IND Vs SA: దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు.. భారత తుది జట్టు ఇదే! ఓపెనర్లు ఎవరంటే?

24 Dec, 2023 14:14 IST|Sakshi
PC: sports tak

దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమిండియా.. ఇప్పుడు అదే జట్టుతో టెస్టు సిరీస్‌కు సిద్దమైంది. వన్డే వరల్డ్‌కప్‌ ఓటమి తర్వాత తొలిసారి పూర్తి స్ధాయి జట్టుతో బరిలోకి దిగనుంది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి, పేస్‌ గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా ప్రోటీస్‌లో టెస్టు సిరీస్‌కు భారత జట్టులో భాగమయ్యారు.

డిసెంబర్‌ 26న సెంచరీ జరగనున్న తొలి టెస్టుతో ఈ రెడ్‌బాల్‌ సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో దక్షిణాఫ్రికాతో టెస్టుకు భారత ప్లేయింగ్‌ ఎలెవన్‌ను టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఎంచుకున్నాడు. ఆరుగురు స్పెషలిస్టు బ్యాటర్లు, ఇద్దరు ఆల్‌రౌండర్లు, ముగ్గురు ఫాస్ట్‌ బౌలర్లను గవాస్కర్‌ ఎంపిక చేశాడు.

'నేను ఎంచుకున్న ప్లేయింగ్‌ చాలా సింపుల్‌గా ఉంటుంది. భారత ఇన్నింగ్స్‌ను యశస్వీ జైశ్వాల్‌, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ప్రారంభించాలని నేను కోరుకుంటున్నాను. అదే విధంగా మూడు, నాలుగు స్ధానాల్లో వరుసగా శుబ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి ఆడే అవకాశముంది. ఐదో స్ధానంలో కేఎల్‌ రాహుల్‌ బ్యాటింగ్‌కు రానున్నాడు. శ్రేయస్‌ అయ్యర్‌ ఆరో స్ధానంలో ఆడనున్నాడని అనుకుంటున్నాను.

అయితే మ్యాచ్‌ పరిస్థితుల బట్టి అయ్యర్‌ బ్యాటింగ్‌ పొజిషేన్‌ మారే ఛాన్స్‌ ఉంది. ఆ తర్వాత రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌ బ్యాటింగ్‌కు రానున్నారు. ఆపై ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ నేను ఎంచుకున్న తుది జట్టులో ఉంటారని ' అని స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ గవాస్కర్ అన్నాడు. కాగా గవాస్కర్‌ ఓపెనర్‌గా గిల్‌కు ఛాన్స్‌ ఇ‍వ్వకపోవడం గమానార్హం.

సునీల్ గవాస్కర్ ఎంచుకున్న భారత జట్టు ఇదే: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్‌ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా,మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా (వైస్‌ కెప్టెన్‌),

దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు టీమిండియా:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్‌ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా (వైస్‌ కెప్టెన్‌), ప్రసిద్ధ్ కృష్ణ, అభిమన్యు ఈశ్వరన్‌.

>
మరిన్ని వార్తలు