IND vs AUS: దినేష్ కార్తీక్ ముందే పసిగట్టాడా? ఆసీస్ కుప్పకూలుతుందని..

21 Feb, 2023 19:17 IST|Sakshi

ఢిల్లీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో 6 వికెట్ల తేడాతో టీమిండియా విజయ భేరి మోగించిన సంగతి తెలిసిందే. కేవలం రెండునర్న రోజుల్లోనే మ్యాచ్‌ను భారత్‌ ఫినిష్‌ చేసింది. ఒక సెషన్‌లోనే ఆస్ట్రేలియా పేకమేడలా కుప్పకూలింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్‌లో 2-0 అధిక్యంలోకి భారత్‌ దూసుకెళ్లింది.

ఇక ఇది ఇలా ఉండగా.. ఆస్ట్రేలియా కేవలం ఒకే సెషన్‌లోనే కుప్పకూలుతుందని భారత వెటరన్‌ క్రికెటర్‌ దినేష్‌ కార్తీక్‌ ముందే ఊహించాడు. రెండో రోజు ఆట అనంతరం క్రిక్‌బజ్‌ షోలో మాట్లాడిన కార్తీక్‌కు, ప్రముఖ వాఖ్యత హార్షా బోగ్లే నుంచి ఓ ప్రశ్న ఎదురైంది. ఆస్ట్రేలియా అద్భతమైన పునరాగమనం చేసింది, భారత్‌ ముందు ఎంత లక్ష్యాన్ని ఉంచలగలదు అని కార్తీక్‌ను బోగ్లే ప్రశ్నించాడు.

దానికి బదులుగా కార్తీక్‌.. ఆసీస్‌ టీమిండియా ముందు 120 నుంచి 130 పరుగుల టార్గెట్‌ ఉంచినా ఆశ్చర్యపోనక్కర్లేదు లేదని సమాధానమిచ్చాడు. కార్తీక్‌ ఊహించినట్లగానే ఆస్ట్రేలియా మూడో రోజు ఆట సందర్భంగా తమ రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 113 పరుగులకే చాప చుట్టేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను క్రిక్‌బజ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇక భారత్‌-ఆస్ట్రేలియా  జట్ల మధ్య మూడో టెస్టు ఇండోర్‌ వేదికగా మార్చి 1 నుంచి ప్రారంభం కానుంది.
చదవండి: IND vsAUS: ఓటమి బాధలో ఉన్న ఆసీస్‌కు గుడ్‌న్యూస్‌! విధ్వంసకర వీరుడు వచ్చేస్తున్నాడు

మరిన్ని వార్తలు