World cup 2023: సెమీఫైనల్‌కు చేరిన టీమిండియా.. ఆసీస్‌, న్యూజిలాండ్‌ రికార్డు సమం

2 Nov, 2023 22:01 IST|Sakshi

వవన్డే ప్రపంచప్‌-2023లో టీమిండియా జైత్ర యాత్ర కొనసాగుతోంది. ఈ టోర్నీలో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో​ 302 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఈ మెగా ఈవెంట్‌ సెమీఫైనల్లో రోహిత్‌ సేన అడగుపెట్టింది. దాంతో ఈ ఏడాది వరల్డ్‌కప్‌లో సెమీస్‌ చేరిన తొలి జట్టుగా టీమిండియా నిలిచింది. 

ఆస్ట్రేలియా, కివీస్‌తో సంయుక్తంగా..
ఇక వన్డే వరల్డ్‌కప్‌ సెమీఫైనల్‌కు టీమిండియా క్వాలిఫై కావడం ఎనిమిదో సారి. తద్వారా వరల్డ్‌కప్‌ సెమీఫైనల్స్‌కు అత్యధిక సార్లు అర్హత సాధించిన జట్టుగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో సంయుక్తంగా భారత్‌ నిలిచింది. ఆసీస్‌, కివీస్‌ కూడా ఇప్పటి వరకు 8 సార్లు వరల్డ్‌కప్ టోర్నీల్లో సెమీస్‌లో అడుగుపెట్టాయి.

రెండు సార్లు వరల్డ్‌ ఛాంపియన్స్‌గా..
8 సార్లు ప్రపంచకప్‌ సెమీఫైనల్స్‌లో అడుగుపెట్టిన భారత్‌.. అందులో రెండు సార్లు భారత జట్టు వరల్డ్‌ ఛాంపియన్స్‌గా నిలిచింది. 1983, 2011 వన్డే ప్రపంచకప్‌ టైటిల్‌లను భారత్‌ సొంతం చేసుకుంది. 2003 వరల్డ్‌కప్‌ ఫైనల్‌కు భారత్‌ చేరినప్పటికీ.. ఆస్ట్రేలియా చేతిలో ఆఖరి మెట్టుపై బోల్తాపడింది. 2003 వరల్డ్‌కప్‌ రన్నరప్‌గా గంగూలీ సారథ్యంలోని టీమిండియా నిలిచింది.  కాగా ముచ్చటగా మూడో సారి వరల్డ్‌కప్‌ టైటిల్‌ను భారత్‌ ముద్దాడాలని అభిమానులు ఆశిస్తున్నారు.
చదవండి: Rohit Sharma: అధికారికంగా అర్హత సాధించాం.. అతడు అద్భుతం.. వాళ్ల వల్లే ఇలా.. మా జైత్రయాత్రకు కారణం అదే!

మరిన్ని వార్తలు