వల్ల కాకపోతే తెవాటియా గెలిపిస్తాడు’

30 Oct, 2020 20:36 IST|Sakshi
రాహుల్‌ తెవాటియా(ఫైల్‌ఫోటో)

లండన్‌:  కింగ్స్‌ పంజాబ్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ను రాహుల్‌ తెవాటియా  గెలిపిస్తాడని అంటున్నాడు ఇంగ్లండ్‌ మాజీ స్పిన్నర్‌ గ్రేమ్‌ స్వాన్‌. కచ్చితంగా తెవాటియా ఒక మ్యాచ్‌ విన్నర్‌ అని, అది కింగ్స్‌ పంజాబ్‌తో మ్యాచ్‌లో చూస్తామన్నాడు. రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టులో రియల్‌ టాలెంట్‌ ఉందంటూ స్వాన్‌ కొనియాడాడు. కింగ్స్‌ పంజాబ్‌ జట్టు క్రిస్‌ గేల్‌ వచ్చిన తర్వాత బలంగా మారిపోయిందని విషయంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. కానీ రాజస్తాన్‌ జట్టు కూడా విదేశీ ఆటగాళ్లతో చాలా పటిష్టంగా ఉందన్నాడు. స్టార్‌ స్పోర్ట్స్‌ గేమ్‌ ప్లాన్‌ షోలో మాట్లాడిన స్వాన్‌.. రాజస్తాన్‌ జట్టుపై ప్రశంసలు కురిపించాడు. ఇక్కడ తెవాటియాను మ్యాచ్‌ విన్నర్‌గా ప్రశంసించాడు. (ఈపీఎల్‌ను దాటేసిన ఐపీఎల్‌!)

‘కింగ్స్‌​ పంజాబ్‌ చాలా బలమైన జట్టు. అందులో ఎటువంటి సందేహం లేదు. గేల్‌ వచ్చిన తర్వాత పంజాబ్‌ ఆటే మారిపోయింది. కానీ రాజస్తాన్‌ కూడా బలమైన జట్టే. ఓవర్‌సీస్‌ ఆటగాళ్లతో రాజస్తాన్‌ బలంగా ఉంది. బట్లర్‌, స్టోక్స్‌, స్మిత్‌, ఆర్చర్‌లు వారి ప్రధాన బలం. వారు భయంలేని క్రికెట్‌ ఆడతారు. ఒకవేళ వీరంతా విఫలమైతే తెవాటియా రాజస్తాన్‌ను గెలిపిస్తాడు. ఈ ఐపీఎల్‌లో ఎవరు ముఖ్యపాత్ర పోషించే బౌలర్‌ అని అడిగిన ప్రశ్నకు ఆర్చర్‌ అని సమాధానమిచ్చాడు స్వాన్‌.ఈ సీజన్‌లో తెవాటియా 12 మ్యాచ్‌ల్లో 224 పరుగులు సాధించాడు. అందులో అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 53. అది కూడా పంజాబ్‌పైనే కొట్టాడు తెవాటియా. పంజాబ్‌పై అతని యావరేజ్‌ 44.80గా ఉండగా, స్టైక్‌రేట్‌ 143.58గా ఉంది. ఇక బౌలింగ్‌లో 7.15 ఎకానమీతో 7 వికెట్లు సాధించాడు. (ప్లేఆఫ్స్‌ రేసు: ఎవరికి ఎంత అవకాశం?)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు