యూట్యూబర్‌ను పెళ్లాడిన టీమిండియా పేసర్‌.. సిరాజ్‌ విషెస్‌

24 Nov, 2023 12:40 IST|Sakshi

Navdeep Saini Gets arried to Girlfriend: టీమిండియా పేసర్‌ నవదీప్‌ సైనీ వివాహ బంధంలో అడుగుపెట్టాడు. చిరకాల ప్రేయసి స్వాతి ఆస్తానాను పెళ్లాడాడు. ఈ శుభవార్తను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు నవదీప్‌.

ఈ మేరకు.. ‘‘నీతో ఉంటే ప్రతిరోజూ నేను ప్రేమలో పడుతూ ఉంటా.. ఈరోజు నుంచి మేమిద్దరం కలకాలం కలిసి ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం. జీవితంలో కొత్త అధ్యాయం ఆరంభించిన మాకు మీ ప్రేమ, ఆశీర్వాదాలు కావాలి’’ అని నవదీప్‌ సైనీ గురువారం తన పెళ్లి ఫొటోలను షేర్‌ చేశాడు.

ఈ క్రమంలో మహ్మద్‌ సిరాజ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, రాహుల్‌ తెవాటియా, సాయికిషోర్‌, చేతన్‌ సకారియా, మన్‌దీప్‌ సింగ్‌, మొహ్సిన్‌ ఖాన్‌ తదితర భారత క్రికెటర్లు నవదీప్‌- స్వాతి దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

కర్నాల్‌ కుర్రాడు
హర్యానాకు చెందిన నవదీప్‌ సైనీ 2019లో టీమిండియా తరఫున అంతర్జాతీయ టీ20, వన్డేల్లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత రెండేళ్లకు టెస్టుల్లోనూ అరంగేట్రం చేశాడు. ప్రఖ్యాత సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌లో పటిష్ట ఆస్ట్రేలియా జట్టుతో తన టెస్టు ప్రస్థానం మొదలుపెట్టాడు.

ఇక ఇంటర్నేషనల్‌ కెరీర్‌లో ఇప్పటి వరకు మొత్తంగా 8 వన్డేలు, 11 టీ20లు, 2 టెస్టులు ఆడిన ఈ 31 ఏళ్ల రైటార్మ్‌ పేసర్‌.. ఆయా ఫార్మాట్లలో 6, 13, 4 వికెట్లు పడగొట్టాడు. కాగా నవదీప్‌ సైనీ టీమిండియా తరఫున చివరిసారిగా.. శ్రీలంకతో టీ20 సిరీస్‌ సందర్భంగా మైదానంలో దిగాడు.

ఇక ఐపీఎల్‌లో అతడు గతేడాది రాజస్తాన్‌ రాయల్స్‌కు ప్రాతినిథ్య వహించాడు. ఇటీవల సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ(టీ20) సందర్భంగా ఢిల్లీకి ఆడాడు.  

ఎవరీ స్వాతి ఆస్తానా?!
నవదీప్‌ను పెళ్లాడిన స్వాతి ఆస్తానా ఫ్యాషన్‌, ట్రావెల్‌, లైఫ్‌స్టైల్‌ వ్లాగర్‌. ఆమెకు సొంతంగా యూట్యూబ్‌ చానెల్‌ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 84 వేల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు.  ఇక తమ వివాహ వేడుకలో స్వాతి- నవదీప్‌ పేస్టల్‌ కలర్‌ సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు.

A post shared by Navdeep Saini (@navdeep_saini10_official)

చదవండి: ఐపీఎల్‌-2024కు ముందు చెన్నై సూపర్‌ కింగ్స్‌కు బిగ్‌ షాక్‌..

మరిన్ని వార్తలు