భారత జట్లకు సులువైన డ్రా

19 Aug, 2021 05:37 IST|Sakshi

థామస్‌–ఉబెర్‌ కప్‌ బ్యాడ్మింటన్‌

న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్‌ టీమ్‌ ఈవెంట్‌ టోర్నీ థామస్, ఉబెర్‌ కప్‌లలో భారత జట్లకు సులువైన డ్రా ఎదురైంది.  డెన్మార్క్‌లోని అర్హస్‌లో అక్టోబర్‌ 9 నుంచి 17 వరకు ఈ టోర్నీలు జరుగనున్నాయి. పురుషుల టోర్నీ థామస్‌ కప్‌లో భారత జట్టు గ్రూప్‌‘సి’లో డిఫెండింగ్‌ చైనా, నెదర్లాండ్స్, తాహిటిలతో తలపడనుంది. ఈ గ్రూప్‌లో చైనా మింగుడుపడని ప్రత్యర్థి అయినప్పటికీ మిగతా జట్టు నెదర్లాండ్, తాహిటిలపై గెలవడం ద్వారా నాకౌట్‌కు అర్హత సంపాదించవచ్చు. మహిళల టోర్నీ ఉబెర్‌ కప్‌లో భారత్‌ గ్రూప్‌ ‘బి’లో ఉంది. థాయ్‌లాండ్, స్పెయిన్, స్కాట్లాండ్‌ ప్రత్యర్థులు కాగా, ఇందులో ముందంజ వేయడం అంత కష్టమైన పనే కాదు. ఉబెర్‌ కప్‌లో భారత మహిళల జట్టు 2014, 2016లో సెమీస్‌ చేరింది. గతేడాది మేలో జరగాల్సిన ఈ టోర్నీ కరోనాతో వాయిదా పడింది.

మరిన్ని వార్తలు